- తగిన ప్రతిపాదనలతో ముందుకురావాలి
- ప్రభుత్వ పోర్టల్ ద్వారా వేగంగా అనుమతులు
- ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లకు మంత్రి కొండపల్లి పిలుపు
డల్లాస్/అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని ఏపీ ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండప ల్లి శ్రీనివాస్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం డల్లాస్లో ఎన్ఆర్ ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా పెట్టుబడులు పెట్టే వారు అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం అవుతుందని వెల్లడిరచారు. ఎన్ఆర్ఐలు తగిన ప్రతిపాదనలతో ముందుకురావాలని పిలుపునిచ్చారు. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, అనుమతులు వెంటనే ఇచ్చేందు కు ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఔత్సాహిక పెట్టుబడిదారులు తమ ప్రతిపా దనలతో ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగే రోజులకు ఈ ప్రభుత్వంలో కాలం చెల్లిందని చెప్పారు. ప్రభుత్వం రూపొందిస్తున్న యాప్లో రిజిస్టరు అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులే వర్చువల్ కాల్స్ ద్వారా పెట్టుబడిదారులకు అందుబాటులోకి వస్తారని తెలిపారు. వారితో టచ్లో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ అన్నిరకాల సహకా రం అందిస్తారని వెల్లడిరచారు.
ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామం వంటిదని మంత్రి సూచించారు. రాష్ట్రంలో సంవత్సరానికి 50 వేల మంది విద్యార్థులకు చివరి సెమిస్టర్ నుంచి ఐటీ శిక్షణ ఇవ్వబో తున్నామని ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. ఇందుకోసం ఐబీఎం, ఇతర ఐటీ కంపెనీల తో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకా రంతో కెపాసిటీ బిల్డింగ్ సెంటర్లు పెడుతున్నామని వివరించారు. ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్ కోమటి జయరాం అధ్యక్షత వహించగా రామకృష్ణ గుళ్లపల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో సుధీర్ చింతమనేని, కె.సి.చేకూరి, రవీంద్ర చిట్టూరి, వినోద్ ఉప్పు, సతీష్ కొమ్మన, కిషోర్ చలసాని, కృష్ణమోహన్ దాసరి తదితరులు పాల్గొన్నారు.