అమరావతి(చైతన్యరథం): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. పిల్లలకు అక్షరాలు నేర్పడంలో, ఆదర్శాలు నింపడంలో గురువుల పాత్ర కీలకమన్నారు.. సమాజానికి ఉత్తమ పౌరులను అందించేది గురువులేనన్నారు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి అని ఆయన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవులను స్వీకరించి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఉపాధ్యాయులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు.
ఈ ప్రపంచంలో గురువే సమస్తమని, విద్యాబుద్ధులు నేర్పి, విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పడే గురువులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. విద్యార్థులు ప్రయోజకులై ఉన్నత స్థానాలను అధిరోహించడమే అసలైన గురుదక్షిణ అన్నారు. అటువంటి జ్ఞానం గురువులే విద్యార్థులకు అందించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్ రామకృష్ణ, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, ఏ.వీ రమణ, పర్చూరి కృష్ణ, హాజీ హసన్ భాష, శంకర్ నాయుడు, బుచ్చి రాంప్రసాద్, ధారపనేని నరేంద్రబాబు, చెన్నుపాటి గాంధీ, చప్పిడి రాజశేఖర్, యామినితో పాటు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.