- చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన విజయ్
అమరావతి (చైతన్యరథం): విజయవాడ ఉత్సవ్ పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు ఆఫీసుకువచ్చిన సీఎం విజయ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా గోదావరి-కావేరి నదుల అను సంధానం ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించారు. నదుల అనుసంధానమే కరువుకు శాశ్వత పరిష్కారమని అభివర్ణించారు. మరోవైపు తెలుగు గంగ ద్వారా చెన్నైకు మరింతగా తాగునీరు విడుదల చేయాలని సీఎం విజయ్ కోరారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో కృష్ణా జలాలు తగ్గడం, తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ చెన్నయ్ దాహార్తి తీర్చే విషయంలో ఏపీ ప్రభుత్వం సాను కూలంగా ఉందన్నారు. ఇప్పటికే 4.08 టీఎంసీల నీటిని చెన్నై నగరానికి విడు దల చేసినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా మరికొంత నీటిని విడుదల చేయడంపైనా ఆలోచన చేస్తామని చెప్పారు.













