చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గ్లోబల్‌ ఎకనామిక్‌ హబ్‌గా విశాఖ రీజియన్‌

వీఈఆర్‌ అభివృద్ధి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Dec 13, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
గ్లోబల్‌ ఎకనామిక్‌ హబ్‌గా విశాఖ రీజియన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 7 గ్రోత్‌ డ్రైవర్స్‌, 10 పాలసీలతో అభివృద్ధి ప్రణాళికలు
  • 2032 కల్లా 135 బిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యం
  • మురికివాడలు లేని నగరంగా దానిని తీర్చదిద్దాలి
  • అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ సెంటర్‌
  • వీఈఆర్‌ అభివృద్ధి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • శాఖల వారీగా యాక్షన్‌ ప్లాన్‌, 49 ప్రాజెక్టులపై చర్చ

విశాఖపట్నం(చైతన్యరథం): సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)ను గ్లోబల్‌ ఎకనామిక్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్య మంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, గ్రీన్‌ ఎనర్జీ, మౌలిక వసతు లు.. ఇలా అన్ని విధాలా విశాఖ రీజియన్‌ అభివృద్ధి కావాలని నిర్ధేశించారు. విశాఖను మురికి వాడలు లేని నగరం గా తీర్చిదిద్దాలని, వీఈఆర్‌ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణను వివాదాలు లేకుండా జరపాలని అధికారులకు సీఎం సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఇలా మూడు ఎకనమిక్‌ రీజియ న్లుగా మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై తొలిసారి విశాఖలో శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహిం చారు. ఇందులో విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్‌ ఇతర రంగాలకు సంబం ధించి 49 ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.

10 పాలసీలతో అభివృద్ధి చేద్దాం
2024లో 52 బిలియన్‌ డాలర్ల జీడీపీతో ఉన్న వీఈఆర్‌ను 2032 నాటికి 125 నుంచి 135 బిలియన్‌ డాలర్ల ఎకాన మీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 7 గ్రోత్‌ డ్రైవర్స్‌, 10 పాలసీలతో వీఈఆర్‌ అభివృద్ధి చేద్దామని, దీంతో 30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వీఈఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ సమర్ధంగా అమలు చేస్తే 2047 నాటికి 750 నుంచి 800 బిలియన్‌ డాలర్ల ఎకానమీకి చేరుకోవచ్చన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రానున్న 3 నెలల్లో ఏం చేయాలనే దానిపై అధికా రుల కు సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వీఈఆర్‌ పరిధిలో విస్తృతంగా ఉన్న వన రులు వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చని తెలిపా రు. స్టీల్‌ సిటీ, ఇండస్ట్రియల్‌ సిటీ, ఫార్మా సిటీ, టూరిజం ఇలా అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు వీఈఆర్‌లో వీలు ఉంద న్నారు. అనకాపల్లిలో త్వరలో మెడ్‌టెక్‌ జోన్‌-2 ప్రారంభిస్తా మని, టాయ్స్‌ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. డిఫెన్స్‌ తయారీ కంపెనీలను ఆకర్షిం చాల్సి ఉందన్నారు. రీజియన్‌లోని ఏజెన్సీ ప్రాంతాలను మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయాలని, రహదారుల విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. ప్రతి 2 నెలలకు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యే కంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

శాఖల వారీగా యాక్షన్‌ ప్లాన్‌
వీఈఆర్‌ కోసం వాణిజ్య పరిశ్రమలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పర్యాటకం, ఐఅండ్‌ఐ, ఆర్‌అండ్‌బీ, ఐటీఈ అండ్‌ సీ, వ్యవసాయం, అటవీ, వైద్యారోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ, విద్యుత్‌ ఇలా శాఖల వారీగా విడివిడిగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. వీఈఆర్‌ పరిధిలో ప్రస్తుతం చేపట్టిన, నూతనంగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపైనా ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు సమష్టిగా ముందుకొస్తే ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రలో వలసలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పారు. అవసరానికి మించి డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించకుండా ఐటీ, ఏఐ సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

