అమరావతి : రాష్ట్ర భవిష్యత్తుకోసం 33వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నట్టేటముంచిందని రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన వివిధపార్టీల నేతలు మండిపడ్డారు. మూడురాజధానుల పేరుతో జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నినాటకాలు ఆడినా అంతిమ విజయం రైతులదేనని అన్నారు. ధర్మం, న్యాయం రైతులపక్షాన ఉన్నాయని, అమరావతి ఉద్యమకారుల ఉక్కుసంకల్పం ముందు ఏ కుట్రలు, కుతుంత్రాలు పనిచేయ బోవని స్పష్టం చేశారు. మహా పాదయాత్రకు సంఫీు భావం తెలిపిన ప్రముఖులు ఏవరేమన్నారో వారి మాటల్లోనే..
మూడేళ్లుగా ఏంచేశారు? : టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్రపై ప్రేమ నిజమైతే మూడేళ్లలో ఉత్తరాంధ్రకు చేసిందేమిటని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నిం చారు. ఉత్తరాంధ్రపై జగన్ బ్యాచ్ మూడేళ్లుగా దండయాత్ర చేస్తోంది.. మూడేళ్లుగా ఏ2 ఉత్తరాంధ్రలో తిష్టవేసి దందాలు నడుపుతున్నాడని దుయ్యబట్టారు. గత మూడేళ్లలో జె-గ్యాంగ్ దోచుకున్న రెండులక్షల కోట్ల దోపిడీ బండారం బట్టబయలు కాకుండా కప్పిపెట్టేందుకే మూడు రాజధానుల నాటకమని అన్నారు.
అమరావతి విషయంలో దొంగనాటకాలు : కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి
అమరావతి విషయంలో వైసీపీ దొంగ నాటకాలు ఆడుతోందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి దుయ్యబట్టారు. మూడేళ్లుగా ఏం చేశారని ఇప్పుడు వైసీపీ 3రాజధానులని అంటోందని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే వివాదాలు లేకుండా అమరావతి పూర్తి చేయగలదు, తక్షణమే జగన్‌రెడ్డి ప్రభుత్వ కపటనాటకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ధైర్యముంటే అమరావతిపై ఎన్నికలకు వెళ్లండి : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
రాజధాని పనులు ఆపేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నా రు. భూములు ఇచ్చిన రైతు లకు అన్యాయం చేశారు. వైసీపీ నేతలుఎక్కడైనా గజం స్థలం ఇవ్వగలరా? అని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.మూడు రాజధానులు అయ్యే పనికాదు. జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అమరావతిపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పాదయాత్ర టీడీపీ నడిపిస్తుందనడంలో అర్థం లేదు. మేం నడిపిస్తే మా పార్టీ మొత్తం ఇక్కడే ఉండేదని అన్నారు.
ప్రజలమద్దతు అమరావతికే: సిపిఐ నారాయణ
రాజధాని విషయంలో ప్రభుత్వం మాట మార్చినా ప్రజలు మాత్రం ప్లేటు ఫిరాయించకుండా అమరావతికే కట్టుబడి ఉన్నారని సిపిఐ జా తీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
డబ్బులిస్తారు.. పాదయాత్రచేయండి : తెనాలి శ్రావణ్ కుమార్
రాజధాని రైతులంతా వైసీపీనేతలకు డబ్బులిస్తారు. అరసవల్లి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయగల రా? అని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కు మార్ ప్రశ్నించారు. అధికార పక్షం కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు అమ రావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చ లేవని స్పష్టం చేశారు.తొలివిడత యాత్రలోనే ఈ విషయం స్పష్ట మైందని తెలిపారు.ప్రభుత్వం పాదయాత్రను భగ్న ంచేసేందుకు కుట్రచేస్తోందనితాజాగా మంత్రుల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోందన్నారు.
అమరావతి రైతులు చేస్తున్నది చారిత్రాత్మక ఉద్యమం : మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచి పోతుంది మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వం రావు పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భరిస్తూ రైతులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రైతుల మహాపాదయాత్ర విజయవంతం కావాలి.. మూర?పు ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పును అమలుచేయాల్సిందే : లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ
అమరావతి రైతుల మహాపాదయాత్రకు లోక్ సత్తా పార్టీ సంపూర్ణ మద్దతుప్రకటించింది. రైతులు తమకు జరిగిన అన్యాయంపై పాదయాత్ర చేప ట్టారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించేందుకు రైతుల పాదయాత్ర చేస్తున్నారని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ అన్నారు. హై కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాల్సిందే. అణచివేతలు, నిర్బంధాలు, అరెస్టులు జరగకుండా రైతులకు రాష్ట్రప్రజలంతా అండగా నిలవాలని కోరారు.
ఎబి వెంకటేశ్వరరావు తల్లి మద్దతు
అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0కు సీనియర్ ఐపీఎస్ ఏబీవీ మాతృమూర్తి జయప్రద సంఫీుభావం తెలిపారు. అమరావతి రైతుల కష్టా లను చూసి చలించిపోయానని అన్నారు. రైతుల త్యాగం చాలా గొప్పది. రాజధాని కోసం రైతులు భూమిని తృణప్రాయంగా వదులుకున్నారు.. అమ రావతి పరిరక్షణ సమితికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నాం. అమరావతి రైతులకు అండగా ఉంటామని అన్నారు.