- ఫైరింజన్లతో పారిశుధ్య పనులు ప్రారంభించాలి
- హోంమంత్రి వంగలపూడి అనిత
- అయోధ్యనగర్‌లో ముంపు ప్రాంతాల్లో పర్యటన
విజయవాడ(చైతన్యరథం): అయోధ్యనగర్ 32వ వార్డులో ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పర్యటించారు. ఈ ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న వరద నీరు, స్కూల్‌లో నిలిచిన నీటిపై ఐఏఎస్ అధికారి విజయరామరాజుతో చర్చించారు. వరద నీటిని గట్టుపై నుంచి తోడి వేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. వార్డులో ఉన్న వరద నీరు సాయంత్రానికి క్లియర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫైర్ ఇంజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేయించి పారిశుధ్య పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రజ లకు అందుతున్న ఆహారం, తాగునీరు, పాలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదే శించారు. శుక్రవారం నాటికి వార్డును సాధారణ స్థితికి తీసుకువస్తామని విజయరామరాజు మంత్రికి వివరించారు.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
కొండపల్లి పట్టణ పరిధిలోని శాంతినగర్, జగనన్న కాలనీలో బుడమేరు వరద బాధితులకు హజరత్ సయ్యద్ షా బుకారి బాబా ఆస్థాన లంగర్ ఖానా నిత్యాన్నదాత అల్తాఫ్‌బాబా ఆధ్వ ర్యంలో గురువారం 3 వేల మందికి అన్నదానం చేశారు. ముంపు ప్రాంతాలను పరిశీలిం చడానికి వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత కార్యక్రమంలో స్వయంగా పాల్గొని అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు వేల మందికి రుచికరమైన ఆహారం అందిస్తుండటం అభినందనీయమని అల్తాఫ్ బాబా సేవలను ప్రశం సించారు. మునుపెన్నడూ లేని విధంగా బుడమేరు, కృష్ణానది వరద తీవ్ర నష్టాన్ని మిగి ల్చిందని, బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్‌బాబా కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.