- జీఓ 1590, 1591, 1592లే సాక్ష్యం..
‘‘ఐపీఎస్ అధికారినైన నేను…భారతదేశ రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని…భారతదేశ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని… భయంకాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను’’…అని చెప్పి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న అధికారులు.. నేడు పోలీసుశాఖ మొత్తం తలదించుకునేలా ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు తీసుకునే ముందు చేసిన ప్రమాణాన్ని గాలికొదిలేశారు. ఓ అవినీతి సామ్రాజ్య చక్రవర్తి మెప్పు కోసం తాము సీనియర్ ఐపీఎస్ అధికారులమనే విషయాన్ని మర్చిపోయి నీతిమాలిన చర్యలకు పాల్పడ్డారు. దేశ చరిత్రలోనే సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్‌కి గురయ్యారు అనే చెడ్డపేరును పోలీసు శాఖకు తెచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షించి, బాధితులకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్నతాధికారులుగా ఉన్న పోలీసు అధికారులే.. బాధితులను కిడ్నాప్ చేసి, వేధించి, భయపెట్టి, సంతకాలు తీసుకుని మూడోకంటికి తెలియకుండా సెటిల్మెంట్‌లు చేశారంటే పవిత్రమైన పోలీసుశాఖపట్ల ఆ అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించారు. ప్రమోషన్లు, లంచాల కోసం వెంపర్లాడే ఐపీఎస్ అధికారులు నేడు వైపీఎస్ అధికారులు అని పిలుబడుతుంటే సభ్య సమాజానికి పోలీసు అధికారుల పట్ల విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టిందని చెప్పక తప్పదు. అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని భావించే పరిస్థితుల నుండి… పోలీసుల వద్దకు వెళితే అన్యాయం జరుగుతుందనే భయాన్ని ఈ ఐపీఎస్ అధికారులు సృష్టించారు. కంచే చేను మేసిందనే సామెతను రుజువు చేసిన ఈ ఐపీఎస్ అధికారుల తీరుతో యావత్ దేశమే ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఐపీఎస్ అధికారులు హద్దులు దాటి, రాష్ట్ర సరిహద్దులు దాటి, ఐపీఎస్ నిబంధనలను వైసీపీ జెండాతో కప్పిపెట్టి, ఏదైతే అదైంది…అనే ఉద్దేశంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారికి కూడా తెలియకుండా ఇతర రాష్ట్రానికి వెళ్లి, ఓ బాధిత మహిళను, తన కుటుంబ సభ్యులను కనీసం నోరెత్తకుండా బెదిరించి, ఏపీకి లాక్కొచ్చి, 40రోజులు నరకం చూపించిన ఈ ఐపీఎస్ అధికారుల తీరుపై యావత్ దేశమంతా దుమ్మెత్తిపోస్తోంది. వివరాల్లోకి వెళితే….
