చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కుండపోత వానలు

ప్రమాద నివారణ చర్యల సూచించిన చంద్రబాబు

by చైతన్యరధం
Oct 17, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కుండపోత వానలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం
  • దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీఎన్డీఎంఏ
  • రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష
  • ప్రమాద నివారణ చర్యల సూచించిన చంద్రబాబు

విజయవాడ (చైతన్య రథం): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలావుంటే `నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు.. నెల్లూరుకు 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ప్రకటించింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే `ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎన్టీఆఆర్‌ఎఫ్‌, 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నిన్నటి నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై బుధవారం అధికారులతో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఇదిలావుంటే.. నెల్లూరు నగరంతో పాటు కావలి, అల్లూరు, బిట్రగుంట, గుడ్లూరు, లింగసముద్రం, వింజమూరు, వరికుంటపాడు, ఇందుకూరుపేట, కొండాపురం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం కనియంపాడులో పిల్లపేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం వద్ద మిడతవాగులోకి వరద చేరుతోంది. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, రాజుపాలెం, కొత్తపట్నం, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. తీరప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌తోపాటు 360మంది పోలీసులతో 18 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. కడప బస్టాండ్‌లోకి భారీగా వరదనీరు చేరింది. పోరుమామిళ్ల, ఒంటిమిట్టలో అత్యధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తి- తడమార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువ ప్రాంతాల వరదతో స్వర్ణముఖి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. తిరుమల కనుమ రహదారుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి పాదాలు, జాపాలి, ఆకాశగంగకు భక్తులను అనుమతించడం లేదు. వర్షాల కారణంగా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే.

తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు
వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. జేసీబీల ద్వారా సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తితిదే ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను తితిదే అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేశారు. వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది. రాజీవ్‌ గాంధీ కాలనీ, ఆటోనగర్‌, కొరమీనుగుంటలో వరద వస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్‌వేపై నీరు ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తోపాటు మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌ కలెక్టరేట్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీరప్రాంతాల్లో, వాకాడు, తడ, కోట, సూళ్లూరుపేట, చిల్లకూరులో వర్షం కురుస్తోంది.

రేణిగుంట రన్‌ వేపై నీరు
తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేణిగుంట రన్‌వేపైకి నీరు చేరింది. ల్యాండిరగ్‌ సమస్య తలెత్తడంతో ఇండిగో విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. ఈ విమానం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట చేరాల్సి ఉంది.

Previous Post

బీసీలకు రక్షణ కవచం!

Next Post

జోగి రమేష్‌ అండతో ఆస్తి కబ్జా చేశారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
చేతులు చాచిన సాయం!
ఆంధ్రప్రదేశ్

చేతులు చాచిన సాయం!

చైతన్యరధం
@ April 21, 2026
అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక
ఆంధ్రప్రదేశ్

అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist