- ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరులపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు
- మొత్తం ఘటనలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలు చేయాలని చూస్తున్నారని. దీనిని తెలుగుదేశం పార్టీ సహించేది లేదని ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు హెచ్చరించారు. జాకీ పరిశ్రమ తరలి పోయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా పరిణామాలపై టీడీపీ నేతలు సోమవా రం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి,పార్థసారధి, ఈరన్న,మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జి లు ఎస్పీని కలిశారు. ఎమ్మెల్యే బెదిరింపుల వల్లే జాకీ పరిశ్రమ పోయిందని మేము విమర్శిస్తే.. దీనిపై ఎమ్మె ల్యే ప్రకాష్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు చంద్ర శేఖర్‌రెడ్డి స్థాయిమరచి చంద్రబాబు,రామకృష్ణ, సోము వీర్రాజు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడుల తో పాటు పరిటాల కుటుంబంపై వ్యక్తిగత దూషణల కు పాల్పడ్డారని తెలిపారు. అసభ్య పదజాలంతో దూషించారని.. ఇది కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైందన్నారు. అలాగే గంటాపురం జగ్గు అరె స్టుపై పోలీసులు వ్యవహరించిన తీరు, వైసీపీ నాయ కుల దాడుల గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
మొద్దుశీను హత్యవెనుక తోపుదుర్తి సోదరుల పాత్ర : మాజీమంత్రి పరిటాల సునీత
జిల్లా ఎస్పీని కలసిన అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడు తూ చంద్రబాబు లాంటి పెద్ద వ్యక్తులను ఇష్టాను సారం దూషిస్తేవారిపై నామ మాత్రపు కేసులు పెట్టారని.. అదే మావాళ్లు అన్నమాట లకు 307కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా వ్యవహరిస్తు న్నారని.. ఇష్టానుసారం కేసు లు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారని అన్నారు. రామగిరి సీఐ చిన్న గౌస్ గురించి ప్రత్యేకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తోపుదుర్తి చందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదంటూ హితవు పలికారు. ఆ రోజు పరిటాల రవిని చంపించింది వైఎస్ అన్న విధంగా చందు మాట్లాడారని… అనుకుంటే మొద్దుశీను ద్వారా చంద్రబాబును కూడా చంపించి ఉండేవారమంటున్నారంటే ఈ రెండు హత్యల వెనుక ఎవరి పాత్ర ఉందో తెలుస్తోందన్నారు. మొద్దుశీను హత్యలో ప్రకాష్‌రెడ్డి సోదరులకు పాత్ర ఉందంటూ ఆరోపించారు.
పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతోంది : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
చంద్రబాబు, లోకేష్ లాంటి నాయకులనే టార్గెట్ చేస్తా మంటూ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరులు అంటున్నారంటే.. వారి మనస్థత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులను భయ పెట్టి దాడులుచేసి రాజకీయాలు చేయాలని చూస్తుంటే… దీనికి వైసీపీ నేతలు మద్దతు తెలుపుతారా అంటూ ప్రశ్నిం చారు.రాజకీయ నాయకులంటే అసహ్యంకల్గే విధంగా చందులాంటి వ్యవహరిస్తున్నారన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు స్వేచ్ఛగా తిరగ్గలరా అని ప్రశ్నించారు. ఆరోజు చంద్రబాబు అడ్డు చెప్పినా టిడిపి కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండ దన్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పుడు తమ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదన్నారు.
తప్పుడు పోలీసులపై విచారణకు కమిషన్ వేస్తాం : పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్
నారా లోకేష్‌ను చంపుతామంటూ ప్రత్యక్షంగా చెబుతు న్నా.. పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అనే పదానికి ఈ ప్రభుత్వంలో అర్థం మార్చేశారని.. పోలీసు అధికారులు, సలహాదారుల కాల్ లిస్ట్ తీస్తే అసలు రంగు బయటపడుతుందన్నారు. సీఎంఓ కార్యాలయం చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ పని చేస్తోందన్నారు. రాజ్యంగేతర శక్తుల నుంచి పోలీసు వ్యవస్థకు విముక్తి కలగాలన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుచేసిన పోలీసులపై ఒక కమిషన్ వేస్తామని, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.
కేసుల్లో పక్షపాతమెందుకు? : మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాలు ఒకరి నొకరు విమర్శించుకోవడం సహజంగా ఉంటుం దని.. కానీ ఇళ్లలో ఉన్న మహిళల మీద కూడా విమర్శలుచేసే నీచస్థాయికి వైసీపీ నేతలు వెళ్లారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఇందు కు ప్రత్యక్ష ఉదాహరణ చందు మాట్లాడిన మాట లేనన్నారు. ఈరోజు టీడీపీ నాయకులు ముందుకు కదలాలంటే 30యాక్ట్ అంటూ అడ్డుకుంటారని.. కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతలమీద అయితే బెయిలబుల్ కేసులు.. మాకు అయితే నాన్‌బెయిలబుల్ కేసులు పెడతా రా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం జగన్ వీటిపై స్పందించి.. నాని, వంశీ, చందు లాంటి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఫ్యాక్షనిస్టులా పాలన సాగిస్తున్న జగన్ : మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ.. ఇలా కక్ష సాధింపులకు పాల్పడే సీఎం జగన్ ను చూస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఎవరైనా బహిరంగసభల్లో మాట్లాడి నా వారిపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు తోపుదుర్తి బ్రదర్స్ మాట్లాడిన మాటల పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు ఆరోజు ప్రతికార చర్యలు ప్రోత్సహించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రతిపక్షాలను అడుగడగునా అడ్డుకుంటూ రాజ్యాంగాన్నే కాలరాస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి హింసకు వైసీపీ నేతలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తా నని ప్రకటించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడు తున్నారన్నారు.
రవి హత్యలో భాగముందని ఒప్పుకున్నట్లేగా? : మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వర నాయుడు
మొద్దుశీనుకు చెప్పి ఉంటే ఆరోజే చంద్ర బాబును చంపి ఉండేవాడని చెబుతున్నారంటే.. పరిటాల రవి హత్య వెనుక మీ పాత్ర ఉందని ఒప్పుకున్నట్లే కదా అని కళ్యాణదుర్గం నియోజక వర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడిన మాటల మీద పోలీసులు కేసులు నమోదుచేసి విచారణ చేయా లన్నారు. నారా లోకేష్ జోలికి వస్తే లక్షలాది మంది టీడీపీ శ్రేణులు ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు.