- అభివృద్ధిని ఓర్వలేకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు
- వరద బాధితులకు ఒక్కరికైనా సాయమందించారా?
- రూ.కోటి ఇస్తామని చెప్పారు..ఎక్కడ సైకో జగన్‌రెడ్డి?
- వరదల్లో షో చేసి వెళ్లి మళ్లీ నీతులు చెబుతున్నారా?
- మంచి చేస్తుంటే తట్టుకోలేక దుష్ప్రచారం చేయిస్తారా?
- చంద్రబాబు పనితీరును ప్రజలంతా మెచ్చుకున్నారు
- గ్రీవెన్స్‌లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు
- మంత్రి సంధ్యారాణి, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి
మంగళగిరి(చైతన్యరథం): ఫేక్ ప్రచారానికి తాడేపల్లి ప్యాలెస్‌లో వైసీసీ నాయకులకు ట్రైనింగ్ ఇస్తున్నారని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విమర్శించారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్ధిని, సమస్యల పరి ష్కారంలో ఎంత ముందుకు వెళుతున్నామో చూసి ఓర్వలేక పనికిరాని విమర్శలు చేస్తు న్నారని మండిపడ్డారు. విజయవాడ వరదల్లో 12 రోజులు వరదలో ఉంది.. మొత్తం 149 సచివాలయాల్లో దాదాపు 34 వార్డుల్లో ఉన్న ప్రజలు నరకం అనుభవించారు. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయింది. అసలు ఎక్కడికి వెళ్లాలో.. ఏంటో అర్థం కాని పరిస్థితి చూసి సీఎం చంద్రబాబు చలించిపోయారు. వెంటనే జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని బస్సులోనే ఉంటూ రేయింబవళ్లు మేల్కొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించిన చందంగా వైసీపీ నేతలు బురదజల్లుతూ మాట్లాడ టం సిగ్గు అనిపించట్లేదా? అని ధ్వజమెత్తారు. వరదలో తమ వారిని కోల్పోయి మృతదేహా లను పట్టుకుని ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఏడుస్తుంటే పొక్లెయినర్‌లో స్వయంగా వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చి మరోచోటుకు చేర్చే ప్రయత్నం చేశాం. ఒకాయన వచ్చి నా కుమార్తెను మాత్రమే ఇంటినుంచి తీసుకువచ్చా.. నా భార్య ఇంట్లోనే ఉండి పోయిందంటూ ఏడుస్తుంటే చలించి సీఎం చంద్రబాబు, కొంతమంది వెళ్లి ఆమెను జాగ్రత్త గా తీసుకువచ్చారు. ఇలా ఒకటి, రెండు కాదు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఇటువంటి ఘటనలు చెప్పాలంటే నిజంగా మాకే కన్నీరు వస్తాయన్నారు.
ఒక్కరికైనా సాయమందించావా?
వరదల్లో ప్రజలు కష్టాల్లో ఉంటే నాలుగు, ఐదు రోజుల తరువాత గాల్లో వచ్చి ఒక పది నిమిషాలు అ నీటిలో నడిచి వెళ్లిపోయిన సైకో జగన్‌రెడ్డి కూడా నీతులు చెప్పే స్థితిలో ఉన్నాడంటే..గ్రామాల్లో ఒక సామెత ఉంది..పనికిమాలిన వాడు పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట అన్న చందంగా ఉంది ఆయన తీరు. సీఎంగా ఉన్న సమ యంలో వరదలు వచ్చిన ఏ ఒక్క చోటుకు అయిన వెళ్లి పరామర్శించారా? ఏ సమయంలో ముఖ్యమంత్రి అయ్యాడో కరోనా పట్టుకుని మూడేళ్లు అతలాకుతలం అయ్యాం. ఒక్కరిని అయినా వచ్చి పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కరికి అయిన ఆర్థిక సాయం అందించారా? మరణించిన వారి కుటుంబాల్లో ఒక్కరిని అయిన పలకరించాదా? ఈయన వరదల గురించి, బురదల గురించి, సాయం గురించి మాట్లాడటం సిగ్గు అనిపించట్లేదా? అని ప్రశ్నించారు. కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు.. ఎక్కడ ఇచ్చారు? అని ప్రశ్నించారు.
చంద్రబాబును విమర్శించే అర్హత లేదు
ప్రజలు ఎంత నష్టపోయారో తెలుసా మీకు? మేము ఎంత ఇచ్చామో తెలుసా? మీరంతా పూర్తిగా తినేసి పెద్ద కన్నం పెట్టేసి వెళ్లిపోయారు. లోటులో ఉన్న ఖజనాలోని డబ్బులు తీయలేక ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఇవన్నీ సర్దుకుంటూ ఎన్ని వాటర్ బాటిళ్లు ఇచ్చామో మీకు తెలుసా? ఎన్ని పాల ప్యాకెట్లు ఇచ్చామో మీకు తెలుసా? ఎన్ని లక్షల ఆహార పొట్లాలు ఇచ్చామో తెలుసా? బాధితులను ఓదార్చేందుకు బురద నీటిలో వెళ్లి వారికి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు గురించి అర్హత మీకు లేదు. ఈ రోజు ఎన్ని కోట్లు వచ్చాయో లెక్కలు చెప్పాలని అడుగుతున్న మీకు అసలు బుద్ధి ఉందా? మీ లాగా అస్తులు తాకట్టు పెట్టలేదు.. అందరి డబ్బులు తీసుకోలేదు.. మీలాగా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. రూ.7600 కోట్ల నష్టం జరిగితే మేము నేరుగా 4 లక్షల మందికి రూ.602 కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వారికి రూ.25 వేలు, మొదటి అంతస్తులో ఉన్న వారికి రూ.10 వేలు, కనీవినీ ఎరుగని రీతిలో హెక్టార్‌కు రూ.25 వేలు పంట నష్టపరిహారం ఇచ్చాం. కార్లు, ద్విచక్ర వాహనాలు దెబ్బతింటే బాగు చేయించాం. ఇంట్లో పరికరాలు దెబ్బతింటే బాగు చేయగలిగితే అంతవరకు బాగు చేయించాం. ఇవన్నీ ముందు ఉండి చంద్రబాబు నడిపించారు.
