టిడిపి హయాంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం చెట్నిహళ్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో మంచినీరు, డ్రైనేజి, వీధిదీపాల సమస్య ఉంది. ఇసుక మాఫియా కారణంగా గ్రామంలో రోడ్లు దెబ్బ తింటున్నాయి. శ్మశానవాటికకు రహదారి సౌకర్యం లేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది.
టిడిపి ప్రభుత్వం వచ్చాక మా సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం. చెట్నిహళ్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.