ఓ పారిశ్రామికవేత్తను కాపాడడమే లక్ష్యం
ఓ సినీ నటి, మోడల్, ఉన్నత కుటుంబంలో పుట్టి, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న మహిళ కాదంబరి జత్వాని. సజ్జన్ జిందాల్ అనే ఓ పారిశ్రామికవేత్త వలలో చిక్కి, అన్యాయానికి గురైన జత్వాని ముంబై పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఇది తెలిసి అప్రమత్తమైన పారిశ్రామికవేత్త జిందాల్.. తన ప్రియమైన పారిశ్రామికవేత్త, అవినీతి చక్రవర్తి, ఏపీ ముఖ్యమంత్రి స్థానంలోవున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. వెంటనే అవినీతి సామ్రాజ్యంలో కొలువుదీరి, డీజీపీ స్థానాన్ని ఎప్పుడెప్పుడు కొట్టేయాలా అని ఎదురుచూస్తున్న తాడేపల్లి ప్యాలెస్ ఆస్థాన ఐపీఎస్ పి సీతారామాంజనేయులును జగన్ రంగంలోకిదింపాడు. తానొక ఐపీఎస్ అధికారిననే విషయాన్ని ఐదేళ్ల క్రిందటే మర్చిపోయి, జగన్ ప్రైవేట్ సైన్యాధ్యక్షుడిగా (జేపీఎస్) కొనసాగుతున్న సీతారామాంజనేయులు తనమార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలను తాడేపల్లి రాజప్రాసాదానికి పిలిపించుకుని ‘‘ఆపరేషన్ జత్వానీపై’’ చర్చించాడు. ముఖ్యమంత్రికి కావాల్సిన పనిచేస్తే తమను ఉన్నత స్థాయికి ఎత్తేస్తాడు, మనల్ని ఆపేది ఎవడ్రా? అని ఇద్దరూ చెలరేగిపోయారు. టీమ్‌ను సెట్ చేసుకుని ఫిర్యాదు లేకుండానే ముంబైకి టిక్కెట్లు వేసుకుని ‘‘ఆపరేషన్ జత్వానీ’’ని పూర్తిచేశారు. హమ్మయ్య.. పని పూర్తైంది. మన బెర్తులు కన్ఫర్మ్ అనుకుని సుద్దపూసల్లా డిపార్టుమెంట్‌లో తిరుగుతున్నారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల దెబ్బకు తాడేపల్లి రాజప్రాసాదం పునాదులు కదిలాయి. ఎన్నికల ఫలితాల సమయంలో ప్యాలెస్‌లో టీవీలు బద్దలయ్యాయి. అవినీతి సామ్రాజ్య చక్రవర్తిని నమ్ముకున్న జగన్ భక్త ఐపీఎస్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాము గుట్టుగా చేశామనుకున్న ‘‘ఆపరేషన్ జత్వానీ’’ వెలుగులోకి వచ్చింది. జగన్ భక్త ఐపీఎస్ అధికారుల పాపాలపుట్ట బద్దలైంది. జీఓ నంబర్లు 1590, 1591, 1592లు చేతుల్లోకి వచ్చాయి. ఇంట్లో కూర్చోబెట్టాయి. రానున్న కాలంలో జగన్మోహన్‌రెడ్డికి ఇష్టమైన కారాగారంలో కూర్చోబెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఐపీఎస్‌లు చేసిన పాపాలు అన్నీ, ఇన్ని కాదు.
జనాన్ని ఏమార్చడమే భారతీరెడ్డి పని?
కాదంబరి జత్వానీ కేసులో తన భర్త బాగోతం ఎక్కడ బయటపడుతుందా? అని వైఎస్ భారతీరెడ్డి తెగ భయపడిపోతోంది. అందుకే తన విషపు పత్రిక సాక్షిలో కాదంబరి జత్వానీ వ్యక్తిత్వం దెబ్బతినేలా, పరువు, మర్యాదలను మంటగలిపేలా తప్పుడు రాతలు రాపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలను విషపు పత్రిక సాక్షితో కప్పిపెట్టుకుంటూ తనవంతు ఉడతాభక్తి సాయం చేస్తున్న భారతీరెడ్డి.. నేడు జత్వానీ కేసులోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. కానీ జత్వానీ కూడా తనలాగే ఓ మహిళ అని, ఓ పారిశ్రామికవేత్త చేతిలో మోసపోయిందనే కనీస స్పృహ లేకపోవడం దుర్మార్గం. సొంత చిన మామను తన భర్త అమానవీయంగా చంపితేనే సాక్షి పత్రికతో రక్తపు మరకలను తుడిచేయాలని ప్రయత్నించిన వ్యక్తి భారతీరెడ్డి. ఈ దుర్మార్గపు ఘటనలో తన భర్త జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేందుకు భారతీరెడ్డి తన నాలుకను ఎన్నిసార్లు మడతపెట్టిందో ఈ సమాజం చూసింది. ఇంకా చూస్తూనే ఉంది. గత ఐదేళ్లలో లక్షలాది అమాయకపు జనాన్ని తన అధికారంతో పొట్టనపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను సైతం భారతీరెడ్డి సాక్షి పత్రికతో కప్పిపెడుతూనే వచ్చింది. నేడు ఒక్కొక్కటిగా జగన్‌రెడ్డి పాపాల చిట్టా బయటకు వస్తుండడంతో వాటిని కప్పిపెట్టలేక భారతీరెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతోందని సమాచారం. కాదంబరి జత్వాని కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రపై పోలీసుల దర్యాప్తు లోతుకు వెళ్లిన కొద్దీ… రాష్ట్ర ప్రజలను ఏమార్చి, తన భర్త ప్రజల కోసమే పుట్టాడు, తన భర్త ఓ పెద్ద సుద్దపూస అని చెప్పడానికి భారతీరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఓ ఆడబిడ్డ జీవితంతో చెలగాటమాడుతున్నారని, వాళ్లకు కూడా ఆడబిడ్డలు ఉన్నారనే విషయాన్ని భారతీరెడ్డి, జగన్‌రెడ్డి ఏమాత్రం ఆలోచించడం లేదు.
