చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ దుర్మార్గం

పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ దుర్మార్గం

by చైతన్యరధం
September 23, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ దుర్మార్గం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తప్పు చేసినవారిని జగన్‌ ఏ విధంగా సమర్థిస్తారు?
  • ఇదే ఒక చర్చికి అపవిత్రం జరిగితే జగన్‌ ఊరుకుంటారా?
  • జంతు అవశేషాల కల్తీ నేతితో చేసిన తిరుమల లడ్డూలు అయోధ్య రామ జన్మభూమికి పంపటం మహాపాపం
  • హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం
  • క్యాబినెట్‌, అసెంబ్లీలో చర్చించి బాధ్యులపై కఠిన చర్యలు
  • ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌
    నంబూరు శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో దీక్ష మాలధారణ

అమరావతి(చైతన్యరథం): తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే మహాప్రసాదం లడ్డూను కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో బీఫ్‌ ఫ్యాట్‌, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్‌ ఫ్లవర్‌ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్‌డీడీబీ సీఏఎల్‌ఎఫ్‌ ల్యాబ్‌ నివేదిక ఇచ్చిందని వెల్లడిరచారు. వైసీపీ పాలన కాలంలో ఇలాంటి నేతిని వినియోగించి తయారు చేసిన లక్ష లడ్డూలను శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి తిరుమల తిరుపతి దేవస్థానం పంపి చాలా పెద్ద తప్పు చేసిందన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని, ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి దీన్ని ఖండిరచి పోరాడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. దీనిపై కేబినెట్‌, అసెంబ్లీలో చర్చిచి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్థారణ అయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం ఉదయం వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ తిరుమలను హిందువులు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సంస్కరణల పేరుతో చాలా మార్పులు చేసింది. స్వామివారి పూజా విధానాలను మార్చేశారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేశారు. ఐదుగురు కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనానికి వస్తే రూ.50వేలు వసూలు చేసి బిల్లు మాత్రం రూ. 500 చొప్పునే ఇచ్చారు. నాతోపాటు చాలా మంది రాజకీయ నాయకులు దీనిపై ప్రస్తావించారు. తప్పు జరుగుతుందని వేలెత్తి చూపినా వైసీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని డిప్యూటీ సీఎం పవన్‌ అన్నారు.

ఏ మతమైనా మనోభావాలు దెబ్బతినకూడదు
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అవకతవకలు జరిగాయి. ప్రసాదాల నాణ్యత తగ్గిపోయింది. శ్రీవారి లడ్డూను హిందువులు మహాప్రసాదంగా భావిస్తారు. ఆ మహా ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. అయితే ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదు. దారుణం ఏమిటంటే శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి ఇదే నెయ్యితో చేసిన లక్ష లడ్డూలు పంపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా ప్రసాదాల నాణ్యతపై చర్చ జరుగుతోంది.

గత ప్రభుత్వ పాలన కాలంలో 219 ఆలయాలను అపవిత్రం చేశారు. రథాలు తగలబెట్టారు. రామ తీర్థం ఆలయంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే ఆనాడు పోరాడాం. ఏ మతమైనా మనోభావాలు దెబ్బ తినకూడదు. రామతీర్థం ఘటనపై అందరూ బయటకు రావాలని కోరితే చిలకలూరిపేట నుంచి ముస్లిం సోదరులు బయటకు వచ్చి మద్దతు ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నామని వైసీపీ మాట్లాడుతోంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని. ఆ రోజు రాజకీయం చేయలేదు. అన్ని మతాలను సమానంగా చూస్తాను కనుకే సంయమనం పాటించాను. రామతీర్థం దోషులను పట్టుకొని శిక్షించాలని కోరితే పట్టుకోలేకపోయారని పవన్‌ తప్పుబట్టారు.

వైసీపీ తప్పులకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి
దాడులు జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చుకోడం కూడా తప్పే. ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. పగ, ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదు మాది. వైసీపీకి తప్పులు చేయడం అలవాటయింది. దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. నెయ్యి కల్తీకి గత టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర పాలక వర్గంపై విచారణ జరగాలి, తప్పు ఎవరు చేశారో బయటకు తీయాలి. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. అలాగే ఎవరైనా తప్పులు చేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కూడా కాదు. టీటీడీ బోర్డు ఉన్నది ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమే… దర్శనం టిక్కెట్లు మీ వారికి ఇచ్చుకోవడానికో, మీ ఇష్టానికి కాంట్రాక్టులు ఇవ్వడానికో కాదు. టీటీడీ బోర్డులో తప్పులు చేస్తూ, శ్రీవారిని అపవిత్రం చేస్తాం.. మీరు మాట్లాడకూడదు అంటే కుదరదు. కచ్చితంగా కోపాలు వస్తాయి. మేము మాట్లాడతాం. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తాం, ఖండిస్తాం, చర్యలు తీసుకుంటామని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.

జగన్‌ ఎలా సమర్థిస్తారు?
తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జగన్‌ వారిని ఎలా సమర్థిస్తారు? కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? దోషులకు శిక్ష పడాల్సిందే. చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేది. ప్రపంచం అంతా మాట్లాడేది. గ్లోబల్‌ న్యూస్‌ అయ్యేది. అదే హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? సెక్యూలర్‌ వ్యవస్థకు విఘాతం కలుగుతుందా? హిందువులకు మనోభావాలు ఉండవా? ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం. గత ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను. తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటావా? మరి తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదు అంటున్నారు? మేము మాట్లాడతాం, మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం, సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడుతాం. తిరుమల ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వ హయంలో టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి. మీడియా ప్రతినిధులు సీబీఐకి ఈ కేసు తీసుకువెళ్తారా అని అడిగారు, క్యాబినెట్‌లో చర్చ జరిగే విధంగా చూసి, దీనిపై నిర్ణయం తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహకరిస్తాం. తిరుమలలో జరిగిన ఘటన ఇంకెప్పుడు భవిష్యత్తులో జరగకుండా చూసేలా మా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్‌ స్పష్టం చేశారు.

కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు ఎందుకు మాట్లాడలేదు?
తిరుమలో ప్రతి రోజు దాదాపు 15వేల కిలోల నెయ్యి వినియోగిస్తారు. ఒక కిలో నెయ్యి తయారీకి దాదాపు రూ.వెయ్యి ఖర్చవుతుంది. అలాంటిది రూ.360కే వస్తుందని ఒక మధ్యవర్తి చెబితే క్వాలిటీ చెక్‌ చేయకుండా ఎలా తీసుకుంటారు? స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదు. వైసీపీ అంటే భయమా? లేక సుబ్బారెడ్డి అంటే భయమా? ఉద్యోగులు మౌనంగా ఉండి మహాపరాధం చేశారు. ఈ అపరాధంతో నాకు సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ చెప్పారు.

పవన్‌ కల్యాణ్‌కి పూర్ణకుంభ స్వాగతం
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టేందుకు నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు పవన్‌ కళ్యాణ్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 11 రోజులపాటు కొనసాగనుంది. దీక్ష ముగిసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పవన్‌ కళ్యాణ్‌ దర్శించుకుంటారు.

అంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌కి పార్టీ నాయకులు పూల వర్షంతో స్వాగతం పలికారు. శాస్త్రీయ నృత్యరీతులతో పలికిన ఈ స్వాగతం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పిడుగు హరిప్రసాద్‌, జనసేన నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్‌, అమ్మిశెట్టి వాసు, బండ్రెడ్డి రామకృష్ణ, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post

అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు

Next Post

ధార్మిక అంశాల్లో రాజీవద్దు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

November 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
Next Post
ధార్మిక అంశాల్లో రాజీవద్దు

ధార్మిక అంశాల్లో రాజీవద్దు

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.