- పాదయాత్ర హామీల అమలులో విఫలం
- అటకెక్కిన రైల్వే జోన్, మెట్రో ప్రాజెక్టులు
- సాగునీరు మాట దేవుడెరుగు, తాగునీరేదీ
- గుడ్డుమంత్రి దెబ్బకు పరిశ్రమలు పరార్
- వైరస్‌ను కలిసిగట్టుగా తరిమికొడదాం
- సూపర్`6 హామీలు జనంలోకి వెళ్లాలి
- పార్టీ శ్రేణులకు లోకేష్ పిలుపు
విశాఖపట్నం (చైతన్యరథం): ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్ అంటూ, పాదయాత్రలో విశాఖకు 50 హామీలిచ్చి నెరవేర్చలేకపోయాడన్నారు. విశాఖ రైల్వే జోన్ పూర్తిచేస్తామన్నారు, చేయలేదు. విశాఖ మెట్రో పూర్తిచేస్తామన్నారు, చేయలేదు. మూత పడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మోసం చేశారు. 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు.. తాగునీరు కూడా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా, కోడిగుడ్డు మంత్రి దెబ్బకు పరిశ్రమలే పారిపోతున్నాయని దుయ్యబట్టారు. విశాఖకు పరిపాలన రాజధాని తీసుకువస్తామని చెప్పి భూములు కబ్జా చేస్తున్నారు. రుషికొండకు గుండుకొట్టి ఏకంగా రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఒక వ్యక్తి కోసం ఇంత ఖర్చు పెట్టారు. టిడ్కో ఇళ్లకు ఆ డబ్బు ఖర్చు పెట్టి ఉండే మీ అందరికీ ఇళ్లు వచ్చేవి. రోజుకో భవనంలో పడుకుంటాడా? అంటూ నిలదీశారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1400 పీహెచ్‌డీ సీట్లు అమ్ముకున్నారు. ఇక్కడ విసి ప్రసాదరెడ్డి పేరు కూడా ఎర్రబుక్‌లో రాసుకున్నా. అధికారంలోకి వచ్చాక ఆయనపై న్యాయవిచారణ జరుపుతామని హెచ్చరించారు.
విశాఖ నార్త్ టీడీపీ కంచుకోట. మంచి మెజార్టీతో గంటాను గెలిపించారు. 2014-19లో టీడీపీ చేసిన అభివృద్ధే ఇప్పటికీ ఉంది. మేం వేసిన డ్రైయిన్లు, రోడ్లే ఉన్నాయి. రూ.200 పెన్షన్‌ను రూ.2000 చేశాం. 118 సంక్షేమ కార్యక్రమాలు కులాలకు, మతాలకు అతీతంగా అందించాం. కమ్యూనిటీ భవనాలు కట్టాం. ఆనాడు హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సొంత కుటుంబ సభ్యులను కాదని, విశాఖ ప్రజలే నా కుటుంబ సభ్యులని.. తుఫానుకు ముందే ఇక్కడకు చేరారు. ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతున్నా చంద్రబాబు పది నిమిషాలు ఉండి ఇక్కడకు వచ్చారు. విద్యుత్, పాలు, నీళ్లు యుద్ధ ప్రాతిపదికన అందించారు. 2019 ఎన్నికల్లో ఎదురుగాలిలో సైతం విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌లో టీడీపీని గెలిపించారు. ఈ నాలుగు నియోజకవర్గాలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. ప్రత్యేకంగా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి మౌలిక సదుపాయాలు కల్పిసామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు టిడ్కో ఇళ్లు కట్టిస్తామని, హైవే దాటాలంటే కిందనుంచి వెళ్లాల్సిన పరిస్థితి. బ్రిడ్జి నిర్మించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. అల్లూరి విగ్రహం ఏర్పాటు తప్పకుండా చేసుకుందామని లోకేష్ హామీ ఇచ్చారు. వైకాపా తరపున కేకే రాజు తిరుగుతున్నారు. నియోజకవర్గాన్ని గంజాయికి, రౌడీయిజానికి కేంద్రంగా మార్చారు. ఏకంగా మిషనరీ భూములు కూడా స్వాహా చేస్తున్నారు. రుషికొండ, హయగ్రీవ, దసపల్లా భూములు కొట్టేస్తున్నారు. కన్ను పడితే మీ భూములు కూడా కొట్టేస్తాడు జాగ్రత్త అంటూ వైకాపా ఎమ్మెల్యేపై చెణుకులు విసిరారు. టీడీపీ బలం కార్యకర్తలేనని, దేశంలోనే కార్యకర్తల పార్టీ టీడీపీ అంటూ, నాయకులు వెళ్ళినా కార్యకర్తలు అండగా ఉన్నారు. పసుపు జెండాను చూస్తే నూతన ఉత్సాహం. గత ఐదేళ్లుగా ఎన్ని కేసులు పెట్టినా మడమ తిప్పకుండా టీడీపీకి కాపలా కాస్తున్న సేనను గుండెల్లో పెట్టుకుంటానన్నారు.
వైకాపా కార్యకర్తలకు ఉత్సాహం రావాలంటే బూమ్ బూమ్ కావాలి. కానీ.. పసుపు సైనికులకు చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే చాలని శ్రేణులను ఉత్సాహపర్చారు. అలాంటి కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఇప్పటి వరకు వందకోట్లు ఖర్చు చేశామని, బాధిత కుటుంబాల పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు మా తల్లి భువనమ్మ అని సగర్వంగా ప్రకటించారు. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్ 60 లక్షలమంది కార్యకర్తలను ఇచ్చారు. మనం అందరం ఒక కుటుంబం. అందరం కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని, కష్టపడిన వాళ్లను నామినేటెడ్ పదవులతో గుర్తు పెట్టుకుంటానని ప్రామిస్ చేశారు. వైసీపీ పేటిఎం బ్యాచ్ మాయలో పడకుండా తెదేపా-జనసేన కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.