అమరావతి(చైతన్యరథం): మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో గురువారం వరద సహాయ చర్యలు పకడ్బందీగా కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చవేత పనులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డ్రోన్ లైవ్ ద్వారా లోకేష్ పర్యవేక్షించారు. 2వ గండి పూడ్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి రామానాయుడుతో సమన్వయం చేస్తూ గండ్లు పూడ్చివేత పనులు వేగంగా జరిగేలా మంత్రి లోకేష్ పర్యవేక్షించారు.