• సూళ్లూరుపేట నియోజకవర్గం వేముగుంటపాలెం కాలువగట్టు వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కాలువగట్టు సమీపంలో కూచివాడపాలెం పంచాయితీ పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఇసుకరీచ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
• వేముగుంటపాలెం, కాలువగట్టు, మడపాలెం, కూచివాడపాలెం, కూచివాడ, చిలమత్తూరు గ్రామాల ప్రజలు బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం.
• దీనివల్ల నదీతీర ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ఉప్పునీరుగా మారి వ్యవసాయ భూములు బీళ్లుగా మారి, వలసలకు దారితీసే అవకాశముంది.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను నిలిపివేయించి, చెక్ డ్యామ్ నిర్మాణం ద్వారా మా పొలాలకు నీరందించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ అండ్ కో ఇసుకపై రూ.10వేల కోట్లు దోచుకున్నారు.
• అడ్డగోలుగా నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపి కర్నాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
• నదీతీర ప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీటి కష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇసుక తవ్వకాలు జరపడం నిబంధనలకు విరుద్దం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతాం.
• స్వర్ణముఖి నదిపై చెక్ డ్యామ్ నిర్మించి తీర గ్రామాల ప్రజలకు సాగునీరు అందజేస్తాం.