చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

by చైతన్యరధం
Oct 2, 2026 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం
  • ద్వేషంతో అడ్డుకునేలా కోర్టుల్లో గొడ్డలి పార్టీ పిటిషన్లు
  • నాడు 24 శాతానికి కుదించి పదవుల్లో గండికొట్టారు
  • రాజకీయంగా ఎన్టీఆర్ బీసీలకు గుర్తింపు తెచ్చారు..
  • 1995లోనే మేం 34 శాతం రిజర్వేషన్లు కల్పించాం
  • రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు అధిగమించి సంక్షేమం ఇస్తున్నాం
  • అట్టడుగు వారిలో జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
  • ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతో పారిశ్రామికవేత్తలు వస్తున్నారు
  • రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం
  • అడ్డంకులకు ఆగిపోను..అభివృద్ధిలో రాజీ పడను
  • రేపల్లె ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

రేపల్లె(చైతన్యరథం): బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచింది… నిలిచేది తామేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీసీలకు చేయూతను అందించే విషయంలో ఎక్కడా రాజీ పడబోమని తేల్చిచెప్పారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజావేదికలో సీఎం ప్రసంగించారు. నాడు బీసీలకు రాజకీయం గా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారు.. తాను వారికి అండగా నిలబడి ప్రోత్సహించానని పేర్కొన్నారు. 1995లో స్థానిక సంస్థల్లో బీసీల కు 34 శాతం రిజర్వేషన్లు తెచ్చామని వెల్లడించారు. గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను 24 శాతానికి కుదించింద న్నారు. తద్వారా 16,800 మంది పదవీ అవకాశాలు కోల్పోయా రని చెప్పారు. ఇప్పుడు మళ్లీ మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లింది.

హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. 50 శాతం కంటే రిజర్వేష న్లు పెరగకూడదని కోర్టులో వాదించారు. కోర్టు ఆ జీవోలను కొట్టేసింది. దీనిపై శుక్రవారమే ఈ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళుతున్నాం. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావటమే ధ్యేయంగా కూటమి ప్రభు త్వం పనిచేస్తోంది. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వ్యక్తులు.. మేం మెగా డీఎస్సీతో ఉద్యోగాలు ఇస్తే ఆరోపణలు చేస్తున్నారు. 350 కేసులు కోర్టుల్లో వేసి నియామక ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెనుకబడిన వర్గాలపై ద్వేషంతో కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించే రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా బీసీలను రాజకీయంగా అండగా నిలబడే బాధ్యతను మేం తీసుకుంటాం. ఈ ప్రాంతంలో బీసీ బిడ్డ అనగాని భగవంతరావు చక్కగా పనిచేశారు. ఇప్పుడు మంత్రిగా అనగాని సత్యప్రసాద్ ప్రజల కోసం పనిచేస్తు న్నారు. బీసీలుగా నాయకులు రాజకీయంగా ఎదిగే అవకాశాలు కల్పించేది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యం
గడచిన 28 నెలలుగా ప్రతీ నెలా మొదటి తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నాను. చీఫ్ మినిస్టర్ అంటే కామన్ మ్యాన్ అని నేను విశ్వసిస్తున్నాను. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ పనిచేస్తున్నాను. పేదలకు న్యాయం చేయాలన్న బాధ్యతతో మేం పనిచేస్తున్నాం. ప్రతినెలా నాలుగు మార్లు ప్రజల ముందుకు వస్తున్నాం. ప్రతీ నెలా 1 తేదీన పేదల కు ఆర్థిక భద్రత కల్పించే పెన్షన్ల కార్యక్రమం, 9 తేదీన మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. గత పాలకు లు సృష్టించిన భూ వివాదాలను పరిష్కరిస్తూ ముందుకువెళ్తున్నాం. ఇక ప్రతిమూడో శనివారం పర్యావరణాన్ని కాపాడే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, 4వ శనివారం సంజీవని కార్యక్రమానికి హాజరవుతున్నాను. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసు కుని నిత్యం ప్రజా సేవకులుగా పనిచేస్తున్నాం. గడచిన రెండేళ్లుగా ప్రతీ వ్యక్తికి, ప్రతీ కుటుంబానికి సాధికారిత తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గొడ్డలి పార్టీ నేతలు ప్రజలు కొట్టిన దెబ్బకు అలిగి అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేస్తున్నారు.

