- అధిక వడ్డీల పేరుతో వేధిస్తే క్రిమినల్ కేసులు
- హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక
అమరావతి(చైతన్యరథం): ఏలూరు కాల్ మనీ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం స్పందించారు. ఏలూరు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిస్తీలకు ముందే వడ్డీ కోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో కాల్‌మనీ దందాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్పిపిప్పి చేసే వారిని సహించబోమని హెచ్చరించారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతా మని తెలిపారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతా మని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారినే లక్ష్యంగా చేసుకుని చేస్తు న్న వడ్డీ వ్యాపారాలను సీరియస్‌గా తీసుకుంటామని తెలిపారు.