• పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో తాగునీటికి రామతీర్థం ప్రాజెక్టు నుండి నీరు అందడం లేదు. పక్క గ్రామాలకు వెళుతున్నాయి.
• వెయ్యి అడుగుల లోతు బోర్లు తీసినా మాకు నీరు రావడం లేదు.
• పొలాలకు వెలిగొండ ప్రాజెక్టు లేదా మూసీ నది నుండి పొలాలకు నీరు అందించాలి.
• గ్రామంలో డ్రైనేజీలు లేకపోవడంతో వర్షాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
• రోడ్లు, ఇంటింటికీ కుళాయిలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలన రాష్ట్రప్రజలకు శాపంగా మారింది.
• పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేకుండా చేశారు.
• రోడ్లపై తట్టమట్టి పోయలేని దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉంది.
• గత టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాం.
• టిడిపి అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ఉప్పలపాడుతోపాటు పరిసర గ్రామాలకు సాగు, తాగునీరు అందజేస్తాం.
• గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.