ప్రాంతాలవారీ అనుకూల పంటలపై నివేదిక
విభిన్న పంటల సాగుకు విశాఖ రీజియన్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆయిల్‌ పామ్‌ను ప్రోత్సహిస్తూనే అంతర పంటలుగా కోకో, అరటి, మిరియాలు వంటి పంటలను పండిరచేలా చూడాలి. ఏ ప్రాంతం.. ఏ పంటలకు అనుకూలం అనే దానిపై జిల్లాల కలెక్ట ర్లు నివేదిక తయారు చేయాలి. ఏజెన్సీలో స్పైసెస్‌, స్ట్రాబెర్రీ వంటి వాటితో సహా అన్ని పంటలు పండిరచేందుకు అవకాశం ఉంది. దానిని వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. లాభసాటి పంటల వైపు రైతుల్ని మళ్లించేలా ప్రయత్నిం చా లని.. పౌల్ట్రీ ఫామ్‌లు పెద్దఎత్తున వస్తే ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ రీజియన్‌లో సాగును ప్రోత్సహించాలని సూచిం చారు. అన్ని చెరువులు, రిజర్వాయర్లను నింపాలని.. ఆక్వా కల్చర్‌ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను వచ్చే వీఈఆర్‌ సమీక్షా సమావేశానికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

వీఈఆర్‌ పరిధిలో మొత్తం 9 జిల్లాలు..వివరాలు
వీఈఆర్‌ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్‌ఆర్‌, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం 1.65 కోట్ల జనాభా, 38,000 చదరపు కి.మీ విస్తీర్ణం, 52 బిలియన్‌ డాలర్ల జీడీపీ, 3,170 డాలర్ల తలసరి ఆదాయం, 70 లక్షల వర్క్‌ ఫోర్స్‌ ఉంది. ఏపీలో వీఈఆర్‌ భాగస్వామ్యం.. 31 శాతం భౌగోళిక విస్తీర్ణం, 23 శాతం జనాభా, 30 శాతం జీడీపీగా ఉంది. 7 గ్రోత్‌ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి.. గ్లోబల్‌ పోర్ట్‌, నెక్ట్స్‌ జెన్‌ ఐటీ, అగ్రికల్చర్‌, టూరిజం, హెల్త్‌ కేర్‌ హబ్‌, ప్లాన్డ్‌ అర్బనైజేషన్‌-హౌసింగ్‌, అత్యుత్తమ మౌలిక వసతులు ఉన్నాయి. మొత్తం 6 పోర్టులు ఉండగా ప్రస్తుతం ఉన్న ఆపరేషనల్‌ పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్‌ వాటర్‌, కాకినాడ యాంకరేజ్‌ పోర్టులు..కొత్త పోర్టులు కాకినాడ గేట్‌ వే, మూలపేట ఉన్నాయి. కొత్తగా 7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులు, 77 కి.మీ మేర వైజాగ్‌ మెట్రో రైల్‌ రానున్నాయి. 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, వరల్డ్‌ క్లాస్‌ నర్సరీ, ఫుడ్‌ పార్క్స్‌, ఆక్వాపార్క్‌, 5 ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీఈఆర్‌ అభివృద్ధికి అదనంగా 7.5 లక్షల ఇళ్లు, 10 వేల హోటల్‌ రూములు, 20 వరకు మెడికల్‌, ఐటీ, స్కిల్లింగ్‌ కాలేజీలు, 5,000 హాస్పటల్‌ బెడ్స్‌, పరిశ్రమలకు 50 వేల ఎకరాలు, 50 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ సముదాయం, 60 మిలియన్‌ చదరపు అడుగుల గిడ్డంగులు అవసరం ఉంది.

ప్రత్యేక పర్యాటక కేంద్రంగా విశాఖ
కైలాసగిరి నుంచి భీమిలి వరకు 40 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటకానికి కోర్‌ సిటీగా అభివృద్ధి చేయాలని మాస్టర్‌ ప్లాన్‌లో రూపొందించారు. ప్రధానంగా 5 బీచ్‌ ఫ్రంట్‌లు, వరల్డ్‌ క్లాస్‌ థీమ్‌ పార్క్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ హబ్‌లతో అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దనున్నారు. కైలాసగిరి మాస్టర్‌ ప్లాన్‌ కింద మెగా రీ డిజైన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమా వేశానికి మంత్రులు నారా లోకేష్‌, కె.అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్‌, కందుల దుర్గేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్రతో పాటు సీఎస్‌ విజయానంద్‌, ఉన్నతాధికారులు, 9 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

Previous Post

విశాఖలో మంత్రి లోకేష్‌ 77వ రోజు ప్రజాదర్బార్‌

Next Post

విశాఖలో టెక్‌ తమ్మినకు లోకేష్‌ శంకుస్థాపన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

కార్యకర్త
@ April 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

కార్యకర్త
@ April 27, 2026
జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!
ఆంధ్రప్రదేశ్

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు
ఆంధ్రప్రదేశ్

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం

చైతన్యరధం
@ April 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026

కార్యకర్త
@ April 26, 2026
Load More

ముఖ్య వార్తలు

నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist