- 2027 మార్చికి 72 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు
- వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నల్ల చట్టమే
- వారు రాసింది రక్త చరిత్ర- మాది అభివృద్ధి సంకల్పం
- ఫొటోల పిచ్చిని రాజముద్రతో పూర్తిగా తుడిచేశాం
- భూ వివాదాలు లేని రాష్ట్రమే మా సంకల్పం
- 22ఏ జాబితా నుంచి రైతులకు విముక్తి కల్పిస్తున్నాం
- బనగానపల్లె సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ
బనగానపల్లె (చైతన్యరథం): ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్ర మంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపి ణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ గడచిన రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందు తోంది. గత పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయి. లక్షల కుటుంబాలు వారి అరాచకానికి బలి అయ్యాయి. నచ్చని వారిని భయపెట్టేందుకు వారి భూములను గత పాలకులు 22ఏ కింద చేర్చారు. వివాదాలు సృష్టించి భూములు లాక్కునేందుకు ప్రయత్నాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఓ నల్ల చట్టాన్ని తెచ్చారు. ప్రజల ఆస్తులను కాజేసేలా భయాందోళనలు సృష్టించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తేవటమే సమస్యను మరింత జఠిలం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేశాం.
భూ వివాదాల పరిష్కారానికి ధృఢ సంక ల్పంతో ముందుకువెళు తున్నాం. గత పాలకులు ప్రజల భూమి పత్రాలు, సర్వే రాళ్లపైనా ఫొటోలు ముద్రించుకున్నారు. ఆ ఫొటోల పిచ్చిని తుడిచేసేందుకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తున్నాం. కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లను పెట్టి తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా చేపట్టి భూ యజమానులకు హక్కులు కల్పిస్తున్నాం. 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తాం. ఏపీని ఎలాంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యం. విలేజ్ ఇనామ్ భూములను కూడా 22ఏలో పెట్టేశారు. వీటిని 1971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తు న్నాం. తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరులోని వట్టి చెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుందిలో చాలా ఏళు గా ఉన్న భూ వివాదాలను పరిష్కరించాం. డోన్ నియోజకవర్గంలో ఉన్న 2074 ఎకరాల వర్ఫ్ భూములను కూడా 22ఏలో గత పాలకులు పెట్టారు. ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి రైతుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
వారిది రక్తచరిత్ర- మాది అభివృద్ధి సంకల్పం
రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు పరిష్కరించటంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పనిచేస్తున్నాం. రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్, హీరో మోటార్స్, అమ్కా డిఫెన్స్ ఫైటర్ జెట్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రాయలసీమలో తయారైన ఎన్ ఫీల్డ్ బుల్లెట్లు దేశ మంతా తిరుగుతాయి. రూ.40 వేల కోట్లు ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమ హార్టీకల్చర్ హబ్ గా మారు తుంది. నగరాలు, పట్టణాల కంటే కడప జిల్లా లింగాల వంటి ప్రాంతాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. నంద్యాలలోనూ హార్టికల్చర్ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎల్న్ని కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్లో 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నీటిని పొదుపుగా వినియో గించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే జలధార కార్యక్రమా న్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. నంద్యాల జిల్లాలో 18 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్, చెక్ డ్యామ్లు నిర్మించిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చుకుంటే నీటి భద్రత సాధ్యం అవుతుంద న్నారు. రాయలసీమలో వారు రక్తచరిత్ర రాస్తే మేం అభివృద్ధి సంకల్పం చేస్తున్నామని తెలిపారు.
ప్రజాభిప్రాయంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు
ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటమే లక్ష్యంగా కూటమి ప్రజాప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. ప్రజలకు అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలు, సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా పనితీరు మెరుగు పర్చుకుంటున్నాం. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించటమే ప్రభుత్వ లక్ష్యం. బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తు న్నాం. ఎవరు అఘాయిత్యానికి పాల్పడినా అదే వారికి చివరి రోజు అవుతుంది. రాష్ట్రంలో అత్యుత్తమ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి మెరుగైన విద్య, జీవన ప్రమాణాలు అందించాలని ఆలోచన చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వెదురుతో తయారుచేసిన ఆభరణాలను ఆసక్తిగా పరిశీలించారు. డ్వాక్రా, మెప్మా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను స్వయం బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.














