- గత ప్రభుత్వంలో భూ అక్రమాలపై విచారణ
- భూముల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
గుడ్లవల్లేరు(కౌతవరం): గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రెవె న్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో రూ.23 లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరించిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కౌతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్‌పీ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనగాని మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో పెట్టుబడులు ఆకర్షించి పరిశ్ర మలు ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పునాది వేస్తున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో గుడివాడ అభివృద్ధి కుంటుపడిరదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి మొదటిగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్లు తెలిపా రు. ఉప ముఖ్యమంత్రి ప్రతి పంచాయతీలో గ్రామసభలు పెట్టి 15వ ఆర్థిక సంఘం నిధు లు గ్రామ పంచాయతీలకు అందించి సర్పంచుల ఆత్మగౌరవం నిలబెట్టారని ప్రశంసిం చారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాలపై గ్రామాల్లో అధ్యయనం చేస్తున్నామని, భూముల సమస్యలు త్వరలో పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు కావా లని ఎమ్మెల్యే అడిగారని, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేల సహకారంతో గుడివాడ అభివృద్ధికి కృషి
గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే రాము సేవలు అభినందనీయమన్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో దోచుకున్న భూములపై విచారణ జరిపి వాటికి విముక్తి కలి గించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్యేల సహకారంతో బందరు పోర్టు పనులు పూర్తి చేస్తామని, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ కౌతవరంలో ఎన్నడూ లేని గొప్ప మెజారిటీతో గెలిపించిన గ్రామస్తుల కు ధన్యవాదాలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా అభివృద్ధికి సహకరిస్తున్నారని కొనియా డారు. నియోజకవర్గ కూటమి నాయకులు సురేంద్రబాబు, బూరగడ్డ శ్రీకాంత్, పిన్నమనేని బాబ్జి, వల్లభనేని బాబురావు, మల్లిపెద్ది సుబ్బారావు తదితరులు సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ డీఐజీ రవీంద్రనాథ్, జిల్లా రిజిస్ట్రార్ ఎం.ఎస్. గోపాలకృష్ణమూర్తి, సబ్‌రిజిస్ట్రార్ మధుసూదన్‌రావు, జిల్లా సహకార అధికారి కె.చంద్రశేఖర రావు, డివిజనల్ సహకార అధికారి వి.వి.ఫణికుమార్, హెచ్‌పీసీఎల్ అధికారులు, గుడివా డ ఆర్టీవో బాలసుబ్రమణ్యం, తహసీల్దార్ బి.లోకరాజు, ఎంపీడీవో ఇన్చార్జి సారథి, తదితరులు పాల్గొన్నారు.