చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గురువులపై దాడిచేసిన గొడ్డలి పార్టీ

రాప్తాడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్

by చైతన్యరధం
Sep 23, 2026 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
గురువులపై దాడిచేసిన గొడ్డలి పార్టీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రౌడీ బ్యాచ్ ఎక్కడున్నా వదలం!
  • నాపై కోపం ఉంటే తేల్చుకుందాం… రా…
  • టీచర్ల జోలికొస్తే సహించేది లేదు!
  • డేట్, టైమ్ ఫిక్స్ చేయి…
  • డీఎస్సీతోపాటు ఏపీపీఎస్సీ, కల్తీ మద్యంపైనా చర్చిద్దాం
  • నీతి నిజాయితీలతో బతికిన కుటుంబం మాది…
  • చంద్రబాబుపై ఒక్క ఆరోపణనైనా నిరూపించగలిగారా?
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు…
  • ఇప్పుడు భయపడతామా జగన్?!
  • రాప్తాడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్

రాప్తాడు (చైతన్య రథం): నిన్న శాప్ కార్యాలయం వద్ద విద్యనేర్పే గురువులపై గొడ్డలిపార్టీ రౌడీమూకలు విచక్షణారహితంగా గుడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్‌లో ఏ ఒక్కరినీ వదలిపెట్టం. ఏపీలోనే కాదు, అండమాన్‌లో ఉన్నా, ఆస్ట్రేలియా వెళ్లినా పట్టుకొచ్చి జైల్లో వేస్తామని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పష్టం చేశారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ టెన్త్ క్లాస్ తప్పాడు. అందువల్లే టీచర్లపై కక్ష పెంచుకున్నాడు. నిన్న ఉపాధ్యాయులపై రౌడీమూకలను ఉసిగొల్పాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేం భయపడలేదు, ఇప్పుడు భయపడతామా? నీతి, నిజాయితీగా బతికిన కుటుంబం మాది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైలులో పెట్టారు, ఒక్కటైనా నిరూపించగలిగారా? ఆయనపై పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడలేదు. నాపై కోపం ఉంటే నేరుగా రా… టైమ్, డేట్ ఫిక్స్ చెయ్యి, తేల్చుకుందాం. కల్తీ మద్యం, ఏపీపీఎస్సీపై కూడా చర్చిద్దాం. నాపై కోపం ఉంటే నాతో తేల్చుకో. అంతేగానీ ఉపాధ్యాయుల జోలికొస్తే సహించేది లేదని లోకేష్ హెచ్చరించారు.

అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్!
అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే వచ్చే రూపమే జగన్. నిజం చెబితే తల వెయ్యి ఒక్కలు అవుతుందని ఆయనకు శాపం ఉంది. అందుకే ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. అయిదేళ్లు ఒక్క డీఎస్సీ ప్రకటించలేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదు. బాబు గారు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారు. దానిని ముందుకు సాగనీయకుండా చేసేందుకు వైసీపీ నాయకులు 300 కేసులు వేశారు. ఎక్కడా కోర్టు తప్పుపట్టలేదు. 150 రోజుల్లో 16 వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. వారందరికీ అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చాం. ఏడాది తర్వాత ఇప్పుడు వచ్చి అవినీతి జరిగింది అంటున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం గెలవాలి
గత సార్వత్రిక ఎన్నికల్లో 94 శాతం సీట్లతో ఘనవిజయం సాధించాం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే. వచ్చేనెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ సిద్ధంకావాలి. రెండున్నరేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాలపై ప్రజల్లో చైతన్యం తేవాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ముందుకెళదాం. విజయం కోసం కలసికట్టుగా ముందుకు సాగుదాం. అన్నిస్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిపించేందుకు కార్యకర్తలంతా కార్యోన్ముఖులు కావాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల మనం కోరిన అన్ని కోర్కెలు ప్రధాని తీరుస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలసికట్టుగా ముందుకెళ్లాలి. నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. మనది ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం.

గొడ్డలి పార్టీ అనుబంధ విభాగాలు వేరు!
మనకు తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి వంటి అనుబంధ విభాగాలు ఉన్నాయి. వైసీపీ వాళ్లకు కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి. అవి గొడ్డలి, గంజాయి, హిట్ అండ్ రన్, మహిళలను అవమానించడం, టీచర్లపై దాడిచేయడం వంటివి వారి విభాగాలు. మన పార్టీలో పరిటాల శ్రీరామ్ లాంటి అద్భుతమైన యువ నాయకత్వం ఉంది. ప్రజలకు సేవే చేసే నాయకత్వం మనది. వారి పార్టీలో హిట్ అండ్ రన్‌లో జైలుకెళ్లిన వాడొకడు, భూకబ్జాలు, నకిలీ పత్రాలు సృష్టించిన వాడు మరొకడు, వరకట్నం కోసం భార్యను వేధించేవాడొకడు ఉన్నారు. గొడ్డలి పార్టీ నాయకత్వానికి, టీడీపీ లీడర్‌షిప్‌కి తేడా ప్రజలు గమనించాలి. చంద్రబాబు మాకు ఓర్పు నేర్పడం వల్లే ఓపిగ్గా ఉన్నాం. లేకపోతే వైసీపీ నాయకుల కథ మరోలా ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణ వల్లే నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాసేవలో ముందుకు సాగుతున్నాం. మరో వందేళ్లు ప్రజలకు సేవ చేసేలా పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు అవసరం
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. అహంకారం, ఇగో వద్దు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో 2019లో తొలిసారి ఓడిపోయా. అయిదేళ్లు కష్టపడి ప్రజలతో మమేకమై, వారి మనసు గెలుచుకున్నా. రాష్ట్ర చరిత్రలో మూడవ అత్యధిక మెజారిటీతో గెలిచా. సంక్షేమం, అభివృద్ధితోపాటు ప్రజల మనసు గెలిస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలం. ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. మీరిచ్చిన ఫీడ్‌బ్యాక్ వల్లే కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రజల్లో చైతన్యం తెస్తే మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తాం. వరుసగా ఒకే ప్రభుత్వం రావడం వల్లే ఒరిస్సా, గుజరాత్‌లో అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో ఒకసారి మాత్రమే, అది కూడా చంద్రబాబు గారివల్లే వరుసగా టీడీపీ గెలిచింది. ప్రతిరూపాయి ఆదాయంలో 94 పైసలు జీతాలకే సరిపోతోంది. ఆదాయాన్ని పెంచడంతోపాటు పెద్దఎత్తున సంక్షేమాన్ని అందిస్తున్నాం. వృద్ధులకు 4 వేల పెన్షన్, స్త్రీశక్తి, దీపం, నేతన్నల సేవలో, ఆటోవాల సేవలో తదితర పథకాలు అందిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.

సేవాభావం అనంతపురం బ్లడ్‌లోనే ఉంది
మెడపై కత్తిపెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు టీడీపీకే సొంతం. రాప్తాడుకు వచ్చినప్పుడు నాకు ఘనస్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలకు పేరుపేరునా నమస్కారాలు. కళల కాణాచి లేపాక్షి, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, ప్రశాంతి నిలయం కొలువై ఉన్న నేల ఉమ్మడి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్న సత్యసాయి జన్మించిన నేల అనంతపురం. నేను ఒకేసారి ఆయనను కలిశాను. దశాబ్దాల తర్వాత కూడా బాబా ఏ ఆలోచనతో సంస్థను స్థాపించారో ఇటీవల అక్కడ అదే క్రమశిక్షణ, పట్టుదల చూశా. ప్రజలకోసం దశాబ్దాల క్రితం స్థాపితమైన ఆర్‌డీటీ అనంతపురానికి అద్భుతమైన సేవలందిస్తోంది. సేవ మన బ్లడ్‌లోనే ఉంది. అందుకే అన్న ఎన్టీఆర్ అనంతపురం జిల్లాను సొంతం చేసుకున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. హరికృష్ణ, బాల మామయ్యలను శాసనసభకు పంపిన ఘనత అనంతపురం జిల్లాదే.

