చెరువులు తిరిగి మత్స్యకారులకు అప్పగిస్తాం
నిబంధనలను తొలగించి మత్స్యకారులను ఆదుకుంటాం
ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలకు తేడా తెలియని సీఎం
మత్స్యకారులతో ముఖాముఖిలో యువనేత లోకేష్
తుని: మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీఓ 217 టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసి, చెరువులు తిరిగి మత్స్యకారులకు అందిస్తామని యువ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. తుని నియోజకవర్గం పెరుమాళ్లపురం జిఎంఆర్ హాస్పటల్ సమీపంలో మధ్యాహ్న విడిది కేంద్రం వద్ద మత్స్యకారులతో యువ నేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సం దర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఉల్లి గడ్డకి, బంగాళా దుంపలకి తేడా తెలియని వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ ఎక్కడ చదివాడో తెలియదు. టెన్త్ పేపర్లు కొట్టేసి పాసయ్యాడు. ఆయన మాటలు విన్నాక పాదయాత్ర చేసింది జగనా లేక డూప్ నా అనే అను మానం కలుగుతోంది. తుఫాను వలన మత్స్యకారులు, రైతులు నష్టపోతే పరామర్శించే మనస్సు జగన్‌కి రాలే దు. మత్స్యకారులు కష్టాన్ని నమ్ము కొని బతుకుతారు. సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. గంగ మ్మనే నమ్ముకొని మత్స్యకారులు జీవిస్తారు. బాబు హ యాంలో ఏపి మత్స్యకారప్రదేశ్… జగన్ హయాంలో ఫినిష్ ఆంధ్ర… బోటు, వలలు, డీజిల్ సబ్సిడీ, బీమా, 50ఏళ్లకే పెన్షన్, వేట నిషేధం సమయంలో సహాయం, జిపిఎస్, మోపెడ్, ఐస్ బాక్సులు, వ్యాన్లు అన్ని మత్స్య కారులకు టిడిపి సబ్సిడీలో అందించింది.టిడిపి హయా ంలో మత్స్యకారులకు రూ.800కోట్లు సబ్సిడీ రూపంలో అందించాం. వైసిపి హయాంలో మత్స్యకారులకు చేసిం ది ఏమీ లేదు. ఒక్క సబ్సిడీ కార్యక్రమం లేదు.
మత్స్యకారులను ఆదుకుంటాం
పైప్ లైన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటాం. మత్స్య కారుల పిల్లల చదువుల కోసం 3గురుకుల పాఠశా లలు టిడిపి ఏర్పాటు చేసింది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో 5గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బోట్లకి ఇన్స్యూ రెన్స్ అందిస్తాం. మత్స్యకారులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా ను.జగన్ హయాంలో మత్స్యకారులు బాధితులు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెట్టిన అనవసర నిబంధనలు తొలగించి వేటకి వెళ్లి చనిపోయిన మత్స్య కారుల కుటుంబాలను ఆదుకుంటాం.
జగన్‌కు బీసీలంటే చిన్నచూపు
జగన్ పరదాలు కట్టుకొని పంట పొలాలు పరిశీ లించడానికి వెళ్ళాడు. జగన్‌కి బీసీలు అంటే చిన్న చూపు. 26వేల మంది బీసీలపై కేసులుపెట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. టిడిపి హయాంలో మత్స్య కారులు వేటకు వెళ్ళి చనిపోతే వెంటనే ఆ కుటుంబా నికి 5 లక్షల ఆర్థిక సాయం అందించే వాళ్ళం. జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వేట నిషేధం సమయంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తాం.
ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తాం
జగన్ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని, హేచరిస్‌ని చంపే సింది. కాలుష్యం లేని కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు సముద్రంలో కలవకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాం ట్‌లు ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎలాఅయితే బోట్లు, ఇంజిన్, వలలు, జీపీఎస్, ఐస్ బాక్సులు ఎలా అయితే ఇచ్చామో…తిరిగి సబ్సిడీలో అందిస్తాం.
రూ.10 ఇచ్చి వంద కొట్టేస్తున్న జగన్
కుడి చేత్తో 10రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడు జగన్. విధులు, నిధులు లేని కార్పొరేషన్లు పెట్టి బీసీలను జగన్ మోసంచేసాడు. బీసీ మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దిక్కు లేదు. నేను వైసిపి వారికి, మంత్రికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. ఎవరి హయాంలో మత్స్యకారులకు మేలు జరిగిందో చర్చకు నేను సిద్ధం. ఎన్నికల ముందు జగన్ అనేక హామీలు ఇచ్చి మత్స్యకారులను మోసం చేశాడు. 45ఏళ్లకే పెన్షన్, హౌసింగ్ లోన్ కింద 5 లక్ష లు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేసాడు.
టిడిపి హయాంలోనే మత్స్యకారులకు న్యాయం
మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ… టిడిపి హయాంలోనే మత్స్యకారులకు న్యాయం జరిగింది.చెరు వుల్లో చేప పిల్లలు వదలడం దగ్గర నుండి చేపలు పట్టు కోవడానికి వలలు ఇవ్వడం వరకూ అన్నీ ఇచ్చి మత్స్య కారులను ఆదుకుంది చంద్రబాబు. టిడిపి హయాంలో బోట్లు,వలలు, జిపిఎస్, మోపిడ్,వ్యాన్లు, ఇతర సామగ్రి అంతా 90శాతం సబ్సిడీలో ఇచ్చాం. వైసిపి ప్రభుత్వం మత్స్యకారుల పొట్ట కొట్టింది.వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వడం లేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరు వాత మత్స్యకారులు వేటలో చనిపోతే సాయం కూడా ఇవ్వడం లేదు. ఫార్మా, కెమికల్ కంపెనీల వ్యర్థాలు సముద్రంలో కలవడం వలన మత్స్య సంపద తగ్గిపో తుంది. టిడిపి హయాంలో బోట్లు, వలలు, జిపిఎస్ ఇతర సామగ్రి సబ్సిడీలో అందించే వారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇవ్వడం లేదు.
మత్స్యకార ప్రతినిధులు మాట్లాడుతూ…
కాకినాడ సెజ్‌లో ఉన్న కంపెనీల్లో 70 శాతం స్థాని కులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని జగన్ హామీ ఇచ్చి మోసం చేశాడు. పైప్ లైన్ కారణంగా బోట్లు, వలలు పోయి నష్టపోతున్నాం. జగన్ ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వడం లేదు. బొట్లకి ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి హయాంలో అమలైన ఇన్స్యూరెన్స్ స్కీం ని వైసిపి అమలు చెయ్యడం లేదు. డీజిల్ సబ్సిడీ పెంచాలి, పెద్ద బోట్లకి 8 వేల లీటర్ల డీజిల్ ఇవ్వాలి. మత్స్యకారుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిలకి సహాయం చెయ్యాలి. వేట విరామం సమయంలో అందించే సాయం అందించాలి. మత్స్యకారులకు, బోట్లుకి, వలలు కి జగన్ ప్రభుత్వం లో ఇన్స్యూరెన్స్ అందడం లేదు. డీజిల్ రేటు పెరిగినా జగన్ ప్రభుత్వం సబ్సిడీ పెంచడం లేదు. వలలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సముద్రంలో చనిపోతే డాక్టర్ సర్టిఫికేట్ కావాలని జగన్ ప్రభుత్వం అంటుంది.