శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు 11 వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఘాట్ వద్ద రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు, టెక్కలి శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు, పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయన విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న బ్లడ్ క్యాంపులో స్వచ్ఛందంగా పాల్గొన్న తెదేపా కార్యకర్తలను అభినందించి సర్టిఫికెట్లు అందించారు. ఈ వర్ధంతి సందర్బంగా ఎర్రన్న జవాన్మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన 20మంది ఆర్మీ జవాన్ల కుటుంబాలుకు రూ. 10 వేలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు, శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు, నియోజకవర్గాల ఇన్చార్జులు, మాజీ సైనిక ఉద్యోగ సంఘనాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు