రాయచోటి: రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుల ఆగడాలకు ఒక వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. రాయచోటి టౌన్ లోని 3వ వార్డుకు చెందిన షేక్. గోవింద్ బాబు అనే యువకుడికి చెందిన ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. ఈకేవైసీ చేస్తామని నమ్మబలికి గోవింద్బాబు పేరుతో ఉన్న ఇంటిని స్థానిక రియల్ఎస్టేట్ బ్రోకర్లు జాబీర్, 3వ వార్డు కౌన్సిలర్, వైసిపి మైనారిటీ నేత అల్తాఫ్ లు కలిసి కబ్జాకు పాల్పడ్డారు. గోవింద్బాబుకు చెందిన ఇంటిని స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ అల్తాఫ్ తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గోవిందా బాబు గత బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గోవింద్బాబు ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితుడికి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో వైసీపీ నేతలు గోవిందా బాబును మోసం చేసి ఇంటిని కబ్జా చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.