- వైసీపీ ప్రభుత్వ పాపాలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి
- కొనుగోళ్లలో సిండికేట్‌తో రూ.250 కోట్ల కమీషన్లు నొక్కారు
- పాల ధర పెరుగుతుంటే నెయ్యి ధర ఎలా తగ్గుతుంది?
- ప్రతి మూడు నెలలను ధరల్లో తేడాలు ఎందుకొచ్చాయి?
- కేవలం కొన్ని కంపెనీలకే టెండర్లు ఎలా కట్టబెట్టారు?
- రాష్ట్రంలో డెయిరీలు జగన్‌రెడ్డి కళ్లకు కనిపించలేదా?
- లడ్డూల వ్యవహారంలో ఇంత జరుగుతున్నా ధర్మారెడ్డి ఎక్కడ?
- వై.వి.సుబ్బారెడ్డికి, రివర్స్ టెండర్లకు మధ్య లాలూచీ ఏంటి?
- అర్హత లేని ఏఆర్ డెయిరీకి టెండర్లు ఎందుకు కట్టబెట్టారు?
- దేవుడి మీద భక్తి ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
- టీడీపీ అధికారి ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కొన్ని సంస్థలతో కుమ్మక్కై శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించా రని, ట్రేడిరగ్ చేసే నార్త్ ఇండియా సంస్థలకు మాత్రమే టెండర్లు కట్టబెట్టారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ విమర్శించారు. పాల ధర పెరుగుతుంటే నెయ్యి ధర ఎలా తగ్గుతుందో వైసీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వైసీపీ నేతల అక్రమాలను ఎండ గట్టారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది సంస్థలు మాత్రమే బిడ్లు వేశారని, వాటిలో 5-6 సంస్థలకు టెండర్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం కొన్ని సంస్థలకే ఏళ్ల తరబడి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న అనేక ప్రముఖ డెయిరీలను కాదని, అసలు ఉత్పత్తి సామర్థ్యం లేని ఏఆర్ డెయిరీకి టెండర్లు కట్టబెట్టారు. దొడ్ల, తిరుమల, విజయ, సంగం డెయిరీలు ఇవేమీ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కనిపిం చలేదా? అని ప్రశ్నించారు.
టెండరు డ్రామాలతో అడ్డగోలుగా దోచేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిసిగ్గుగా స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపాలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. దేశం మొత్తం మీద నెయ్యి తయారు చేసేది ఉత్తరాదికి చెందిన కేవలం 5-6 సంస్థలే అన్న రీతిలో అటుకులు చిటుకులు మార్పిడిలాగా కేవలం ఒక ఐదారు మందికే ఎల్1, ఎల్2, ఎల్3 టెండర్లు కట్టబెట్టారు. వైసీపీ హయాంలో టీటీడీ నెయ్యి టెండర్ సిస్టం ఎంత లోపభూయిష్టంగా ఉందో, ఎంత అసహ్యకరంగా మార్చారో, ఎంత గోల్ మాల్ చేశారో పరిశీలిస్తే పుంకానుపుంకాలుగా బయటకు వస్తున్నాయి. రివర్స్ టెండర్ అనే డ్రామాలతో అప్పటి టీటీడీ బోర్డు పెద్దలు అడ్డంగా దోచేశారు. టెండర్లు దక్కించుకున్న ఉత్తరాది సంస్థలు మార్కెట్ రేట్ కంటే 40-50 శాతం రేటు తగ్గించి ఎలా సరఫరా చేశారు? జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వ్యవహారంలో టీటీడీ పెద్దలకు కమీషన్లు ముట్టాయి. అంతేకాకుండా ఆంధ్ర-తెలంగాణ రైతుల కో ఆపరేటివ్‌ని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారు. కమీషన్లు ఇచ్చుకోలేక రివర్స్ టెండరింగ్‌కు భయపడి ప్రముఖ కంపెనీలన్నీ పారిపోయాయనేది వాస్తవం. అన్ని రంగాలలో రివర్స్ అని ఏ విధంగా అయితే దోచేశారో టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ ఉపయోగించుకుని అప్పటి టీటీడీ చైర్మన్లు, ఈవోలు కోట్లు దండుకున్నారు. టీటీడీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ పెద్దలంతా కలిసి ఒక సిండికేట్ లాగా మారి ఐదేళ్ల పాటు దోపిడీ డ్రామా నడిపారు.