జగన్ రెడ్డి పాపంలో సింహభాగం భారతీరెడ్డిదే?
తన భర్త దురాగతానికి వంతపాడిన జేపీఎస్ అధికారులకు భుజం కాసి, వాళ్లను ఉత్తమ అధికారులుగా భారతీరెడ్డి తన విష పత్రికలో చిత్రీకరిస్తోంది. తాను అన్ని విధాలుగా అన్యాయానికి గురయ్యానని, తనకు కనీసం తినడానికి కూడా డబ్బులు లేకుండా జేపీఎస్ అధికారులు చేశారని, అక్రమంగా అరెస్టు చేసి, జైల్లో పెట్టి తనను, తన తల్లిదండ్రులను వేధించారని కాదంబరి జత్వానీ నడిరోడ్డులోకి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించి చెప్పినా భారతీరెడ్డికి ఒక్క మాట కూడా వినబడకపోవడం, కనబడకపోవడం విడ్డూరం. తమ వ్యాపారాలకు అండగా నిలిచిన వ్యక్తి సజ్జన్ జిందాల్‌ను కాపాడడం కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులను, మరికొంత మంది పోలీసు అధికారుల భవిష్యత్తును బలితీసుకున్న జగన్మోహన్‌రెడ్డి పాపంలో సింహభాగం భారతీరెడ్డికి కూడా ఉందని చెప్పక తప్పదు. సమాజహితం కోసం నడపాల్సిన పత్రిక, ఛానల్‌ను కేవలం తన భర్త అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, హత్యారాజకీయాలను కప్పిపెట్టడానికే నడుపుతున్న భారతీరెడ్డి ఓ సామాజిక విద్రోహ శక్తిగా, సమాజానికి పట్టిన చీడ పురుగుగా, మహిళాజాతిలో పుట్టిన జాతిద్రోహిగా అభివర్ణించక తప్పదు. జర్నలిజం విలువలకు ఉక్కుపాతరేసిన భారతీరెడ్డి, జగన్మోహన్‌రెడ్డిలను జర్నలిజానికి పట్టిన ఓ మాయని మచ్చగా అభివర్ణించక తప్పదు.
ఈ సమాజం, ముఖ్యంగా మహిళాలోకం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. అక్కచెల్లెమ్మలు అంటూనే మరోవైపు తన కూతురులాంటి జత్వానీకి అన్యాయం చేసిన జగన్‌రెడ్డి, భారతీరెడ్డిల దుర్మార్గాలను తెలుసుకోవాలి. జగన్మోహన్‌రెడ్డి దృష్టికోణం వ్యాపార కోణంలో ఉంటుందే తప్ప, సమాజసేవ కోణంలో ఉండదని గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి గత ఐదేళ్లలో లక్షమందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఎందరో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపంలా కలిసిపోయాయని గుర్తెరగాలి. సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ కేవలం ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్‌రెడ్డి పాపాలను కప్పిపుచ్చడానికి వాడే ఆయుధాలే తప్ప, ప్రజాహితం కోసం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
సిరి కొడాలి, పొలిటికల్ అనలిస్ట్