సాయమనే పదానికి అర్థం తెలుసా?
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ ఎందుకు అన్నారో వినాయక చవితిని కూడా వరదల తర్వాత ఆ దేవుళ్ల మధ్యనే జరుపుకున్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి ఇళ్లకు కూడా వెళ్లకుండా ఆ రోజు వార్డుల్లోనే ఉన్నాం. మీకు అసలు సాయం చేయడం తెలియదు.. సాయం అనే పదానికి సైకో జగన్ రెడ్డికి అర్థం తెలియదు. ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. మీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు? ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యతతో చెప్పాం. సీఎం చంద్రబాబును ప్రజలు నమ్మారు.. అందుకే మిమ్మల్ని ఓడిరచారు. డ్యాన్సులు చేసే మాజీ మంత్రులు కొంతమందికి మతులు కూడా భ్రమించాయి. వారు 75 ఏళ్ల మనిషి అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.. మీకు బుద్ధి ఉందా? 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్న చంద్రబాబు గొప్పా? కరోనా కాలంలో ఒక్కసారి కూడా బయటకు అడుగుపెట్టలేని సైకో జగన్ రెడ్డి గొప్పో చెప్పాలి. ఢల్లీి పర్యటనలో ఒకేరోజు ఐదుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు గొప్పా? ప్రతిసారి జైలుకు వెళ్లకుండా బెయిల్ కోసం ఒంటరిగా కాళ్లు పట్టుకునేందుకు వెళ్లిన సైకో జగన్ గొప్పా? అనేది వారే చెప్పాలి.
మంచి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారు
నా నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని తీసుకువచ్చిన ఘనత సీఎం చంద్రబా బు అని గర్వంగా చెప్పుకుంటా.. విశాఖ రైల్వేజోన్‌కు కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. మీరు కనీసం ఆలోచన అయిన చేశారా? అని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు. ఈ రోజు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ విశాఖలో రూ.లక్ష కోట్లతో శంకుస్థాపన జరగబోతుంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు బీచ్ మీదుగా రోడ్డు వేసుకునేందుకు నిధులు మంజూరు చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చేయలేదు.. చేసే వారిని చూసి మాత్రం ఏడుస్తున్నారు. రెండు శాఖలకు మంత్రిగా ఉన్నాను. ఈ నాలుగు నెలల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు రూ.20 కోట్లతో 139 అంగన్‌వా డీ కొత్త సెంటర్లను ఏర్పాటు చేశాం. దాదాపు 7000 ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలను మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అలాగే గిరిజన శాఖ ద్వారా 95,000 గిరిజన యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గిరిజన పల్లెలో రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడకూడదని ‘‘చంద్రన్నబాట’’ సీసీ రోడ్లు మంజూరు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం దాదాపు రూ.30 కోట్లు సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. రూ.75 లక్షలతో రోప్ వే బ్రిడ్జిలను మంజూరు చేశాం. తాగునీటికి కూడా నిధులు మంజూరు చేశారు. వైసీపీ హయాంలో గిరిజన ప్రాం తాలకు చేసింది ఏమీలేదు. చంద్రబాబు పాలనలో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారు.
ప్రజలకు న్యాయం చేయాలన్నదే చంద్రబాబు సంకల్పం
అనుభవం ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు. స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలకు న్యాయం చేయాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. ఆకలి తెలిసిన వ్యక్తిగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ తెరిపించి మూడు పూటలా పేదల కడుపునింపుతున్నారని మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ప్రశంసించారు. తిరుమలలో సైతం కొత్తగా మరో వంటశాలను ప్రారంభించారు. 50 నుంచి 100 మందికి భోజనాలు కావాలని ఎవరైనా ఫోన్ చేసి చెప్తే అన్ని రకాల భోజనాలు కూడా సిద్ధం చేసి వారి వద్దకే వెళ్లి అందజేస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతిరోజూ కష్టపడుతున్నారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమస్యలతో ఉన్న వారు అర్జీ తీసుకుని వస్తే పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అధికారులతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్క రిస్తున్నాం. దీర్ఘకాల సమస్యలు అయితే సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఈరోజు కాకపోయినా నాలుగు, ఐదు రోజుల తరువాత అయినా పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నాం. సీఎం చంద్రబాబు స్ఫూర్తితోనే రోజూ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. సమస్యలు పరిష్కారం అవుతుండటంతో రోజురోజుకూ జనాలు తగ్గుతూ వస్తున్నారు. ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తుంది. గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా స్వాతంత్య్రం కోల్పోయిన ప్రజలు.. ఈ ప్రభుత్వంలో స్వాతంత్య్రం వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సమస్య అని చెబితే అరెస్టు చేసి జైలుకు పంపేవారు. మాస్కు ఇవ్వలేదని ఒక డాక్టర్‌ను అరెస్టు చేసి మానసికంగా హింసించి చంపిన చరిత్ర జగన్‌రెడ్డిదని విమర్శించారు.