- నేరాలు, ఘోరాలతో నిండిపోయిన రాష్ట్రం
- అమసర్ధ పాలనకు నిదర్శనం ఎన్సీఆర్బీ రిపోర్టు
- మాజీ మంత్రి పీతల సుజాత
అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళి తులు, గిరిజనులకు రక్షణలేదని, అందుకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ)నివేదికే నిదర్శనమని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.3 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు జరగని రోజు లేదని, వారి ఆర్తనాధాలు వినిపించని చోటు లేదని అన్నారు. 2021లో జరిగిన నేరాలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ ఆదివారం విడుదల చేసిన వార్షిక నివేదిక జగన్‌రెడ్డి తుగ్లక్ పాలనను తేటతెల్లం చేస్తోందని చెప్పారు. 2020తో పోలిస్తే 2021 లో ఎస్సీలపై నేరాలు 3.28శాతం, ఎస్టీలపై నేరాలు 12.81 శాతం పెరిగినట్లు వివరించారు. గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన దాడుల్లో 3.95 శాతం, ఎస్టీలపై జరిగినవాటిలో 4.10శాతం ఏపీలోనే నమో దైనట్లు తెలిపారు. ఇటువంటి నేరాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉందన్నారు.
ఎస్టీలపై పెరుగుతున్న దాడులు
రాష్ట్రంలో ఎస్టీలపై జరిగే దాడులు పెరుగుతున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి లక్ష మంది ఎస్టీ జనాభాకు 8.4 నేరాలు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 13.7 నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎస్టీలపై నేరాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అయిదో స్థానంలో ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవరైన దళిత యువకుడు సుబ్రమణ్యంను హత్య చేసి, శవాన్ని డోల్ డెలివరి చేశాడని మండిపడ్డారు. మాస్కు అడిగినందుకు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ని శారీరకంగా, మానసికంగా వేధించి చనిపోయేలా చేశారన్నారు. మద్యం ధరల్ని ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు ఓం ప్రతాప్ ను చంపారని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరిలో వరప్రసాద్‌కు శిరో ముండనం చేయించినట్లు తెలిపారు. మాస్కు పెట్టుకోలేదని ప్రకాశం జిల్లాలో థామస్ పేటకు చెందిన కిరణ్ ను పోలీసులే కొట్టి చంపేశారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో మెజిస్ట్రేట్ రామకృష్ణ, అతని సోదరుడు రామచంద్రపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసినట్లు తెలిపారు. పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి, హత్య చేశారని మండిపడ్డారు. అమరావతిలో దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టి 18 రోజులు జైలు పాలు చేసిన ఘన జగన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సత్తెనపల్లి నియోజకర్గంలో మంత్రూబాయి అనే ఎస్టీ మహిళను వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి చంపారని చెప్పారు. గిరిజనులకు సంబంధించిన లేటరైట్, బాక్సైట్ ని అడ్డగోలుగా దోచుకొని వాళ్ల పొట్టగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డికి దళితులు, గిరిజనులు అంటే ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత
వైసీపీ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లోనే జరిగినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గతేడాది ఇలాంటి ఘటనలపై 7,788 కేసులు నమోదుకాగా, అందులో 2,370 (30.43శాతం) ఏపీలో నమోదు కావడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ లో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగినట్లు తెలిపారు. 2020లో 853 హత్యలు జరగ్గా, 2021లో 956 జరిగినట్లు చెప్పారు. మహిళలపై 2020లో 1095 అత్యాచార ఘటనలు జరగ్గా, 2021లో 1,188 ఘట నలు జరిగాయన్నారు. గతేడాది కంటే అత్యా చారాలు 8.49 శాతం పెరిగినట్లు తెలిపారు. 2020లో 737 కిడ్నాప్‌లు జరిగితే, 2021లో 835 జరిగినట్లు పేర్కొన్నారు. అంటే 13.29 శాతం ఘటనలు అధికంగా నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేర ఘటనలు 2020లో 17,089 ఘటనలు జరగ్గా, 2021లో 17,752 జరిగాయని, అంటే 3.87 శాతం పెరిగినట్లు వివరించారు. ఈ కేసులలో ఎక్కువ మంది నిందితులు వైసీపీ నేతలు, కార్యకర్తలేనని, వారంతా జగన్ రెడ్డి అండతోనే ఈ నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు. వైసీపీ పాలన వైఫల్యాల్ని, వైసీపీ నేతల అక్రమాలని