- అమరావతి పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు
- యాత్రకు అడుగడుగునా హరతులు పట్టిన ప్రజలు
- నందివెలుగు వద్ద ప్రజలు, నేతల సంఫీుభావం
తెనాలి : అమరావతి రైతుల మహాపాదయాత్రను ఏవిధం గానైనా భగ్నం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సర్కారు తొలిరోజు నుంచే కుట్ర చేస్తోంది. మూడో రోజైన బుధవారం పాదయాత్ర కొనసాగుతుండగా.. తెనాలి వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఐతానగర్ వైపు పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు ఆదేశాల ప్రకారంయాత్ర చేస్తా మన్న రైతులు తెగేసి చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బారికేడ్లు అడ్డంగాపెట్టారు. ఆగ్రహించిన స్థానికులు బారికేడ్లను నెట్టివేసి రైతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానికుల మధ్య తోపులాటతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసుల బారికేడ్లును తోసుకొంటూ రైతులు ముందుకెళ్లారు.
ఆలపాటి ఆధ్వర్యంలో ఘనస్వాగతం
యాత్ర తెనాలి నియోజకవర్గానికి చేరుకున్న సమయంలో నందివెలుగు ప్రాంతంలో వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశంనేత మాజీ మంత్రి ఆలపా టి రాజేంద్ర ప్రసాద్ ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్‌చేశాడని రాజేంద్ర ప్రసా ద్ మండిపడ్డారు. ఏమి ఆశించకుండా రాష్ట్ర అభివృద్ది కాంక్షిస్తూ 35వేల ఎకరాలు ప్రభుత్వానికి అమరావతి ప్రాంత రైతులు ఇచ్చారని గుర్తుచేశారు. మాజీ మంత్రి నక్క ఆనంద్‌బాబు పాదయాత్రలో రెండో వరుసగా మూడో రోజున సంఫీుభావాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ఉద్దేశ్యపుర్వ కంగా అమరావతి రైతులపై కక్షసా దిస్తుందని, నాడు ప్రతిపక్షంలో ఉండగా జగన్ అమరావతికి మద్దత్ తెలియజేశాడని, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చుతున్నడని అన్నారు. మాట తప్పను మడమతిప్పను అన్న జగన్ నేడు అన్నమాట మీద నిలబడలేదని చంద్రబాబు నాయుడు మాట ఇస్తే అమలు చేస్తాడని ఇద్దరికితేడా తెలుసుకోవాలని అన్నా రు.మహిళ నేత నన్నపునేని రాజకుమారి నందివెలుగు గ్రామంలో యాత్రకు ఘనస్వాగతం పలికారు. రాజధా ని ప్రాంతాల రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటా నికి రాష్ట్రంలో ఉన్న మహిళలసంపూర్ణ మద్దతూ ఉంటుందని,ఒకే రాజధాని అమరావతిగా ఉండాలని కోరు తూ రైతులుచేస్తున్న పాదయాత్ర విజయవంతం కావా లని ఆకాంక్షించారు.యాత్రకు దారిపోడవునా ప్రజలు హరతులు పట్టారు.యాత్రకు జనసేన,సిపిఎం, సిపిఐ, బిజెపి నేతలతో పాటు విద్యార్ధి సంఘాల నేతలు సంఫీుభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్నారు.
నేటి మహా పాదయాత్ర సాగేదిలా..
అమరావతి మహాపాదయాత్ర 4వరోజైన గురువా రం రూట్ మ్యాప్ వివరాలిలావున్నాయి. గురువారం ఉదయం 08:30 గంటలకు పెద్దరావూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వేమూరు భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత కొల్లూరు వరకు యాత్ర కొనసాగుతుంది. 4వరోజు మొత్తం 17కిలోమీటర్ల పొడవున యాత్ర సాగుతుంది.