- పొత్తు ధర్మం పాటించాల్సిందే..
- రెబల్స్ ఉంటే సస్పెండ్ చేయండి
- గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే
- స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు నిర్ణయించిన అభ్యర్థులే ఫైనల్..పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేన ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అభ్యర్థిని కాదు.. ఎన్డీఏను చూసి ఓటు వేయాలని కోరారు. సీఎం అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశం అనంతరం స్థానిక ఎన్నికలపై మంత్రులతో చర్చించారు. సమావేశంలో రెబెల్స్‌పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, తాను కలిసి సీట్ల సర్దుబాటు చేశాం.. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ రెండున్న రేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలలో మంచి సానుకూ లత ఉందని సీఎం తెలిపారు. ఇదే సమయంలో పవన్‌కళ్యాణ్ స్పంది స్తూ.. ముగ్గురం కూర్చుని మంచి మెసేజ్ ఇచ్చామని తెలిపారు. ప్రజలు, పార్టీ క్యాడర్ నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. జనసేన, బీజేపీ నుంచి ఉన్న చిన్నచిన్న సమస్యలను కూడా పరిస్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు.
పార్టీ తరఫున ఎక్కడైనా రెబల్స్ ఉంటే వెంటనే వాళ్లను సస్పెండ్ చేయా లని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రెబల్స్ ఉంటే వాళ్లు పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టే భావించాలని స్పష్టం చేశారు. మంత్రులు తమ నియోజకవర్గాలతో పాటు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న జిల్లాలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత మీదే’ అని మంత్రులకు స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు పూర్తయిన తరువాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆ వెంటనే సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయని తెలిపారు. ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత మొత్తం పాలనపై దృష్టి పెడ దామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో ఎక్కడైనా వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని కోరారు. ఆ తర్వాత ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.