ఒక్క కంపెనీకి కూడా కోఆపరేటివ్ చరిత్ర లేదు
ఏటా టీటీడీలో 52 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు జరుగుతుంటే కేవలం 15 సంస్థలే వైసీపీ ఐదేళ్ల పాలనలో టెండర్లు వేశారు. వాటిలో కూడా నాలుగు ఆంధ్ర డెయిరీలు, ఒక కర్ణాటక డెయిరీ ఈ టెండర్ల గోల్‌మాల్ తట్టుకోలేక తప్పుకున్నాయి. వైసీపీ పాలన మొత్తంలో టీటీడీ నెయ్యి టెండర్లు ఎక్కువగా ప్రీమియం, ఆల్ఫా, మల్ గంగా ఏఆర్ డెయిరీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైష్ణవి ఈ నాలుగు సంస్థలకు మాత్రమే దక్కింది. గత ఐదేళ్లలో రూ.1000 కోట్లకు పైగా టీటీడీ కొనుగోళ్లలో ఈ సిండికేట్‌కు సుమారు రూ.250 కోట్లు కమీషన్లు ముట్టాయి. వైసీపీ ప్రభు త్వంలో టెండర్లు దక్కించుకున్న ఒక్క కంపెనీకి కూడా కో-ఆపరేటివ్ చరిత్ర లేదు. అన్నీ ట్రేడిరగ్ కంపెనీలే… వైసీపీ వాళ్లకు రైతులంటే పడదు వాళ్ల నుంచి కమీషన్లు ముట్టవు కాబట్టే ట్రేడిరగ్ కంపెనీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
నెయ్యిలో రివర్స్ టెండరింగ్ అంతా బోగస్
వైసీపీ ప్రభుతంలో పాల రేటు పెరుగుతుంటే నెయ్యి రేటు ఎలా తగ్గుతుంది? అనూ హ్యంగా కిలోకు 70 నుంచి 80 రూపాయలు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో కేవలం 9 సంస్థలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆ సంస్థల వివరాలను వెల్లడిరచారు.
గత ఐదేళ్లలో టెండర్లలో ప్రాధాన్యం ఇచ్చిన కంపెనీలు
1. ప్రీమియం ఆగ్రో ఫుడ్స్ – రాయబరేలి, ఉత్తరప్రదేశ్
2. ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – మహారాష్ట్ర
3. మల్‌గంగ అగ్రి ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – మహారాష్ట్ర
4. ఆల్ఫాబెట్ ప్రోడక్ట్స్` ఉత్తరప్రదేశ్
5. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్`ఉత్తరప్రదేశ్
6. డౌజీ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ` రాజస్థాన్
7. జై శ్రీగాయత్రి మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్`మధ్యప్రదేశ్
8. కృపారం డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తర ప్రదేశ్
9. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తమిళనాడు
రివర్స్ టెండరింగ్‌లో తేడాలు
తేదీ సంస్థ బిడ్ రివర్స్ టెండర్ కిలోలు
నవంబర్ 2019 ప్రీమియం 440 426 –
నవంబర్ 2019 వైష్ణవి 375 373.12 4,50,000
నవంబర్ 2020 ప్రీమియం – 325 6 లక్షలు
నవంబర్ 2020 ఆల్ఫా 405 326.75 –
జనవరి 2021 ప్రీమియం 462 392 10 లక్షల పైనే
జనవరి 2022 ప్రీమియం 418 329 –
జనవరి 2022 బోళేబాబా – 331 7 లక్షల పైనే
జూన్ 2022 ఆల్ఫా 475 467 7 లక్షల పైనే
జూన్ 2022 ప్రీమియం 470 – –
సెప్టెంబర్ 2022 మల్ గంగా 551 496.96 10 లక్షలు
ఏప్రిల్ 2023 ఆల్ఫా 610 424 20 లక్షల పైనే
ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా జగన్‌రెడ్డి?
కేవలం కొన్ని కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు? లోకల్ కేటగిరీలో కేవలం వైష్ణవి తప్పితే ఇతర డెయిరీలు కనిపించలేదా? నిబంధనలను ఇష్టానుసారం మార్చి అర్హత లేని ఏఆర్ డెయిరీకి టెండర్లు ఎందుకు కట్టబెట్టారు? వైసీపీ హయాంలో సుమారు ప్రతి మూడు నెలలను నెయ్యి ధరల్లో తేడాలు ఎందుకొచ్చాయి? కేవలం మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ సంస్థలకే ఎందుకు టెండర్లు ఇచ్చారు? మీకు అందిన ముడుపులు ఎంత? దేశ వ్యాప్తంగా లడ్డూ వ్యవహారంలో ఇంత గందరగోళం నడుస్తుంటే అప్పటి ఈవో ధర్మారెడ్డి ఎక్కడ? వై.వి.సుబ్బారెడ్డికి, రివర్స్ టెండర్లకు మధ్య ఉన్న లాలూచీ ఏంటి? జగన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్‌రెడ్డికి నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే పై ప్రశ్నలకు సమాధానం చెప్పాలి?