- నువ్వు లారీక్లీనర్ గాడివి.. లోకేష్‌తో నీకు పోలికేమిటి?
- బ్రోకర్లను పంపడమెందుకు జగన్ రెడ్డీ.. నేరుగా నువ్వేరా!
- గూగుల్ సెర్చిలో జగన్ నెం.1 420 అని ఎందుకు వస్తోంది?
- మూడేళ్లుగా 3ఇటుకలు పెట్టని వారు విశాఖను రాజధాని చేస్తారా?
- 2024నాటికి ఎకరం 18కోట్లని తాకట్టుపెట్టి లోన్ తెచ్చింది ఎవరు?
- ఆడవాళ్లను రోడ్లవెంట పంపి రాజకీయం చేసిందెవరు?
- హైదరాబాద్ ఎయిర్ పోర్టు భూములపై సిబిఐ కేసు వేసిందెవరు?
- కోర్టులకు వెళ్లకుండా సాకులతో తప్పించుకు తిరుగుతున్నదెవరు?
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
తాను చేసే అడ్డగోలు పరిపాలన, దోపిడీపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని నివేదికలు అందినప్పుడల్లా అసలు విషయాన్ని పక్కాదారి పట్టించేందుకు 420 ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించే ఆయుధం పెంపుడు కుక్కలతో ఎదురుదాడి. తాజాగా తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్, పెంపుడుకుక్క కొడాలి నాని మరోమారు మీడియా ముందుకు వచ్చి పార్టీ అధినేతలపై అవాకులు,చెవాకులు పేలాడు. మనిషిరూపంలో ఉన్న మానవమృగం కొడాలి నాని నోటికి..పబ్లిక్ పాయిఖానా పెద్ద తేడా ఏమీ లేదన్న విషయం రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే. ఇలాంటి వెదవలుంటారని తెలిసే చెప్పుతినెడి కుక్క చెరకు తీపెరుగునా అని ఒక మహనీయుడు దశాబ్ధాల క్రితమే ఒక పద్యంలో రాశాడు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన ఒక రాజకీయ పార్టీ. అందుకోసమే మూడేళ్లుగా ముఖ్యమంత్రి తన పెంపుడుకుక్కలతో అడ్డమైన మాటలు మాట్లాడిస్తున్నా ఓపిగ్గా విన్నాం. కొడాలి నాని లాంటి వైసిపి కుక్కలు సభ్యతమర్చి వాగే వాగుడుతో మా ఓపిక కూడా నశించింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాత్రమే విరుగుడుగా గుర్తించి వారి పద్ధతిలోనే సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమయంలో కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలే మాకు స్పూర్తి. ‘‘నిజంకూడా ప్రతిరోజూ ప్రచారంలో ఉండాలి లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది.’’ అందుకే వైసిపి కార్యాలయం వేదికగా కొడాలి అనే నిశాని వెదవ మాట్లడిన ప్రతిమాటకు సమాధానం చెప్పే తీరుతాం.
కేసులకు హాజరుకాకుండా బెయిల్‌పై తిరుగుతున్నది ఎవరు?
కొడాలి నాని డ్రైనేజి నోటితో పాదయాత్రకు కోర్టు ద్వారా అనుమతిపొందిన రైతులను ఉద్దేశించి 420 లు, దొంగలు, కోర్టులకెళ్లి బెయిల్ తెచ్చుకునే వాళ్లు.. కోర్టులకెళ్లి పాదయాత్రలకు అనుమతి తెచ్చుకున్నారని అంటున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16నెలలు చిప్పకూడు తిని ప్రస్తుతం బెయిల్ పైనే ఉంటూ వాయిదాలకు హాజరు కాకుండా బెయిల్ పై తిరుగుతన్నది ఎవరూ ఈ రాష్ట్ర ప్రజలకే కాదు. యావత్ దేశ ప్రజానీకానికి అందరికీ తెలుసు. అడ్డగోలుగా ఎదురుదాడి చేసినంత మాత్రాన వాస్తవాలను, చరిత్రను మరుగునపెట్టలేరు.
అమరావతికి రెండు లక్షల కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తేవాలని అంటున్న పనికిమాలిన సన్నాసి కొడా లి నాని అధికారంలోనే ఉన్నారు కనుక అమరావతి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో ఒక సారి రికార్డులు తెప్పించుకొని చూడాలి. అమరావతిలో సుమారు 10వేలకోట్ల రూపాయల పనులు జరిగితే రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాబోయే 15ఏళ్ల లో రాజధాని ప్రాంతంలో రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది కేవలం రూ.12వేల కోట్లుమాత్రమే. అమరావతి రాజధాని స్వయం సమృద్ధ ప్రాజెక్టు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుచేయాలన్న వాదన కేవలం అవగాహన రాహిత్యం, ప్రజలను తప్పుదారి పట్టించడానికే. రాజధాని మొత్తం గ్రాఫిక్స్ అంటున్న సన్నాసి మూడేళ్లుగా ఎక్కడ కూర్చుని పాలిస్తున్నాడు? చంద్ర బాబు నాయుడు కట్టించిన బిల్డింగుల్లో కూర్చుని, తిరిగి అదే వ్యక్తిపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలి.
