- రాజధాని కోసం పోరాడుతున్న రైతన్నలకు కేడీల పాలనలో బేడీలు
- దేశంలోనే 1500 రోజుల పాటు ఉద్యమించిన ఘనత అమరావతి రైతులకే దక్కుతుంది
- రాజధాని కోసం పోరాడుతున్న రైతన్నలకు కేడీల పాలనలో బేడీలు
- దేశంలోనే 1500 రోజుల పాటు ఉద్యమించిన ఘనత అమరావతి రైతులకే దక్కుతుంది
అమరావతి: ప్రభుత్వం ఎంతగా అణచి వేతకు పాల్పడుతున్నా వెరవక రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు మొక్కవోని దీక్షతో ఉద్యమం కొనసాగిస్తు న్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి గురువారానికి 1500 రోజులు పూర్తవు తున్న సందర్భంగా ఉద్యమంలో పాలు పంచుకుంటున్న వారికి ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు ఉద్యమాభివందనాలు తెలి పారు. భవిష్యత్ కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశారు.
ఏపీకి రాజధాని ఏది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దిగజార్చారు. నాలుగున్న రేళ్లలో ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతు ల గొంతు నొక్కేందుకు జగన్‌రెడ్డి ప్రభుత్వం చేయని అరాచకాలు లేవని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేపడితే జగన్‌రెడ్డి దానిని కర్కశంగా అడ్డు కున్నాడు. అమరావతిని విధ్వంసం చేసి ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాడు. అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి కుట్ర పూరితంగానే వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే 144 సెక్షన్, పోలీసు చట్టంలో సెక్షన్ 30 వంటివి ప్రయోగించి గ్రామాల్నీ తన గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలకు తెగ బడ్డారు.
ప్రజా రాజధాని అమరావతి కోసం 1500రోజులుగా ఉద్యమాలు చేస్తున్న రైతు లు, మహిళలు పెయిడ్ ఆర్టిస్టులంటూ అవ మానాలకు గురిచేశారు. రాజధాని మహి ళల కట్టు, బొట్టులపై కూడా విమర్మలకు పాల్పడ్డారు. ఆఖరికి కేడీల పాలనలో రైత న్నలకు బేడీలు వేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
పోలీసుల లాఠీ దెబ్బల్ని, హింసాకాండ ను తట్టుకుని, మహిళలు, రైతులు ముందు వరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించడం వారి ధీరత్వానికి నిదర్శనం. న్యాయ దేవతని నమ్ముకున్న రైతులు హై కోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళి వరుస విజ యాలు సాధించడం జగన్‌రెడ్డికి చెంప పెట్టు.
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాల భూములిచ్చిన రైతుల మనోభావలను దెబ్బతీసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. అమరావతి పోరాటంలో 275 మంది రైతుల మరణానికి జగన్‌రెడ్డి కారకులయ్యా డు. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుందన్నట్లుగా 151 సీట్లు వచ్చాయని విర్రవీగిన జగన్‌రెడ్డి.. ఒక్క అమరావతి అంశంతోనే మట్టి కరవడం తథ్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.