చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

ప్రకాశం జిల్లా 'మీ భూమి-మీ హక్కు' బహిరంగ సభలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
October 10, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రిజర్వేషన్లను అడ్డుకునేందుకే గొడ్డలి పార్టీ పిటిషన్లు
  • రైతులు హలాన్ని పట్టుకోవాలి అర్జీలు కాదు
  • రాజముద్రతో భూమికి భరోసా కల్పించాం
  • కొండపిలో 2,915 ఎకరాల గర్భకండ్రిక భూ సమస్యల పరిష్కారం
  • ప్రకాశం జిల్లా ‘మీ భూమి-మీ హక్కు’ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
  • రూ.166 కోట్లతో పాలేరు రిజర్వాయరు శంకుస్థాపన

గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముకగా నిలిచారని, వారికి అన్నివేళలా అండగా నిలవడమే తనబాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకు నేందుకే గొడ్డలి పార్టీ కోర్టుల్లో పిటిషన్లు వేసింద న్నారు. కోర్టుల తీర్పులు ఎలా వున్నా పార్టీపరంగా బీసీలకు 34శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయిస్తా మని హామీ ఇచ్చారు. రైతులు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలే తప్ప.. భూమి సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వచ్చే మార్చి నాటికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని 2,915 ఎకరాల గర్భకండ్రిక భూముల సమస్యలను పరిష్కరించామని చెప్పారు. రూ.166.40 కోట్లతో పోతుల చెంచయ్య-పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

కొండపి (చైతన్యరథం): రైతులు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలే తప్ప.. భూమి సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భూమి రైతుదేనని, దానిపై హక్కు కూడా రైతుదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ వివాదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో హక్కులను పరిరక్షించేందుకు రీ సర్వే ప్రక్రియ చేపట్టా మని తెలిపారు. రీ సర్వే 2.0అనంతరం రాజముద్ర తో కూడిన పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టా దారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు గ్రామసభలో ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత పాలనలో భూము లకు భద్రత లేకుండా పోయిందని, ఆక్రమణలు, దందాలు, భూ వివాదాలతో రెవెన్యూ వ్యవస్థను దెబ్బతీశారని ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రజల ఆస్తులపై ఫొటోలు వేసుకుని, సర్వే రాళ్లపై రాజకీయ నాయకుల బొమ్మలు పెట్టారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములపై వివా దాలు సృష్టించారని, అందుకే ఆచట్టాన్ని రద్దుచేశామని తెలిపారు.

గతంలో రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న వారి భూములను 22(ఎ) నిషేధిత జాబితాలో చేర్చా రని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 16.48లక్షల ఎకరాలను 22(ఎ) జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. కంగుంది, అమలాపురం, శెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో వివాదాల్లో ఉన్న 41వేల ఎకరాలకు విముక్తి కల్పించా మని చెప్పారు. ప్రకాశంజిల్లాలో నాలుగు మండలాల్లో ని 2,915 ఎకరాల గర్భ కండ్రిక భూముల సమస్య లను కూడా పరిష్కరిస్తున్నామని వివరించారు. పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించేందుకే ప్రతినెలా ప్రజల ముందుకు వస్తు న్నానని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం సక్ర మంగా పూర్తయ్యేంత వరకూ రైతుల వద్దకు వస్తూనే ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో ఏఒక్కరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే తాను స్వయంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానన్నా రు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని వెల్లడించారు. అక్టోబరులోనే 790గ్రామాల్లో నాలుగు లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. ఇంకా పంపిణీ చేయాల్సిన 51లక్షల పాస్ పుస్తకాలకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, అర్హు లైన రైతులందరికీ అందిస్తామని చెప్పారు. చిట్టచివరి రైతు వరకూ పారదర్శకంగా హక్కు పత్రాలు అందించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

రూ.166 కోట్లతో పాలేరు రిజర్వాయర్
ప్రకాశం జిల్లాలోని ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు పోతుల చెంచయ్య- పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.166.40 కోట్లతో రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ ద్వారా 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాల్లో 35వేల మందికి తాగునీరు అందుతుందని వివరించారు. పొన్నలూరు మండలం వేమూరుపాడు రహదారి, పాలేరు నదిపై వంతెన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశామని తెలిపారు. రూ.28 కోట్లతో ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టు రెండో దశను కూడా పూర్తిచేసి అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నీరు అందుబాటులోకి రాకుండానే రిబ్బన్లు కట్ చేయడం, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసినట్టు ప్రచారం చేసుకోవడం తమ విధానం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 40 చిన్నా పెద్ద నదులను అనుసంధానించి నీటి గ్రిడ్ ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందించవచ్చన్నారు. గోదావరి నుంచి కావేరి వరకు  అనుసంధానం జరిగితే నాలుగు రాష్ట్రాల్లో నీటి కొరతను అధిగమించే అవకాశం ఉంటుందని చెప్పారు. రూ.35వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. భూగర్భ జలాల పెంపునకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్తోతో ప్రకాశం అభివృద్ధి
ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలను ప్రపంచ స్థాయి ఉద్యానవన పంటల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘పల్లె పండుగ’ ద్వారా రూ.11వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, మంగళగిరి తదితర ప్రాంతాల్లో 60 వేల మందికి నివాస స్థలాలపై హక్కులు కల్పించామని, వాటి మార్కెట్ విలువ రూ.52వేల కోట్లుగా ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అదనంగా మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా అమరజీవి -జలధార కింద రూ.31వేల కోట్లతో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రూ.1.5 లక్షల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు గతంలోనే పూర్తి కావాల్సి ఉన్నా నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

బీసీలకు పార్టీపరంగా 34 శాతం రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయానికి  సంబంధించి స్పందించిన ముఖ్యమంత్రి.. పార్టీ పరంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు. టీడీపీకి బీసీలు వెన్నెముక అని… వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి పార్టీ ఎప్పుడూ కృషి చేసిందని చెప్పారు. గతంలో తాము తీసుకొచ్చిన 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టించిందని వాటిని 24 శాతానికి తగ్గించడం వల్ల అనేకమంది నష్టపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే న్యాయస్థానాల తీర్పులతో ఆ రిజర్వేషన్ల అమలుకు ఆటంకం ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టు సంబంధిత జీవోను కొట్టివేసినప్పటికీ, పార్టీపరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఓటమి తప్పదనే ‘సర్’ పేరిట స్థానిక ఎన్నికలను కూడా అడ్డుకోవాలన్న ఆలోచనతోనే గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లిందని సీఎం ఆక్షేపించారు.

ప్రజాభిప్రాయం ఆధారంగా పాలనలో మార్పులు
ప్రజల బాగోగులే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేవుడిని ప్రార్థించే సమయంలో కుటుంబానికి మంచి జరగాలని కోరు కోవడంతోపాటు ప్రజలకు మేలుచేసే ప్రభుత్వ పని తీరుపైనా ఆలోచనచేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను ఫోన్ ద్వారా నేరుగా తెలుసుకుని, అవసరమైన మార్పులు చేస్తున్నామని తెలిపారు. ప్రభు త్వ ఉద్యోగులు, అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేసి పౌరసేవల్లో పారదర్శకతను పెంచేందు కు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగ సామర్ధ్యాలను మరింత పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలాశ్రీవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 09-10-2026

Next Post

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.