- కలెక్టర్లకు వందరోజుల ప్రణాళిక
- రాష్ట్ర పునర్నిర్మాణానికి సదస్సు కీలకం
- పారదర్శక పాలనకు సహకరించండి
- పెన్సన్ల పంపిణీలో మీ చొరవ గ్రేట్
- కలెక్టర్ల సదస్సులో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రతిష్టను ఇనుమడిరపజేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అన్నారు. సచివాలంయలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో నీరభ్ పారంభోపన్యాసం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న సదస్సు రాష్ట్ర పునర్నిర్మాణానికి కీలకమైందని వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతూ ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడిరపజేయాల్సిన బాధ్యత అంతిమంగా జిల్లా కలెక్టర్లదేనన్నారు. వచ్చే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించామని, కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో, సమస్యల పరిష్కారంలో బాధ్యతాయితంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఒకవేళ మీ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవకు అభినందనలు తెలిపారు. పెన్షన్ల పంపిణీలో కలెక్టర్లంతా యంత్రాంగంతో సమన్వయం, సంఘటితంగా పనిచేశారన్నారు. ఇదే చొరవ స్ఫూర్తిని మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ చూపాలని కోరారు. రాబోయే వంద రోజుల ప్రణాళిక సఫలీకృతమై, జిల్లాలన్నీ ప్రగతిపథంలో పరిఢవిల్లేలా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు నీరభ్ కుమార్ ప్రసాద్ అన్నారు.