మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వివిధ సమ స్యలపై అర్జీదారులు పోటెత్తారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పొం గూరు నారాయణ, ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె సుబ్బారెడ్డి అర్జీలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశిం చారు.
` ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్‌కు చెందిన వాసంతి తన సమస్యను వివరిస్తూ తన పెద్ద నాన్న కొడుకు చనిపోగా తాను, తన భర్త ఇంటికి తాళం వేసి చూసేందుకు వెళ్లగా ఇంట్లో 2023 నవంబరు 16న దొంగలు పడి 25 సవర్ల బంగారం, 3 కిలో ల వెండి దోచుకెళ్లారని వివరించింది. అయితే టూటౌన్ పోలీసులు తమ చేత బల వంతంగా తక్కువ పోయినట్లు 25 సవర్లకు బదులు 10 సవర్ల బంగారం, 3 కిలోల వెండికి బదులు కిలో వెండి పోయినట్లు రాయించి సంతకాలు తీసుకున్నారని తెలిపిం ది. తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసింది.
` తమకు పూర్వీకుల నుంచి వచ్చిన భూమి మరొకరి పేరుతో ఆన్‌లైన్ అయి పాస్ పుస్తకాలు వచ్చాయని.. దానిని సరిచేసి తమ పేరుపై ఆన్‌లైన్ చేయాలని పశ్చి మగోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రాజేష్ వినతిపత్రం అందజేశాడు.
` పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రగతి హైస్కూల్, వృంథా మహిళా కాలేజ్‌లోకి సూర్యదేవర శ్రీనివాసరావు అనే వ్యక్తి తన అనుచరులతో అర్థరాత్రి వెళ్లి తాళాలు పగులకొట్టి కాలేజీ బస్సులు, సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడని సత్తెనపల్లి మండలం నాగార్జునసాగర్‌కు చెందిన మక్కెన పద్మజ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కంప్యూటర్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నాడని, ఈ ఘటనపై విచారణ జరిపించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
` పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన జయవరకు వెంకటలక్ష్మి నివేదిత సమస్యను వివరిస్తూ తన బాబాయి మాటలు విని తన తండ్రి సన్యాసం తీసుకుని తన తల్లిని దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన చదువుకు, తన తల్లి జీవనాధారానికి ఎటువంటి సాయం చేయక పోగా తమనే బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దయచేసి తన తండ్రి నుంచి తనకు వారసత్వంగా రావాల్సిన ఆస్తిని ఇప్పించాల్సింగా విజ్ఞప్తి చేసింది.
` తన తల్లి ద్వారా తనకు సంక్రమించిన భూమికి వైసీపీ కార్యకర్తలు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేశారని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి.రాజవరం గ్రామానికి చెందిన లక్కం సాని రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. దయచేసి తమ భూమిని కబ్జా నుంచి విడిపించి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసింది.