అమరావతి: ప్రశాంతమైన విశాఖ నగరాన్ని చెరపట్టిన పాలకులు దానిని సకల నేరాలకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పాపాల పాలకులు ప్రశాంతమైన విశాఖ పాలిట శాపంగా మారారని ఒక ప్రకటనలో లోకేష్ మండిపడ్డారు. రాజధాని చేస్తామని చెబుతూ విశాఖ నగరాన్ని నేరాలు-ఘోరాలకి అడ్డా చేశారు. విశాఖలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే ఏళ్లు గడిచినా నేటివరకూ నిందితుడ్ని పట్టుకోలేదు. టీడీపీ పాలనలో ఆర్థిక రాజధానిగా విశాఖని ప్రమోట్ చేశాం. వైకాపా విశాఖని అఘాయిత్యాలకి కేపిటల్ చేసింది. రాక్షస పాలనలో రక్షణలేని బాలికలు, మహిళలకు మీ కుటుంబసభ్యుడిగా నాదో వినతి. మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండండి. నేరగాళ్ల రాజ్యం అంతం అవుతుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, మీ రక్షణ బాధ్యత తీసుకుంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.