అమరావతి: విధి నిర్వహణలో దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. లద్దాఖ్‌లో టీ-72 యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ఘటనలో ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు చనిపోయారన్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ ల మృతికి సంతాపం తెలుపుతున్నానన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ముగ్గురు జవాన్ల మృతిపై లోకేష్ దిగ్భ్రాంతి – వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
అమరావతి: ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి చెందటం పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లద్దాఖ్ జరిగిన ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభానా ఖాన్, ముత్తుమల రామకృష్ణారెడ్డి మృతి చెందటం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.