- డిస్కంల అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు
- కరెంట్ బిల్లులు పెంచి ప్రజల రక్తం తాగారు
- ప్రజలపై ఎట్టి పరిస్థితుల్లో భారం వేయబోం
- గాడిలో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం
- విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి(చైతన్యరథం): జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయిం దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. వారి అనాలోచిత నిర్ణ యాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయన్నారు. డిస్కంల అప్పుల పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి ప్రజల రక్తం తాగారని ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు అధి కారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంట్ బిల్లులను పెంచింది లేదన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలను పెంచారని దుయ్యబట్టారు. డిస్కంల పేరు చెప్పి జగన్ విద్యుత్ చార్జీలు పెంచినా డిస్కంలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు.
అంతేగాకుండా వైసీపీ హయాంలో అప్పులు 79 శాతం పెరిగినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అప్పు తెస్తే కానీ నడపలేని స్థితిలో డిస్కంలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలు, ఇతర మొత్తాలు కలిపి ఇప్పటికీ రూ.34,954 కోట్లు బకాయిలుగా ఉన్నాయని తెలిపిన మంత్రి వైసీపీ ఏలుబడిలో డిస్కంల అప్పులు కట్టడానికి మళ్లీ మళ్లీ అప్పులు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత గతంలో ఉన్న పరిస్థితిని మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో డిస్కంల పనితీరు దారుణం
గత ప్రభుత్వంలో డిస్కంల పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్‌లో కూడా మన డిస్కంలు ‘ఏ’ నుంచి బీ,సీ,డీ కేటగిరీలకు పడిపోయినట్లు గుర్తు చేశారు. రేటింగ్ పడిపోవడంతో అప్పులపై వడ్డీ రేటు కూడా పెరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు విధానపరమైన నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరులో ‘ఏ’ రేటింగ్ ఉండేవని గుర్తు చేశారు. విభజన సమయంలో ఏపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. సవాళ్లు మనకు కొత్తేమీ కాదని అన్నారు.
విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో చంద్రబాబుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు. సీఎం ఇప్పు డు విద్యుత్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. త్వరలోనే అప్పులను తగ్గించి డిస్కంలను గాడిలో పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రేటింగ్‌లో ఏ ప్లస్ కోసం తాము ఆరాటపడమని తెలిపిన ఆయన మా పనికి తగ్గ ఫలితాలు రానున్న రోజు ల్లో ప్రజలు చూస్తారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద అధిక భారం వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.