విశాఖ అభివృద్ధి అంటే స్టీల్ ప్లాంటు, భూములు అమ్మేయడమా?
విశాఖపట్నం రాజధాని చేస్తామని మాట్లాడుతున్న ఒకప్పటి లారీక్లీనర్ కొడాలీ.. విశాఖ అభివృద్ధి కోసం మూడేళ్లుగా నువ్వు, మీ నాయకుడు ఏం గడ్డిపీకుతున్నారు. మూడేళ్లుగా విశాఖలో మూడు ఇటుకలు కూడా పెట్టని మీ చీటింగ్ మాటల వెనుక అంతర్యాన్ని విజ్జులైన విశాఖ ప్రజలు ఇప్పటికే గమనించారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు విశాఖలో ఐటి, పరిశ్ర మల ఏర్పాటుతో ఆర్ధిక రాజధానిగా తీర్చిదిద్దారు. రాష్ట్రం బాగుపడాలంటే.. అభివృద్ధిని విస్తరించాలి. అంతేగానీ రాజధానుల్ని చెరో మూలకు ఒక్కోటి పంపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు అనే కనీస జ్ఞానం కూడాలేని మాట్లాడటం సిగ్గుచేటు. విశాఖను అభివృద్ధి చేయడమంటే.. విశాఖ నగరానికే తలమానికంగా ఉండే విశాఖ స్టీల్స్‌ను అమ్మడమా? విశాఖకు మణిహారంలా ఉండే రుషికొండను ద్వంసం చేయడమా? విశాఖలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని అప్పు ల కోసం తాకట్టు పెట్టడం అభివృద్ధి చేయడమా? విశాఖ నగరానికి పులివెందుల రౌడీల్ని తీసుకెళ్లి భూ కబ్జాలు, బెదిరింపులు, హత్యలు చేయడమా?
హైదరాబాద్ ఆ అయిదునగరాల సరసన చేరిందా?
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75సంవత్సరాల్లో బెంగుళూరు, చెన్నయ్, కోల్ కతా, ముంబయ్, డిల్లీలు మెట్రోపాలిటన్ నగరాలుగా ఉన్నాయి. హైదరాబాద్ వాటిని మించి ఏమైనా సాధించిందా? అని పిచ్చికుక్క కొడాలి అడ్డగోలుగా వాగుతున్నాడు. చంద్రబాబు నాయుడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించారన్నది అక్షర సత్యం. ఎన్నో లక్షల మధ్యతరగతి కుటుంబాల తలరాతలు మార్చి.. లక్షల మంది యువతీ యువకుల భవిషత్తుని తీర్చిదిద్ది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ వైపు అడుగులు వేయించిన ‘‘సైబర్ టవర్స్’’కు 23 సెప్టెంబర్, 1998 తేదీన చంద్రబాబు హయాంలో ప్రారంభోత్సవం జరిగింది. నాడు సైబరా బాద్ చంద్రబాబునాయుడు వేసిన మొక్క ఇంతింతై వటుడిరతై అన్న చందంగా ఎదిగి లక్షలాదిమంది యువత తలరాతలు మార్చింది. 2021-22లో తెలంగాణాలో ఐటి టర్నోవర్ రూ.1.45లక్షల కోట్లు. దీనికి చంద్రబాబు నాయుడు విజన్ కారణం కాదా? క్యాసినోలు, క్యాబరేలు, పేకాటలే పరిశ్రమగా భావించి నీ నిశాని బుర్రకు ఇది అర్థం కాకపోవడంలో వింతేమీలేదు.
ఆడవాళ్లను అడ్డుపెట్టుకునే వారిది ఒక బతుకేనా?
పిచ్చికుక్క కొడాలి నాని ఈరోజు ఉదయం నుంచి వివిధ సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై తప్పుడు మాటలతో విషం చిమ్మున్నాడు. ఆడ వాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేవారిది ఒక బతుకేనా అని ఒకచోట మాట్లాడాడు. ఎస్.. పనికిమాలిన వెదవ కొడాలి నానికి మేము అదే చెబుతున్నాం. మీ నేత సిబిఐ, ఈడి కేసుల్లో 16నెలలు జైలులో ఉండి చిప్పకూడు తినే సమయంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతిని రోడ్లవెంట తిప్పి రాజకీయం చేసింది ఎవరు? మా ఇళ్లకు వచ్చి దాడి చేస్తే లోకేష్ ను ఇంటికివచ్చి కొడతానని అంటున్నాడు. మేం సవాల్ విసు రుతున్నాం. నువ్వు నిజమైన మగాడివే అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడును గానీ, యువనేత లోకేష్ ను గానీ ఒకసారి టచ్ చేసి చూడు. ఆ తర్వాత ఏమవుతుందో 60లక్షల పసుపు సైన్యం మీకు 70ఎంఎంలో చూపిస్తుంది.