అమరావతి, చైతన్యరధం: ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్‌తో ఆయన పిచ్చి పీక్ స్టేజికి చేరిందన్నారు. పిచ్చివాడి చేతిలో రాయి అటు,ఇటు తిరిగి తమ న్యాయమైన డిమాండ్ల కోసం 42రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్ వాడీల వైపు మళ్లిందన్నారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయ డం నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందన్నారు.
తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు ఛలో విజయవాడ కు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు చెలరే గుతున్నాయ న్నారు. ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో తప్పు చేయకపోతే ముఖ్య మంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో టన్నుల కొద్దీ ఐరన్ ఫెన్సింగులు, వందలాది అదనపు బలగాలను దించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా అంగన్వాడీలు ఉక్కు సంకల్పంతో చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఫీుభావం తెలియజేస్తోం దన్నారు.
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరా చక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాం డ్ల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను, టిడిపి – జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియ మిస్తామని నారా లోకేష్ హామీనిచ్చారు. ఈమేరకు సోమవారం నారా లోకేష్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.