• కొండపి నియోజకవర్గం వేంపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో సర్వే నెం.215లోని పాలేరు నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధిస్తూ మైనింగ్, స్థానిక అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
• వైసీపీ నేతలతో మైనింగ్ అధికారులు కుమ్మక్కయి మా గ్రామంలో అక్రమ తవ్వకాలకు అనుమతించారు.
• రానున్న కాలంలో వేంపాడు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున తవ్వకాలకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
• ఇష్టారీతిన ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లకు నీరు అందడం లేదు.
• తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.
• పశువులకు కనీసం నీరు దొరికే పరిస్థితులు లేవు.
• పాలేరు నదీపరివాహక ప్రాంతం ఎడారిని తలపిస్తోంది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో ఇసుక, అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ వైసిపి నేతలు జేబులు నింపుకుంటున్నారు.
• ఎన్ జిటి ఉత్తర్వులను సైతం పక్కనబెట్టి యథేచ్చగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.
• గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక తవ్వకాల ద్వారా 10వేల కోట్లరూపాయలు దోచుకున్నారు.
• రాష్ట్రంలో నదీతీర ప్రాంతాలప్రజలకు అందుబాటులో లేని ఇసుక పొరుగురాష్ట్రాల్లో మాత్రం పుష్కలంగా దొరుకుతోంది.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం.
• భూగర్భజలాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.