• వెంకటగిరి నియోజకవర్గం ఉయ్యాలపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా పంచాయతీలో 10వేల మంది జనాభా ఉండగా, 500 ఎకరాల పొలం ఉంది.
• కానీ పొలాలకు సాగునీరు లేదు, వర్షాలపై ఆధారపడాల్సివస్తోంది.
• వర్షాలు లేకపోతే గ్రామమంతా వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సివస్తోంది.
• సోమశిల నుండి తెలుగుగంగ కాలువ మా గ్రామం నుండి కండలేరు డ్యామ్ కు వెళుతుంది.
• తెలుగుగంగ కాలువ నుండి కిలోమీటర్ దూరంలో మా గ్రామంలో చెరువుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారు.
• రూ.3వేల విలువైన వైరు కొనలేక లిఫ్టు ను మూలపెట్టిన దివాలాకోరు సిఎం జగన్.
• గత టిడిపి ప్రభుత్వం రైతులకు సాగునీరందరిందించేకు వేలకోట్లరూపాయల వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేస్తే, వాటికి కరెంటుబిల్లులు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేక పాడుబెట్టారు.
• తెలుగుగంగ పక్కనే ఉన్నా ఉయ్యాలపల్లి రైతులకు నీరందించకపోవడం దారుణం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉయ్యాలపల్లి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తాం.