చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇదీ పెట్టుబడుల ‘పవర్‌’!

అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం

by చైతన్యరధం
Jan 31, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇదీ పెట్టుబడుల ‘పవర్‌’!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.44,776 కోట్లతో 15 ప్రాజెక్టులకు ఆమోదం
  • 19,580 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3వ ఎస్‌ఐపీబీ సమావేశం
  • 3 నెలల్లో అర్సెల్లార్‌, బీపీసీఎల్‌ ప్రాజెక్టుల శంకుస్థాపన
  • త్వరితగతిన గ్రౌండ్‌ అయ్యేలా అధికారులు ట్రాక్‌ చేయాలి
  • డిపి వరల్డ్‌, ఏపీ ముల్లర్‌ మార్క్స్‌తో సంప్రదింపులు జరపాలి
  • అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు మంచి ఫలితాలిస్తున్నాయి. వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ మూడో సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో ఎస్‌ఐపిబీ ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ రూ.3 లక్షల కోట్లు దాటాయి. వీటితోపాటు అర్సెల్లార్‌ మిట్టల్‌, ఎన్టీపీసీ, హెచ్‌పిసిఎల్‌, బీపీసీఎల్‌ వంటి సంస్థల పెట్టుబడులకు ఇప్పటికే లైన్‌క్లియర్‌ అయ్యింది. రూ.1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే అర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ పరిశ్రమకు, రూ. 96వేల కోట్లతో ఏర్పాటయ్యే బీపీసీఎల్‌ వంటి ప్రాజెక్టులకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు అన్ని అనుమతులు పూర్తిచేసి ప్రాజెక్టులను గ్రౌండ్‌ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
7 నెలల్లో మూడుసార్లు ఎస్‌ఐపీబీ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 7 నెలల కాలంలో తెచ్చిన పాలసీలు, అందిస్తున్న సహకారంతో పెట్టుబడుల రాక ఆశాజనకంగా సాగుతోంది. మొదటి ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.83,987 కోట్లు, రెండో ఎస్‌ఐపీబీలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన మూడవ ఎస్‌ఐపీబీ సమావేశంలో మరో రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. నేడు ఆమోదం పొందిన 15 ప్రాజెక్టుల ద్వారా రూ.19,580 మందికి ఉపాధి లభిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రూ.3,10,925 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటిద్వారా 3,12,576 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్ష
పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్‌ చేయాలని సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతినీ తప్పనిసరిగా ట్రాకింగ్‌ చేయాలని ఆదేశించారు. గత రెండు ఎస్‌ఐపీబీ సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపైనా గరువారంనాటి సమావేశంలో చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్‌ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్‌ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్రస్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష జరపాలని ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందన్నారు. దావోస్‌ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన దుబాయ్‌కు చెందిన డిపి వరల్డ్‌, డెన్మార్క్‌కు చెందిన ఏపీ ముల్లర్‌- మార్క్స్‌వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి, సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి అవకాశాన్నీ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలన్నారు. పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని… ఈ రంగంలో 20శాతం వృద్ధి సాధించాలని చెప్పారు.
తాజా పెట్టుబడుల వివరాలు
ఎస్‌ఐపీబీ మూడో సమావేశంలో ఆమోదం తెలిపిన 15 ప్రాజెక్టులు.. పునరుత్పాదక విద్యుత్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రానున్నాయి.
నవయుగ ఇంజినీరింగ్‌
అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలిలో 1,500 మెగావాట్లతో, చిత్తంవలసలో 800 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.14,328 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. 3,450మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మేఘా ఇంజినీరింగ్‌
అన్నమయ్య జిల్లా కొమ్మూరులో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ రూ.10,300 కోట్లతో 3,000 మందికి ఉపాధి కలిగేలా పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టును నెలకొల్పనుంది.
యాస్పరి
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 118.8 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరి రెన్యూవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆసక్తి కనబరించింది. ఈ ప్రాజెక్టు రాకతో 150 మందికి ఉపాధి లభిస్తుంది.
అనంతపూర్‌ రెన్యూవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
అనంతపురంలో 178.20 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టును అనంతపూర్‌ రెన్యూవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.972.23 కోట్లతో 225మందికి ఉపాధి కలిగించేలా ఏర్పాటు చేయనుంది.
కడప రెన్యూవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
శ్రీసత్య సాయి జిల్లాలో కడప రెన్యూవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,163.11 కోట్లతో 300 మందికి ఉపాధి కలిగేలా 231 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టు నెలకొల్పనుంది.
ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ 201.30 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టును రూ.1,651 కోట్లతో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 255 మందికి ఉపాధి దొరకనుంది.
అయానా పవర్‌
ఎకోరెన్‌ లిమిటెడ్‌ నుంచి అయానా రెన్యూవబుల్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.4,435 కోట్లతో కర్నూలు జిల్లాలో పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంట్‌ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. 498.30 మెగావాట్ల సామర్ధ్యంతో నెలకొల్పే పవర్‌ ప్లాంటుతో 630మందికి ఉపాధి దక్కనుంది.
ఆంపిన్‌ ఎనర్జీ
ఎకోరెన్‌ లిమిటెడ్‌నుంచి ఆంపిన్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్నూలు, నంద్యాలలో రూ.3,142 కోట్లతో 350 మెగావాట్ల సామర్ధ్యమున్న పవన-సౌర విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 1,200 మందికి ఉపాధి కలుగుతుంది.
ఎస్‌ఏఈఎల్‌
ఒకొక్కటి 300 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 600 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ఏర్పాటు చేస్తోంది. రూ. 3,456 కోట్లతో 2,070 మందికి ఉపాధి కలిగేలా అనంతపురం, కడప, నంద్యాలలో ప్లాంట్లను నెలకొల్పనుంది.
టాటా పవర్‌
అనంతపురంలో 400 మెగావాట్ల సామర్ధ్యంతో రూ.2,000 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ కేంద్రం ద్వారా 1,380 మందికి ఉపాధి లభిస్తుంది.
ఎన్‌ఎస్‌ఎల్‌ రెన్యూవబుల్‌ సీపీపీ
ఎకోరెన్‌ నుంచి ఎన్‌ఎస్‌ఎల్‌ రెన్యూవబుల్‌ సీపీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 50 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విండ్‌, సోలార్‌ హైబ్రిడ్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. దీనికి రూ.567 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 170 మందికి ఉపాధి కలుగుతుంది.
కోరమండల్‌
కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1,539 కోట్లతో కాకినాడ జిల్లాలో తమ ఫెర్టిలైజర్‌ ప్లాంటును విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా 750 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.
అలెప్‌, ఈఎంసీ కొప్పర్తి
కోడూరులో 6 వేలమందికి ఉపాధి కల్పించేలా రూ.305 కోట్లతో అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంట్రప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా (అలెప్‌) ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. అలాగే ఈఎంసీ కొప్పర్తి కడప జిల్లాలో కూడా ఇదే రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ, త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చేసేందుకు కన్వీనర్‌ను నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో కలెక్టర్‌ స్థాయినుంచి రాష్ట్రంలో పైస్థాయి అధికారుల వరకు త్వరగా అనుమతులు వచ్చేలా, క్షేత్రస్థాయిలో తలెత్తే అవరోధాలను అధిగమించేలా కన్వీనర్‌కు బాధ్యత అప్పగించాలని సూచించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 12-04-2026

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

Previous Post

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలి

Next Post

జగన్‌ను మించిన అవినీతిపరుడు పెద్దిరెడ్డి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-04-2026

కార్యకర్త
@ April 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-04-2026

కార్యకర్త
@ April 12, 2026
రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist