• గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వాకాడు బిసి కాలనీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కాలనీలో 120 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి.
• ఓ వైపు స్వర్ణముఖి, మరోవైపు వాకాడ చెరువు ఉండటంతో లోతట్టు ప్రాంతమైనందున నీరు వచ్చి నిలుస్తోంది.
• నీటినిల్వ ఎక్కువ రోజులు ఉండటంతో కాలనీ వాసులు అనారోగ్యం పాలవుతున్నారు.
• గత ప్రభుత్వంలో కాలనీలోని కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు.
• ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అధికారులకు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా నిధులు లేవని చెప్తున్నారు.
• మీ ప్రభుత్వం రాగానే డ్రేనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• వైసీపీ వచ్చాక ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలను నిర్వీర్యం చేసింది.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.75,760 కోట్ల రూపాయలు దారిమళ్లించిన బిసి ద్రోహి జగన్ రెడ్డి.
• కుర్చీల్లేని బిసి కార్పొరేషన్ల ఏర్పాటుతో బిసిలను దగా చేశారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిసి కాలనీల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు నిర్మించి వర్షపునీరు నిలచిపోకుండా చర్యలు తీసుకుంటాం.