- రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని చీల్చే కుట్ర
- అధికారంలోకి రాగానే పోలీసు ఉద్యోగాల భర్తీ
- పెట్టుబడిదారుల్లో నమ్మకం కుదరాలంటే ప్రజాప్రభుత్వం 10 ఏళ్లు ఉండాలి
- మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో కులాలను రెచ్చగొట్టారు, ఈసారి కులం, మతం, ప్రాంతం పేరుతో సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా సోమవారం మంగళగిరి నియోజక వర్గం తాడేపల్లి పైన్‌వుడ్ అపార్ట్‌మెంట్ నివాసితులతో యువనేత సమావేశమయ్యారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… సమస్యలు తెలుసుకునేందుకు నేను అపార్ట్‌మెంట్ వాసులతో సమావేశమవుతుంటే పెత్తం దారనే ముద్ర వేస్తున్నారు, అపార్ట్‌మెంట్లలో నివసించే వారు పెత్తందారులా అని ప్రశ్నించారు. భారతదేశం మొత్తమ్మీద జగన్ లాంటి దొంగ, 420 మరొకరు లేరు, ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో కేసుల లిస్టే ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో లబ్ధి కోసం సొంత బాబాయిని లేపేసి ఆ నెపాన్ని మాపై నెట్టే ప్రయ త్నం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి ప్రాంతంలో రూ.1800 కోట్లతో ఎయిమ్స్ నిర్మిస్తే కనీ సం వాటర్ కనెక్షన్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వలేక నిధులు మురగబెట్టిన అసమర్థుడు. దేశం లోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్ కు కూడా కులంరంగు పులిమారు. దీంతో ఆ సంస్థ ఒడిశా వెళ్లి రూ.1200 కోట్లు పెట్టుబడి పెట్టింది. జె-ట్యాక్స్ విధానాలకారణంగా అనేక పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి,ఉద్యోగాల కల్పనపై లేదు. జగన్ రూ.12లక్షల కోట్ల అప్పుచేసి బటన్ నొక్కడంతో ఆభారం ధరలపెంపు, పన్నుల రూపంలో తిరిగి ప్రజల పైనే పడుతోంది. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వద్ద నుంచే రాజధాని అమరావతి పనులు ప్రారంభిస్తాం. దేశం లోనే మోడల్ సిటీగా అమరావతిని నిర్మిస్తాం. అమరా వతి నిర్మాణం చేపట్టకుండా అయిదేళ్ల సమయాన్ని వృథా చేశామనే విమర్శలు సరికాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తిచేశాం, మాస్టర్ ప్లాన్, డిజైన్లు తయారుచేసి పనులు ప్రారంభిం చాం. ఒక మంచి ఇల్లు కట్టాలంటేనే కనీసం 3ఏళ్లు పడుతుంది. అలాంటిది రాజధాని నిర్మాణానికి సమ యం పట్టదా? అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు.
విధ్వంసక విధానాల కారణంగా దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడాలంటే కనీసం పదేళ్లపాటు ప్రజాప్రభుత్వం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. అయిదేళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మారితే మాత్రం యథావిధిగా తిప్పలు తప్పవని యువనేత లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీచేస్తాం. అధునాతన టెక్నాలజీతో నేరాలకు చెక్ పెడతాం. ప్రభుత్వానికి సమాంతరంగా నేను గత అయిదేళ్లుగా మంగళగిరిలో సొంతనిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. నన్ను గెలిపిస్తే మంగళగిరిని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని యువనేత చెప్పారు.
20 ఏళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలు
నేను, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్ డబుల్ ఇంజన్ మాదిరిగా పనిచేసి మంగళగిరి నియోజకవర్గాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని లోకేష్ చెప్పారు. రాబోయే 20ఏళ్లలో మంగళగిరి ప్రజ లకు అవసరమైన రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్, డ్రైనేజి, రైతుబజార్లు, శ్మశానవాటికలు తదితర మౌలిక సదుపాయల కల్పనకు అవసరమైన మాస్టర్ ప్లాన్ తమవద్ద ఉంది, గెలిపిస్తే అభివృద్ధి దిశగా మంగళగిరిని పరుగులు తీయిస్తామని చెప్పారు. చిన్నతరహా పరి శ్రమల ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రెండు కుటుంబాలు 25ఏళ్ల పాటు పాలన సాగించారు. మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, ఆళ్ల రామకృష్ణారెడ్డి హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగిం దా? టీడీపీ పాలనలో కేసులు వేసి మంగళగిరి నియో జకవర్గ అభివృద్ధిని ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా కనీసం ఒక్క డ్రెయిన్ అయినా కట్టారా? తాడేపల్లి వాసులకు తాగునీటి కోసం గత టీడీపీ ప్రభు త్వ హయాంలో పనులు ప్రారంభిస్తే జగన్ వచ్చిన తర్వాత నిలిపివేశారు. ఎయిమ్స్‌కు కసనీం నీటిసౌక ర్యం కూడా కల్పించలేని దుస్థితిలో ఉన్నారని లోకేష్ విమర్శించారు.
ప్రభుత్వానికి సమాంతరంగా సంక్షేమ పథకాలు
2019 ఎన్నికల్లో 5,350 ఓట్ల తేడాతో నేను ఓడి పోయాను. అయినప్పటికీ కసితో పనిచేస్తున్నా. మంగళ గిరి నియోజకవర్గంలో 29 సంక్షేమ-అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టాం. ప్రభుత్వానికి సమాంతరంగా మం గళగిరిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా. వాటర్ ట్యాంకర్లు, ఆరోగ్య సంజీవని, పెళ్లి కానుక, చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10వేల సాయం, వీవర్స్‌శాల, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెల పంపిణీ, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు వంటివి చేపట్టాం.
ప్రతిపక్షంలో ఉండగానే ఇన్ని కార్య క్రమాలు చేపట్టాం. రేపు అధికారంలోకి వస్తే ఎన్ని కార్యక్రమాలు చేపడతామో ప్రజలు ఆలోచించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయితో సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మంగళగిరిని బ్లాక్ డెవలప్‌మెంట్ విధానంలో అభివృద్ధి చేస్తాం. రోడ్లు, డ్రైయిన్లు, పార్క్‌లు, ఆసుపత్రి సదుపాయాలు కల్పిస్తాం. గత ఎన్నికల్లో ఓటమితో అనేక అవమానాలు ఎదుర్కొ న్నా. శాసనసభ సాక్షిగా నా తండ్రి, తల్లిని అవమానిం చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని 53,500 ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఓర్పుతో ఉండి ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతిఒక్కరూ రోజూ పది మందికి ఫోన్ చేసి చైతన్యవంతులను చేయాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.