- రైతుల పాదయాత్రపై దండయాత్ర దుర్మార్గం
- ఉత్తరాంధ్ర ప్రజలు సంయమనం కోల్పోవద్దు
- జగన్‌రెడ్డి రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏం సాధించాడు?
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు
అమరావతి: జగన్‌రెడ్డి, ఆయన మంత్రులు పనిగట్టుకొని మరీ ఉత్తరాంధ్రవాసుల్ని అమరావతి రైతులపైకి ఉసిగొల్పు తున్నారని తెలుగుదేశంపార్టీ బ్యూరోసభ్యులు కళా వెం కట్రావు మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు అనుమతితో సాగుతున్న రైతుల యాత్రను అడ్డుకోవడం కోర్టు ధిక్కారం అవుతుంది. మంత్రులు ధర్మాన, బొత్స, అమర్నాథ్‌తోపాటు మరి కొందరు పదవుల కోసం దిగజారి మాట్లాడుతున్నారు. రైతుల పాదయాత్రపై వైసీపీ దండయాత్ర దుర్మార్గం. ముఖ్యమంత్రి దర్శక త్వంలో ప్రాంతీయ విద్వేషాలురేపి, కుల, మత చిచ్చు పెట్టడానికే మంత్రులు రైతుల పాదయాత్రపై మాట్లా డుతున్నారు. ఉత్తరాంధ్రలోని 6 గిరిజన నియోజక వర్గాలకు జగన్‌రెడ్డి తనహాయాంలో ఏం చేశాడో చెప్పాలి. ఆఖరికి కేంద్రం నుంచి ఆ ప్రాంతానికి రావలసిన నిధుల్ని కూడా రాబట్టలేక చేతులెత్తేశాడు. టీడీపీ హాయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాం ధ్రకు ఎన్ని నిధులువచ్చాయో, ఇప్పుడెన్ని వచ్చాయో చెప్పగలరా? ఐటీడీఏలకు ఇచ్చిన నిధులెన్ని, గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఏం ఒరగబెట్టారో చెప్పాలి. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో గర్జనలు, ఉద్యమాలు చేసి, రాష్ట్రా న్ని వల్లకాడు చేయాలని చూస్తున్నారు. 23మంది ఎం పీలతో కేంద్రంతో దోస్తీచేస్తూ జగన్‌రెడ్డి ఉత్తరాంధ్రకు ఏం సాధించాడు? విశాఖపట్నంలోని ప్రభుత్వ భూము లు, ఆస్తుల్ని అప్పుల కోసం తనఖా పెట్టారు.
అధమ స్థితికి దిగజారిన జగన్ ప్రభుత్వం
అప్పుల కోసం దేశంలో ఏ ప్రభుత్వం దిగజారనం తగా జగన్ ప్రభుత్వం అధమస్థితికి దిగ జారింది. ఉత్త రాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మూడేళ్లలో ఎన్ని నిధు లు ఖర్చుపెట్టారు? మూడు జిల్లాల్లోని అధికారుల జీత భత్యాలకు కూడా సరిపోని నిధులు మూడేళ్లలో జగన్ రెడ్డి విదిల్చాడు. భావనపాడు పోర్టు ఏమైందో ప్రజల కు చెప్పండి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం సంగతేంటి? ఎలాంటి లాలూచీలతో కేంద్రం నుంచి ఏం సాధించలేకపోతున్నారో చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏంచేశారు? ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? కేంద్రం ఇస్తుందన్న రైల్వేజో న్ సాధనకు మూడున్నరేళ్లలో ఏంచేశారు? హై కోర్ట్ అనుమతితో జరుగుతున్న పాదయాత్రపై మంత్రుల్ని ఉసిగొల్పడం కోర్టు ధిక్కారం కాదా? శాఖలు మారు స్తాను, పీకేస్తానని ముఖ్యమంత్రి బెదిరించాకే మంత్రు లు రైతుల పాదయాత్రపై పడ్డారు. మంత్రుల వ్యాఖ్య లపై ఉత్తరాంధ్ర ప్రజలంతా సంయమనంతో ఆలోచిం చాలి. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఉత్తుత్తి పథకా లతో ఊదరగొడుతున్నారని ప్రజలకు అర్థమైంది. వారిని దారి మళ్లించడానికే జగన్‌రెడ్డి అండ్ కో పాద యాత్రపై విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వ వైఫ ల్యాలు తెలియకూడదనే మంత్రులు అమరావతి యాత్రపై పడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అమర్నాథ్ తోపాటు రోజుకో మంత్రి దండయాత్రకు వస్తున్నారు. మూడు రాజధానుల పేరు చెప్పి మూడేళ్లయినా,ఎక్కడైనా జగన్ అండ్ కో ఏమై నా అభివృద్ధిచేశారా? న్యాయంగా సాగుతున్న రైతుల పాదయాత్రపై విరుచుకు పడుతున్న మంత్రులు, జగన్ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్రకు ఏం ఒరిగిందో చెప్పాలి. ఉత్తరాంధ్రలో లక్ష ఎకరాలు కొన్నారన్న సమా చారం పై ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించరు? వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలు వారి బినామీలు, అను చరులకింద ఎన్నిభూములున్నాయో తేల్చే ధైర్యం ప్రభు త్వానికి ఉందాఅని కళావెంకట్రావు ప్రశ్నించారు.