గత పాలకులు అన్ని వ్యవస్థల్నీ భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారు. కష్టంతో సంకల్పంతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఒక్కో ఇటుకా పేరుస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం. ఆర్థిక సవాళ్లు అధిగమించి సంక్షేమం అందిస్తున్నాం. పెన్షన్లకే ఇప్పటికి రూ.76 వేల కోట్లు ఖర్చు చేశాం. వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ స్పీడ్‌తో సుపరిపాలన అందిస్తు న్నాం. పేదరికాన్ని ఆర్థిక కోణంలో కాదు మానవీయ కోణంలో ఆలోచించి జీవన ప్రమాణాలు పెంచడానికి చూస్తున్నాం. సంక్షే మంతో పాటు పీ4 కార్యక్రమం ద్వారా అట్టడుగున 20 స్థాయి మందికి చేయూత అందించేలా చర్యలు చేపట్టాం. బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారి జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

సంపద సృష్టికి మూలధన వ్యయం పెంచాం
రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో నివాస స్థలాల్లో పేదలకు పట్టాలు ఇచ్చాం. రూ.52 వేల కోట్ల విలువైన నివాస స్థలాలకు పట్టాలు ఇచ్చి వారి సమస్య లు పరిష్కరించాం. పేదల కుటుంబాలకు చేయుతను ఇచ్చే అంశాన్ని ఆర్థిక కోణంలో చూడటం లేదు. పేద కుటుంబాల్లో 3-4 పథకాల ద్వారా ఆర్థిక సహకారం చేయూత అందుతోంది. స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం, మత్స్యకార సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో ఇలా వేర్వేరు పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో ప్రతీ వర్గాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రం లో లక్ష మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాం. మరో 5 లక్షల మందిని కూడా వ్యాపారవేత్తలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతీ నెలా డబ్బులు ఇచ్చేసి వెళ్లడానికి రాలేదు. ప్రజలను కలిసి వారి బాగోగులు తెలుసుకోడానికి వస్తు న్నాను. అట్టడుగుస్థాయి వ్యక్తికి ఆర్థిక స్థోమత ఇచ్చి జీవన ప్రమాణాలు పెంచినప్పుడే అభివృద్ధి అన్నది నా సిద్ధాంతం. సంక్షే మాన్ని, అభివృద్ధిని సమానంగా చేపడుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 వేల కోట్ల పనులు చేపడుతున్నాం. గత పాలనలో రోడ్లన్నీ గోతులు తవ్వేశారు. గడచిన రెండేళ్లుగా వాటిని పూడ్చి రోడ్లు బాగు చేశాం.

సంజీవని కార్యక్రమం ద్వారా ప్రతీ పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా పర్యవేక్షిస్తాం. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించటం ద్వారా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు గడచిన రెండేళ్లలో వచ్చాయి. సంపద సృష్టించేలా క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ పెంచాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తున్నాం.రాయలసీమ జీవనాడి హంద్రినీవా మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి. వంద రోజుల్లో రూ.3,500 కోట్ల ఖర్చు చేసి చిట్టచివరి ప్రాంతమైన కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి మార్కాపురం వరకూ నీళ్లు తీసుకువచ్చాం. శ్రీశైలం మల్లన్న పాదాల నుంచి మార్కాపురం చెన్నకేశవ స్వామి చెంతకు కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ గోదావరి నీళ్లు తీసుకువెళ్లాం. ఎల్ నినో కారణంగా వర్షాలు పడక రాష్ట్రంలో కరవు వచ్చింది. డ్రామాలు ఆడటానికి గొడ్డలి పార్టీ బయల్దేరింది. వరుణ దేవుడి కృపవల్ల మనకు సరైన సమయంలో కాస్త వర్షాలు పడ్డాయి. కృష్ణానదిలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా డెల్టాకు తెచ్చాం. గతంలో కేవలం 13 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తెచ్చాం.పోలవరం పూర్తి అయితే కృష్ణా, గోదావరి డెల్టాలకూ నీటి సమస్యే ఉండదు. పట్టిసీమ అనే నిర్ణయం ఇక్కడి రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. గొడ్డలి పార్టీ విమర్శలకు భయపడితే కృష్ణాడెల్టాకు నీళ్లు వచ్చేవి కావు. ప్రతిపక్ష పార్టీ అంటే పోటీ తత్వం ఉండాలి. కాని గొడ్డలి పార్టీకి కుట్రతత్వం ఉంది. అభివృద్ధికి ఆటంకాలు కలిగించటమే గొడ్డలి పార్టీ పని అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

