నరసరావుపేట: దళిత గర్జనకు వెళ్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పల్నాడు జిల్లా టీడీపీ ఎస్సీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు, పల్నాడు జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు సాతులూరి కుమార్ అక్రమ అరెస్టులను ఖండిరచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను ఉన్నత స్థానంలో తీసుకెళ్తానని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు తీరని అన్యాయం చేశాడని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 27 సంక్షేమ పథకాలు ఇస్తే వైసిపి ప్రభుత్వం వాటిని రద్దు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండపోగు సునీల్, టిడిపి ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు పెరికల రాయప్ప, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గల్లె పోగు ప్రేమ్ కుమార్, ఎస్సీ సెల్ నరసరావుపేట మండల అధ్యక్షులు గర్నపూడి నాయుడు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లవరపు చిన్న, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు మాతంగి బంగారం, ఎస్సీ సెల్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఉప్పలపాటి విజయ్, టిడిపి నాయకులు కొత్త ఏసోబు తదితరులు పాల్గొన్నారు.