చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

సాగునీటి రంగంలో విశేష కృషి చేసి వాటర్ మ్యాన్ గా నిలిచిన సీఎం చంద్రబాబుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్టాండింగ్ ఒవేషన్

by చైతన్యరధం
Sep 11, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆలోచనలతో పాటు… అమలూ ఉండాలి
  • వన్ స్టేట్-వన్ విజన్- వన్ టీమ్-వన్ మిషన్… అదే స్వర్ణాంధ్ర
  • కరవు ప్రాంతాలకు నీళ్లిస్తేనే నాకు సంతృప్తి
  • రియాక్టివ్ నుంచి ప్రో యాక్టివ్ దిశగా అధికారులు పనిచేయాలి
  • జిల్లాకు 25, నియోజకవర్గానికి 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి
  • మభ్యపెట్టే విధంగా కాదు… వాస్తవ నివేదికలు కావాలి
  • కలెక్టర్లు, అధికారులు, మంత్రుల మధ్య పోటీ ఉండాలి
  • 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సాగునీటి రంగంలో విశేష కృషి చేసి వాటర్ మ్యాన్గా నిలిచిన సీఎం చంద్రబాబుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్టాండింగ్ ఒవేషన్

అమరావతి (చైతన్యరథం): శాఖలు, అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు… రిజల్ట్స్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను, అధికారులను నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. గురువారం తొలిరోజు సమావేశంలో కలెక్టర్లకు, అధికారులకు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజా సేవకులుగా ఉందాం… ఈగోలు వద్దని కలెక్టర్లకు సూచించారు. గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఇక నుంచి తప్పనిసరి కావాలన్నారు. ఓనర్షిప్ తీసుకోగలిగితేనే… లీడర్షిప్ ఇవ్వగలరంటూ అంటూ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ’27 నెలల్లో అనేక వ్యవస్థాగత మార్పులు చేశాం. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్లాక్ చేశాం. రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రో యాక్టివ్ గవర్నెన్స్క వెళ్లాలి.

ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగే. ఫిర్యాదు పెండింగ్ అంటే ప్రజలకు న్యాయం పెండింగ్. విజన్ ఉన్నా.. దాన్ని అమలు చేయకుంటే… అవి నెరవేరని ఆశలుగానే మిగిలిపోతాయి. ఇప్పుడు కాలం మారింది. పనిచేస్తేనే సరిపోదు.. ఫేక్ ప్రచారాలకు కౌంటర్ కూడా ఇవ్వాలి. ఫేక్ ప్రచారం చేస్తుంటే లీడ్ తీసుకుని రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు… వాస్తవాలు చెప్పాలి. రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొత్తంగా 12 గంటలు జరుగుతుంది… ఇది చాలా కీలకం. సమస్యను దాచిపెడితే పెద్దది అవుతుంది… ఓపెన్ చర్చిస్తే పరిష్కారం లభిస్తుంది. సాధారణ పరిపాలన కాదు… ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలి. శాఖలు పోటీ పడాలి. జిల్లాలు పోటీ పడాలి. సెక్రటరీలు పోటీ పడాలి, కలెక్టర్లు పోటీ పడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుందాం… బెస్ట్ పాలసీలు అమలు చేద్దాం. వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్… అదే స్వర్ణాంధ్ర.’ అన్నారు.

సంబంధితవార్తలు

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)కు శంకుస్థాపన కార్యక్రమం

స్వాతంత్య్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు.

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

టీమ్ సక్సెస్తోనే అభివృద్ధి
‘ఈసారి లీడర్షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలి. కొన్నిచోట్ల లీడర్షిప్ లోపం ఉంది. ఉద్యోగుల సామర్థ్యం పెంపు కోసం వివిధ కోర్సులు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పటిదాకా 1.50 కోట్ల కోర్సులను సామర్ధ్యాలను పెంచేందుకు నిర్వహించాం. డీల్టిక్ గవర్నెన్స్ ఉంటే అనూహ్యమైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీని వినియోగించడం ద్వారా డేటా లేక్, అవేర్ లాంటి వ్యవస్థలతో నిర్ణయాల్లో వేగం పెరగాలి… సేవల్లో నాణ్యత పెంచాలి. గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించేందుకు ఆస్కారం ఉంది. మనకు వనరులున్నాయి. టెక్నాలజీ కూడా అందు బాటులో ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 27 నెలల్లో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను గాడినపెట్టాం. రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టాం.

హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తిచేశాం. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తిచేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్ట్ చేశాం. ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈవో టూ వాటర్ మ్యాన్ అంటూ కథనం రాసింది. సంతోషం కలిగింది. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో నా పేరు వచ్చినప్పుడు, సీఈవో సీఎం అన్నప్పుడు కూడా నేను ఇంత ఆనందించలేదు. రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది… దానిని సరిచేస్తూ నీటిని ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరు. గోదావరి-కావేరి-మహానది గంగ లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్. ఈ నీటి భద్రత, సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మ్యాన్గా పేరు పెట్టినందుకు సంతోషంగా ఉంది. 36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చాం. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం అధికారుల తోడ్పాటుతో ఈ విజయాలను సాధించగలిగాం. ఇప్పటిదాకా సాధించింది ఏ ఒక్కరివల్లో సాధ్యం కాలేదు.. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరివల్లా సాధ్యమైంది.. ఈ విజయం టీమ్ సక్సెస్.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

అవకాశాలను అన్లాక్ చేయండి… అభివృద్ధి సాధించండి
‘మనకు ఉన్న అవకాశాలను అన్లాక్ చేయగలిగాం. ప్రతి శాఖలోనూ సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి జిల్లాలోనూ 25 టాప్ ప్రాజెక్టులను గుర్తించాలి… నియోజకవర్గానికి 10-15 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధి చేయాలి. జిల్లాల్లో గ్రోత్ ఇంజిన్లను గుర్తించి దానికి అనుగుణంగా సంపద, ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి. కోనసీమ కొబ్బరికి, వరికి ఫేమస్… కానీ ఇప్పుడు ఆదాయంలో వెనుకపడింది. నూతన ఆదాయ మార్గాల్ని అన్వేషించాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ఏలూరు జిల్లా ఇప్పుడు అత్యుత్తమ జిల్లాగా మారింది. అందుకే అవకాశాలను అన్లాక్ చేయాలని పదేపదే చెప్తున్నాను. ప్రతిస్పందించే పాలన ద్వారా సుపరిపాలన అందించాలి. క్షేత్రస్థాయిలో ప్రజలను కలవాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై సత్వరం స్పందించాలి. జిల్లా కలెక్టర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోవాలి. మా హయాంలో పలానా జిల్లాలో ఈ పని చేశామని ప్రతి కలెక్టర్ గర్వంగా చెప్పుకునేలా పనిచేయాలి. రియాక్టివ్ గవర్నెన్స్ కంటే ప్రో యాక్టివ్ గవర్నెన్స్ ఉండాలి. ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయంటే అంటే అభివృద్ధి-పాలన పెండింగులో ఉన్నట్టే. ప్రభుత్వ సేవలను సక్రమంగా అందినప్పుడే ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. నాకు పరిపాలన కంటే సుపరిపాలన ముఖ్యం. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో… అభివృద్ధి సాధించే విషయంలో పోటీపడాలి.’ అని ముఖ్యమంత్రి వివరించారు.

