చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

వీబీజీ రామ్ జీ శ్రామికుల వద్దకెళ్లి శ్రమదానం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్

by చైతన్యరధం
Sep 30, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలు వేసిన ఓటు వృథా కాలేదు… నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన
  • దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ పాలన… జెట్ స్పీడ్ వేగంతో అభివృద్ధి
  • గ్రామాభివృద్దిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు
  • ఉదయగిరి పల్లె పండుగ-3.0 బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
  • రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం
  • వీబీజీ రామ్ జీ శ్రామికుల వద్దకెళ్లి శ్రమదానం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్

ఉదయగిరి (చైతన్య రథం): ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, తాము ప్రజలకు సేవకులమే తప్ప పెత్తందార్లం కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటంపాడు మండలం, రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రూ.11,085 కోట్ల విలువైన గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పల్లె పండుగ-3.0లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,700 కోట్లతో 6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, రూ. 7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పాడి రైతుల కోసం రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలు నిర్మాణం, రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పల్లె పండుగ ద్వారా నాందీ పలుకుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ వేస్తున్నామని… రోడ్ల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని… ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని… పల్లెల్లోనూ కనివినీ రీతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. ప్రజల కళ్లకు కనబడేలా అభివృద్ధి చేస్తున్నామని… గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి పెట్టామన్నారు. గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మిస్తున్నామని… ప్రతి ఒక్కరికీ ఇల్లు.. ఇంటి స్థలం, విద్యుత్, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రకు గ్రామాలే నాందీ పలకాలని సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని… పేదరికం లేని గ్రామాలను తీర్చిదిద్దేందుకు.. ఆర్థిక అసమానతలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

తిరుమలలో మంత్రి నారా లోకేష్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పల్లె వికాసంలో పవన్ చొరవ అభినందనీయం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇప్పటికే మూడు పల్లె పండుగ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని, పల్లె వికాసంలో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా పవన్ అనేక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రెండున్నర దశాబ్దాల తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలోని వివిధ హోదాల్లో ఉన్న 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4,136 కోట్లు విడుదల చేశామని చెప్పారు. లక్షకు పైగా పంటకుంటలు తవ్వించడంతో పాటు పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మించామని వివరించారు. పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు 13 జాతీయ అవార్డులు రావడం అభినందనీయమన్నారు. 2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తాను, పవన్ కళ్యాణ్ ప్రజల వద్దకు వచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నాడు హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృథా కాలేదని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. చెప్పిన విధంగానే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని, జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనే ఎన్డీఏ ప్రభుత్వ మంత్రమని పేర్కొన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, సామాజిక పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. పేదలకు రూ.5కే అన్నం అందించే కార్యక్రమాన్ని గత
ప్రభుత్వం నిలిపివేసిందని, తాము తిరిగి అమలు చేస్తున్నామని చెప్పారు. మత్స్యకారులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని, ఆమూల్ బ్రాండ్ స్థాయిలో స్వయం బ్రాండ్ను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 30 ఏళ్ల క్రితం తానే శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే
ప్రారంభించానని చెప్పారు. వెలిగొండ ఫేజ్-2 పనులను కూడా పూర్తి చేసి.. ఉదయగిరి నియోజకవర్గాన్ని.. మార్కాపురం జిల్లాను సస్య
శ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హంద్రీ-నీవా ద్వారా రాయలసీమ చివరి భూములకు నీరందిస్తున్నామని, పోలవరం ఎడమ కాల్వ ద్వారా అనకాపల్లి ప్రాంతానికి నీటిని తీసుకెళ్తున్నామని తెలిపారు. ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య, ఉద్యాన పంటలను  కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఇళ్ల పట్టాలు అందించామని, విజయవాడలో మరో 24 వేల మందికి పట్టాలు అందించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పొట్టి శ్రీరాములు జలధార పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ పనులను భారీ ఎత్తున ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేలా వివిధ రంగాల్లో పరిశ్రమలను తీసుకొస్తూ ఏపీని నాలెడ్జ్ హబ్. తీర్చిదిద్దుతామని అన్నారు. కృష్ణపట్నం-రామాయపట్నం పోర్టుల మధ్య దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రైల్-రోడ్ కనెక్టివిటీని పెంచి నెల్లూరు-ప్రకాశం జిల్లాలను లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. బీపీసీఎల్ ప్లాంట్ ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయని, డిఫెన్స్ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నాయని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన నెల్లూరు, ఉదయగిరి ప్రాంతవాసులు తిరిగి ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదని, అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదని అన్నారు.తమ అభివృద్ధిని చూసి సహకరించాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదైతే.. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రజలదని సీఎం చెప్పారు.

ఉదయగిరి సభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు…
పల్లె పండుగ-3.0 కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక ప్రకటనలు చేశారు. పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కాల్వ పనులకు రూ.52 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 నిర్మాణానికి అవసరమైన రూ.85 కోట్లు అందిస్తామని తెలిపారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబు అవసరమైన క్లియరెన్సులు మంజూరు చేస్తామని, సీబీజీ ప్లాంట్ కు నిరంతర విద్యుత్ సరఫరాకు సహకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సోమశిల డ్యామ్ భద్రతకు అవసరమైన నిధులు సమకూరుస్తామని వెల్లడించారు. క్రాకటూరు డిస్ట్రిబ్యూటరీకి నిధులను సమకూర్చడంతోపాటు… వింజమూరు ప్రాంత పరిధిలో తాగు, సాగునీటి అవసరాల కోసం రాజవోలు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. కనిగిరి ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి.. బీటీ రోడ్ల పునర్నిర్మాణానికి వీబీజీ రామ్ గ్రాంట్ అందిస్తామని చెప్పారు. కనిగిరిలోని 189 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాళ్లపాడు రిజర్వాయర్ ద్వారా ఓలేటివారిపాలెం, గూడూరు, లింగసముద్రం మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కనిగిరి-బల్లిపల్లె వద్ద ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు సహకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం కాకొల్లువారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శ్రమదానం చేశారు. ‘వీబీజీ రామ్ జీ’ శ్రామికుల వద్దకు వెళ్లి పొలాల మధ్య డొంక రోడ్డు పనులను ప్రారంభించారు. కాలినడకన పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ‘వీబీజీ రామ్ జీ’ శ్రామికులతో కలసి సీఎం, డిప్యూటీ సీఎం, మాధవ్ గ్రూప్ ఫొటో దిగారు.

ఆసక్తిగా ర్యాంప్ వాక్… ఆకట్టుకున్న ఏర్పాట్లు…
సీఎం, డిప్యూటీ సీఎంలు సభా వేదిక మీదకు రాగానే సభికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తమ మెడలో వేసుకున్న కండువాలను గాల్లో ఊపుతూ సభికులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చూసి పలువురు మహిళలు ఆనందంతో డ్యాన్సులు చేశారు. ర్యాంప్ వాక్ చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలను ఫొటోలు తీసేందుకు పలువురు సభికులు ప్రయత్నించారు. తమ కుర్చీల్లో నుంచి లేచి ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఇక పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు. మామిడి తోరణాలు, రంగవల్లులతో అతిథులకు, ప్రజలకు స్వాగత ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం కాకొల్లువారిపాలెం గ్రామంలో పల్లె పండుగ-3.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పరిశీలించారు. గ్రామస్థులు వారికి పూలు జల్లి ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం.. గ్రామస్థులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగించారు.

Next Post

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

కార్యకర్త
@ September 30, 2026
తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’
ఆంధ్రప్రదేశ్

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist