అమరావతి, చైతన్యరథం: గత నెల 22వ తేదీన ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలోనూ ఇంకా తప్పులు ఉన్నాయని, వాటిని వెంటనే సరిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ఇప్పటికే వివిధ వార్తపత్రికల్లో వివిధ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను ఎత్తిచూపుతూ శనివారం నాడు లేఖ రాశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెదరావురు గ్రామంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో, పుత్తూరు నియోజకవర్గంలోని పరిధిలోని పుత్తూరు పట్టణంలో, కుప్పం నియోజకవర్గంలోని కుప్పం పట్టణంలో ఓటర్ల జాబితాలో బయటపడ్డ తప్పులను తెలుపుతూ లేఖ రాశారు. ఈ తప్పులపై సంబంధిత అధికారుల సరైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని వర్ల రామయ్య కోరారు.