పరిటాల కుటుంబంతో దశాబ్దాల అనుబంధం
పరిటాల కుటుంబంతో మా కుటుంబ అనుబంధం దశాబ్దాల నాటిది. అన్యాయం జరిగిన చోట ఎదురొడ్డి నిలబడాలన్నది ఇరు కుటుంబాల ధ్యేయం. మహిళల జోలికొస్తే తోలు తీయాలన్న లక్ష్యంతో పనిచేశాం. భూస్వాములతో పోరాడి నిరుపేదలకు భూమి పంచారు పరిటాల శ్రీరాములయ్య. ఫ్యాక్షన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు పరిటాల రవీంద్ర. తనకు ప్రమాదం ఉందని తెలిసినా కార్యకర్తలను వెంటాడి చంపితే అండగా వెళ్లి, ప్రాణాలను కోల్పోయారు. కాంగ్రెస్, వైసీపీ హయాంలో ఉమ్మడి అనంతపురంలో 164 మంది కార్యకర్తలను కోల్పోయాం. చంద్రబాబు గారు కార్యకర్తలు ఫ్యాక్షన్ వైపు వెళ్లకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూలు ఏర్పాటుచేశారు. ప్రతివారం ఎన్టీఆర్ మోడల్ స్కూలుకు వెళ్లి పిల్లల్లో ధైర్యం నింపారు. వారిని ప్రయోజకులను చేసిన ఘనత చంద్రబాబుది.

అవినీతిలో “తోపు” కేడర్‌ను ఇబ్బందిపెట్టాడు!
2019 నుంచి 24 వరకు రాప్తాడులో ఒక గొడ్డలిపార్టీ దొంగ… అవినీతిలో తోపు టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టాడు. తప్పుడు కేసులు బనాయించాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తగ్గేది లేదు, కార్యకర్తలు ఎదురొడ్డి పోరాడారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు. నాపై 23 కేసులు పెట్టారు. పోరాటం మన బ్లడ్‌లో ఉంది. రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి లేదు. ఒకవైపు దాడులు, మరో వైపు అవినీతి రాజ్యమేలాయి. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి సునీతమ్మను గెలిపించిన ఘనత రాప్తాడు ప్రజలది. మనమంతా ప్రజలకు అండగా నిలబడాలి. కలసికట్టుగా పోరాడాలి. జాకీ లాంటి సంస్థలను గత ప్రభుత్వంలో తరిమేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. పార్టీ కేడర్‌పై పెట్టిన దొంగ కేసులు తొలగించే బాధ్యత నాది. ఇప్పటికే 80 శాతం తప్పుడు కేసులు తొలగించాం. కొన్ని కోర్టువరకు వెళ్లాయి. న్యాయనిపుణుల సహకారంతో ఎన్నికల్లోపు ఆ కేసులు కూడా తీయించే బాధ్యత నాది.

కార్యకర్తే అధినేత నినాదం ఆచరణలో చూపుతున్నాం!
ఇటీవల కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ప్రతి సమావేశంలో జై కార్యకర్త అనాలని పిలుపునిచ్చాం. 2025 కడప మహానాడులో కార్యకర్తే అధినేత నినాదాన్ని తీసుకోవడమేగాక, ఆచరణలో అమలుచేస్తున్నాం. నేను, బాబు గారు ఏ కార్యక్రమానికి వెళ్లినా కార్యకర్తను కలిశాకే వెళ్తున్నాం. తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాత, మంజుల, చెన్నుపాటి గాంధీ మనకు స్ఫూర్తి ప్రదాతలు. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడికి జై కొట్టమంటే చంద్రయ్య జై చంద్రబాబు అని ప్రాణాలొదిలారు. చట్టాన్ని సవరించి, చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కార్యకర్తల త్యాగాలను చంద్రబాబు మరువరు. కార్యకర్తల కోసం ప్రమాద బీమా తెచ్చాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.175 కోట్లు కార్యకర్తలకు అందించి ఆదుకున్నాం. కార్యకర్తల ఆరోగ్యం చూసుకునే బాధ్యత నాది. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలకు రక్తపరీక్షలు చేయిస్తే 75 శాతం మందికి ఆరోగ్యం సరిగాలేదు. అందరూ పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యం బాగుంటే కుటుంబసభ్యులు బాగుంటారు, పార్టీ బాగుంటుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి మందులు కూడా ఉచితంగా అందిస్తాం.

కష్టపడి పనిచేస్తే పదవులు వెదుక్కుంటూ వస్తాయి
పార్టీలో సంస్కరణల కోసం నేను పార్టీలో అంతర్గతంగా పోరాటం చేశా. జిల్లా నుంచి పార్లమెంటు పార్టీ వ్యవస్థ కోసం మూడు పొలిట్ బ్యూరో సమావేశాల్లో నా వాదన విన్పించా. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం. పనిచేసే వారిని గుర్తిస్తాం. అందుకే మై టీడీపీ యాప్ తెచ్చాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం అప్‌డేట్ చేయండి. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల్లో డోర్ టు డోర్ చేసిన ఘనత మన పార్టీది. మీరు ప్రజల చుట్టూ తిరగండి, పదవులు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. పనిచేయకుండా పదవులు రావాలంటే కుదరదు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. కార్యకర్తలంతా గుర్తు పెట్టుకోవాలి. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాం. 10 వేల పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ఫైటర్ జెట్ నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ వరకు ఎన్నో పరిశ్రమలు రాయలసీమకు తెచ్చాం. నిజం గడపదాటేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది, మనం చేసిన అభివృద్ధి, సంక్షేమంతోపాటు గొడ్డలిపార్టీ తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ చేయండి, మిమ్మల్ని వెదికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. వడ్డెర సామాజికవర్గానికి చెందిన రమాదేవిని ఎమ్మెల్సీని చేశాం. ఆమె అడగకపోయినా వెదికి బాబుగారు పదవి ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్‌చార్జిని పొలిట్ బ్యూరో సభ్యులను చేశాం. మీరు చేసే కార్యక్రమాలు పార్టీకి తెలియజేయండి. మిమ్మల్ని గుర్తించే బాధ్యత మాది.

అప్పర్ పెన్నార్ నిర్వాసితులకు పరిహారం అందిస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల వారీగా ఒక్కొక్కటిగా పూర్తిచేస్తూ వెళ్తున్నాం. వెలుగొండ నిర్వాసితులకు 800 కోట్లు చెల్లించడమేగాక ఆ ప్రాజెక్టును పూర్తిచేసి, 7 టీఎంసీల నీరు అందించిన ఘనత మన ప్రభుత్వానిది. ఒక్కొక్కటిగా అన్ని ప్రాజెక్టులూ పూర్తిచేస్తాం. అప్పర్ పెన్నార్ రైతులకు పరిహారం అందజేస్తాం. ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి నిధులు కేటాయిస్తాం. మన ప్రాంతానికి పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలి. పెట్టుబడులు తేవడంలో స్థానిక నాయకత్వానికి కూడా బాధ్యత ఉంది. విద్యాశాఖకు సంబంధించి సునీతమ్మ చేసిన అభ్యర్థనలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎస్. సవిత, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్, హిందూపురం పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్. రాజు, ప్రధాన కార్యదర్శి హనుమప్ప, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ ఎన్నికల పరిశీలకులు ఏరాసు ప్రతాపరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాప్తాడు నియోజకవర్గ అబ్జర్వర్ పద్మలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post

పట్టణాలే గ్రోత్ ఇంజిన్లు

Next Post

ఈరోజు రాప్తాడు పార్టీ క్యాడర్‌కు పండుగ రోజు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్

చైతన్యరధం
@ October 17, 2026
ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు
ఆంధ్రప్రదేశ్

ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist