- జగన్‌రెడ్డి చెప్పినట్లు అంత చిన్న కేసు కాదు..
- నాడు నిందితుడికి అనుకూలంగా పనిచేశారు
- గన్ పెట్టి ఎందుకు బెదిరించారో చెప్పాలి
- ఒత్తిడి తెచ్చిన పెద్దలెవరో బహిర్గతం చేయాలి?
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): పరకామణి కేసు గురించి వార్తలు రాసిన మీడియా ప్రతినిధులపై 2023 జూన్ 2న కేసులు పెట్టి గన్‌తో పోలీసులు ఎందుకు బెదిరించారో అప్పటి ఎస్పీ వివరణ ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసు గురించి వార్తలు రాసిన జర్నలిస్టులకు పక్క ప్రణాళిక ప్రకారం యూపీఐ ద్వారా డబ్బులు పంపి.. నిమిషాల వ్యవధిలోనే వారిపై కేసులు బనాయించారని మండిపడ్డారు. 2023లో చోటు చేసుకున్న పరిమాణాలు, జర్నలి స్టుల ఫోన్ కాల్స్ బెదిరింపులు తదితర అంశాలపై పవర్ పాయిం ట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు.
2023 జూన్ 30న ఓ టీవీ ఛానల్ పరకామణి కేసు వివరాలు.. నిందితుడు రవికుమార్ ఆస్తుల వివరాలు గురించి వీడియో విడుదల చేశారు. ఆ ప్రోమో విడుదల తరు వాత జర్నలిస్టులకు బెదిరింపులు మొదలయ్యాయి. జర్నలిస్టులు నిందితులకు తలొగ్గక పోవడంతో జూలై 02న 10.35 గంటలకు ఓ జర్నలిస్టు అకౌంట్‌కు గూగుల్ పే ద్వారా రూ.10 వేలు పంపించారు. ఆ తరువాత ఐదు నిమిషాల వ్యవధిలోనే 10.40 గంటలకు వారిపై ఎఫ్‌ఐఆర్ నెం.90/2023 నమోదు చేశారు. తిరుమల టూటౌన్‌లో పక్కా ప్లాన్ ప్రకారం కేసులు పెట్టారు. నిందితులు జర్నలిస్టులపై అక్రమ కేసు బనాయించి బెదిరించాలని చూశారని మండిపడ్డారు. అప్పటి సీఐగా పని చేసిన చంద్రశేఖర్ కూడా ఇందులో భాగమన్నారు. గన్‌తో బెదిరించి పరకామణి కేసు వివరాలు, వీడియోలు తీసుకోవాలని చూశారన్నారు. ఆనాడు ఎస్పీగా పనిచేసిన వ్యక్తి కూడా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుందన్నారు.
జర్నలిస్టులను ఎందుకు బెదిరించారు?
ఆనాడు పోలీసులపై ఒత్తిడి చేసిన పెద్దలు ఎవరు? సీఎం కార్యాలయం నుంచి ఎవరు ఒత్తిడి చేశారో వెంటనే చెప్పాలని కోరారు. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి లాంటి పెద్ద మనుషులు ఒత్తిడి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. జర్నలి స్టులపై సీఐ ఎందుకు తుపాకీ పెట్టి బెదిరించారో చెప్పాలన్నారు. జర్నలిస్టుల ఫోన్‌లు తీసుకుని వారి కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలన్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చిన ఆనాటి పెద్దలు ఎవరో విచారించాలని కోరారు. వ్యవస్థలన్నీ నిందితుడి తరపునే అండగా నిలిచాయని మండిపడ్డారు. జర్నలి స్టులకు 41ఏ నోటీసు ఎందుకు ఇచ్చారు. అందరిని ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిని గన్ పెట్టి ఎందుకు బెదిరించా రు అనే ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని అప్పటి ఎస్పీని కోరారు. పరకామణి కేసులో ఈ అంశం కూడా పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని సూచించారు. రవికుమార్‌కు ఈ ఆస్తులలో చెన్నైలోని పాండి బజార్‌లో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నదా లేదా అనేది, అతని బినామీల ఆస్తులపై విచారణ అధికారులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
దొంగలకు జగన్ ఎందుకు అండగా నిలుస్తున్నారు
పరకామణిలో చోరీ తరువాత నిందితుడు ఆస్తులు అమాం తం పెరిగాయని ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రంలో నిందితు డు బినామీల పేరుతో చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించా రు. రవికుమార్ ఆస్తులకు బినామీగా ఉన్న వ్యక్తి భూమనకు అత్యంత ఆప్తుడని ఆరోపించారు. పరకామణి కేసు చాలా చిన్న చోరి అంటున్న జగన్మోహన్‌రెడ్డి.. ఆనాడు ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిందితుడు రవికూమార్‌కు ఎందుకు అనుకూలంగా మార్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిందితులను వెనకేసుకొస్తు న్న జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత సున్నితమైన, మతపరమైన అంశాలపై, ముఖ్యంగా ఇతర మతా లకు సంబంధిం చిన విషయాలపై వ్యాఖ్యానించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండా లని హితవుపలికారు.
