నెలవారీ నివేదికలతో అభివృద్ధి ప్రయాణం
“ప్రతి నెలా ఆర్థిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నాం. ప్రతి మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నాం. 2022-23 బేస్ ఇయర్ గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైంది. తయారీ రంగంలోనూ అభివృద్ధి నమోదైంది. జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25,450 కోట్ల మేర పెరిగాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం. 120 ఏళ్ల నాటి భూ సమస్యల్ని కూడా పరిష్కరిస్తున్నాం. 1908 నుంచి అమలాపురంలో గ్రౌండ్ రెంట్ భూముల విషయంలో నిర్ణయం తీసుకుని 1,416 మందికి పట్టాలు ఇచ్చాం. 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేసే బాధ్యత మనందరిదీ. పాలన అంటే గుడ్డిగా పనిచేయటం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలి. బెస్ట్ పాలసీలు తెచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేయాలి. కొత్త ఆలోచన-కొత్త ఆవిష్కరణలతో అంతా కలిసి పనిచేద్దాం. ప్రస్తుతం 13.44 శాతం వృద్ధి నమోదైంది. దీనిని 15శాతం దిశగా తీసుకెళ్లాం.’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ఇద్దరు మహిళా అధికారులకు సీఎం ప్రశంసలు
‘కొందరు వ్యక్తులు ఫేక్ ప్రచారంతో సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా స్పందిస్తే దానికి కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరైన సమయంలో స్పందించకపోతే ఆ శిక్ష ప్రభుత్వానికి పడుతుంది. కొందరు రాజకీయాలు చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ-2025లో ఎక్కడా తప్పు జరగలేదు. స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలిచ్చాం. కానీ కొందరు అదే పనిగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. దీనిపై ఇద్దరు మహిళా అధికారులు చక్కగా స్పందించి కౌంటర్ ఇచ్చారు… వారిని అభినందిస్తున్నా. ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు, విజయవాడ అంబేడ్కర్ విగ్రహం, విశాఖ బీచ్ రోడ్డులో ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దుష్ప్రచారం ఆపకపోతే వారి పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని నినదించారు. గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టులోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30వేల మంది చనిపోయారు. వారి ఆరోగ్యం కూడా దెబ్బతింది. కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నాం. విద్యుత్ టారిఫ్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది తీవ్రమైన ఎల్ నినో కారణంగా నీటి భద్రత ఓ సవాలుగా మారింది. ఈసారి రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 85శాతం నీటి నిల్వలు ఉంటే ఈసారి 57శాతం మాత్రమే ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జలజీవన్ లాంటి మిషన్ను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదు. అవిచేసి ఉంటే నీటి భద్రతకు ఆస్కారం ఉండేది. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరివ్వగలిగే వాళ్లం. తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి రాజీ లేదు. పీఎండీఎస్, ప్రకృతి సేద్యం ద్వారా ప్రతి ఎకరాను సాగులోకి తీసుకురావాలి. సంక్షోభంలోనే కలెక్టర్ల నాయకత్వం వెలుగు చూడాలి.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

సీఈవో టు వాటర్ మ్యాన్
ఎకనమిక్ టైమ్స్ వచ్చిన వాటర్ మ్యాన్ ఆర్టికల్ గురించి కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. సాగునీటి రంగంలో సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని అభినందిస్తూ కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ‘నీటి వనరుల రంగంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సాధించిన విజయాలను దేశం గుర్తించింది. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల గురించి వివిధ రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిశ్శబ్ద పురోగతి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెస్సులోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. అందుకే హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వగలిగాం. ఉమ్మడి రాష్ట్రంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ టెక్నాలజీని తీసుకువచ్చి రాష్ట్రంలో అమలుచేశాం. గతంలో డ్రిప్ పైప్ ఖరీదు మీటరు రూ.16. ఇప్పుడు 30 ఏళ్ల ద్రవ్యోల్బణం తర్వాత రూ.1.60కే దొరుకుతోంది. రాయలసీమ జిల్లాల్లో డ్రిప్ ద్వారా చేసిన సాగు, సృష్టించిన సంపదే దీనికి ఉదాహరణ. పట్టిసీమ ప్రాజెక్టును కొందరు వ్యతిరేకించారు. కానీ ఆదే ప్రాజెక్టు నుంచి ఇప్పటిదాకా 500 టీఎంసీల నీటిని తరలించగలిగాం. ప్రకాశం బ్యారేజీని ఇప్పటివరకు 200 సార్లు నింపగలిగాం. డెల్టా ప్రాంతానికి నీరు ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన నిశ్శబ్ద నీటి ప్రయాణాన్ని రాష్ట్ర ప్రజలు, దేశం కూడా గుర్తించింది. రైతుల గురించి సీఎం పడుతున్న నిరంతర తపనను ఎకనమిక్ టైమ్స్ పత్రిక వాటర్మ్యాన్ ఆయన్ను కీర్తిస్తూ కథనం రాసింది. ఇది సీఎం సాధించిన విజయం.. ముఖ్యమంత్రి విజయంలో ఏపీ అభివృద్ధి ఉంది.” అని మంత్రి అన్నారు. కాన్ఫరెన్సులో మంత్రులు, సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను గురువారం సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.

Next Post

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే
ఆంధ్రప్రదేశ్

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
మాతృభూమికి రావాలని ఉంది
ఆంధ్రప్రదేశ్

మాతృభూమికి రావాలని ఉంది

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం
ఆంధ్రప్రదేశ్

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం
ఆంధ్రప్రదేశ్

తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం

చైతన్యరధం
@ October 2, 2026
సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు

చైతన్యరధం
@ October 2, 2026
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు
ఆంధ్రప్రదేశ్

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
మాతృభూమికి రావాలని ఉంది

మాతృభూమికి రావాలని ఉంది

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist