- ఆర్థిక సాయం చేసి ఆదుక్ను దాతృత్వం
- కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
- ఎమ్మెల్యే శిరీష అభినందనలు
అమరావతి (చైతన్యరథం) : శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గం, సుమాదేవి అనే గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి వితిక అలవి కాని వ్యాధితో బాధపడుతోంది . పాప ప్రాణం నిలబడాలంటే పైబ్రోనియేజన్ ఇంజక్షన్ నెలలో రెండు సార్లు వేయాల్సి ఉంది. ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు రూ.32వేలు అవుతోందని వైద్యులు తెలిపారు. నిరుపేద తల్లిదండ్రులకు అది తలకు మించిన భారమే. అందుకే ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శీరిష ద్వారా ప్రభుత్వాన్ని ఆర్ధికసాయం కోరారు.ఈ సమాచారంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ వెంటను స్పందించారు. రూ.32,000 ఆర్థిక సహాయమందించి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం నుంచి సాయం వచ్చే వరకు తన సొంత నిధులతో పాపకు ఇంజక్షన్లకు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు, ఆపదలో ఆదుకోవడానికి నేనున్నానని సాయం చేస్తున్న పల్లాకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గౌతు కూడా అభినందనలు తెలిపారు.