పర్యాటక ల్యాండ్ మార్క్‌గా సూర్యలంక
వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కూడా మనం కాపాడు కోవాల్సి ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలి. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్‌గా మారుస్తున్నాం. రూ. లక్ష కోట్లతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం. ఉద్యాన పంటలతో పాటు లాజిస్టిక్స్, పర్యాటకం ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులు వస్తాయి. బాపట్లలోని సూర్యలంక బీచ్ దీనిని గోవా తరహాలో అభివృద్ధి చేస్తాం. పర్యాటకుల్ని ఆకర్షించేలా దీనిని తీర్చిదిద్దాలని ప్రణాళికలు చేస్తున్నాం. ఆ పర్యాటకులను ఆకర్షించటం ద్వారా సూర్యలంక దేశ చిత్రపటంలో ఓ ల్యాండ్ మార్క్‌గా మారాలి. వాన్‌పిక్ ప్రాంతాన్ని గొడ్డలి పార్టీ అధినేత సర్వనాశనం చేశారు. అభివృద్ధే రాకుండా పోయింది. ఇష్టాను సారం అవినీతి చేసి సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున్నాడు. వాన్‌పిక్ ద్వారా అద్భుతమైన పారిశ్రామిక టౌన్‌షిప్ తయారు కావాల్సిన ప్రాంతాన్ని నాశనం చేశారు. ప్రజలకు జవాబుదారీ పరిపాలన ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగులకు నైపు ణ్యాలు కల్పించి మెరుగైన పౌరసేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. ఐగాట్- మిషన్ కర్మయోగి కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నైపుణ్యాలను పెంచుతోంది. మన ఉద్యోగులు 2.2 కోట్ల కోర్సులు చేసి దేశంలోనే ఏపిని అగ్రస్థానంలో నిలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు 4 వేల పైచికులు కోర్సులు చేసి నైపుణ్యాలు సాధించింది. ఇప్పుడు తన విద్యార్ధులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యను అందిం చేందుకు ఆ నైపుణ్యాలు ఆమెకు ఉపయోగ పడుతున్నాయి. వ్యక్తిగతంగా మనం కూడా మనమన రోజువారీ కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకో వాలి. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూడటం కాకుండా నైపు ణ్యాలు పెంచుకునే అంశంపై సమయం కేటాయించాలని కోరుతు న్నానని సూచించారు.

అభివృద్ధి అంశంలో రాజీలేదు
గత పాలకులు పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లపై బొమ్మ లు వేసుకోడానికి రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. రీసర్వే 2.0 ద్వారా భూవివాదాలు పరిష్కరించి రాజముద్రతో కూడిన పట్టాదా రు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం. శెట్టిపల్లి, కంగుమంది, అమలాపురం తదితర ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించాం. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నాం. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాం. మరో 5.5 లక్షల ఇళ్లను త్వరలోనే నిర్మించి ఇస్తాం. పౌరసేవలు ప్రజలకు దగ్గర చేసేలా వాట్సప్ గవర్నెన్సు ద్వారా సేవలు అందిస్తున్నాం. డీప్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక రోజులు, నెలలు పట్టాల్సిన పనులు ఇప్పుడు నిముషాల్లోనే పూర్తి అవుతోంది. ప్రధాని మోదీ నాయక త్వంలో భారత్ వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంగా మనం అవకాశాలను అందిపుచ్చుకోవాలి. విశాఖకు డేటా సెంట ర్లు తీసుకువస్తే గొడ్డలి పార్టీ నీటి సమస్య అంటూ అడ్డుపడు తోంది. అమరావతి అంటే ఎడారి అని, శ్మశానమని, మావిగన్ అంటున్నారు. అడ్డంకులకు ఆగిపోను, అభివృద్ధి విషయంలో రాజీ పడను. నాయకుడంటే ప్రజల రేపటి భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. అందుకే 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నాను. సమాజంలో చిట్టచివరి వ్యక్తి జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టాం. ఆదాయం, ఆరోగ్యం, ఆనందం అనే విధానంతో ముం దుకువెళుతున్నామని స్పష్టం చేశారు. ఈ సభకు మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కృష్ణప్రసాద్, నేతలు మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.

Previous Post

మాతృభూమికి రావాలని ఉంది

Next Post

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

కార్యకర్త
@ October 20, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026

కార్యకర్త
@ October 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.