అమరావతి (చైతన్యరథం): ఇంటర్ విద్యార్థులకు నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాం. వివిధ కారణాల వల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు.